iPhoneలో యాక్షన్ బటన్‌ను ఉపయోగించి, కస్టమైజ్ చేయడం
మద్దతు ఉన్న మోడల్‌లలో, iPhoneకు రింగ్/సైలెంట్ స్విచ్ స్థానంలో యాక్షన్ బటన్ ఉంటుంది. మీరు యాక్షన్ బటన్‌ను నొక్కినప్పుడు ఏ ఫంక్షన్‌ను అమలు చేయాలనుకుంటున్నారో ఎంచుకోవచ్చు. బటన్‌ను సులభంగా యాక్సెస్ చేయవచ్చు కాబట్టి మీరు తరచుగా అమలు చేసే చర్యలకు ఇది బాగా ఉపయోగపడుతుంది. (యాక్షన్ బటన్ లొకేషన్ దిగువన చూపబడింది.) వేరే ఫంక్షన్‌ను అమలు చేయడానికి యాక్షన్ బటన్‌ను మార్చడం సులభం.

యాక్షన్ బటన్‌ను కస్టమైజ్ చేయడం
మద్దతు ఇచ్చే మోడల్‌లలో, సెట్టింగ్స్
> యాక్షన్ బటన్‌కు వెళ్ళండి.
మీరు యాక్షన్ బటన్‌కు కేటాయించగల చర్యలను సూచించే ఐకాన్లతో iPhone సైడ్ ఇమేజ్ కనిపిస్తుంది.
ఒక యాక్షన్‌ను ఎంచుకోవడానికి, మీరు ఉపయోగించాలనుకుంటున్న యాక్షన్‌కు స్వైప్ చేయండి, దాని పేరు చుక్కల దిగువన కనిపిస్తుంది.
చిట్కా: iPhoneను సైలెంట్ మోడ్‌లో ఉంచేలా యాక్షన్ బటన్‌ను కస్టమైజ్ చేయడానికి,
కు స్వైప్ చేయండి. మరొక యాక్షన్‌ను ఎంచుకోవడానికి, దాని వైపుగా స్వైప్ చేయండి.
ఎంచుకున్న యాక్షన్ కోసం అదనపు ఎంపికలు ఉంటే, యాక్షన్ దిగువన
కనిపిస్తుంది; ఎంపికల జాబితాను చూడటానికి దాన్ని ట్యాప్ చేయండి.
కంట్రోల్‌లు, షార్ట్‌కట్, సౌలభ్య సాధనాలు యాక్షన్ల కోసం, మీరు యాక్షన్ కింద ఉన్న బటన్‌ను ట్యాప్ చేసి, నిర్దిష్ట ఎంపికను ఎంచుకోవాలి, లేదంటే యాక్షన్ బటన్ వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు.
ఐకాన్
యాక్షన్
సైలెంట్ మోడ్: కాల్స్, అలర్ట్‌ల కోసం సైలెంట్, రింగ్ మోడ్ల మధ్య మారుతుంది.
ఫోకస్: నోటిఫికేషన్లను నిశ్శబ్దంగా ఉంచడానికి, అవాంతరాలను ఫిల్టర్ చేయడానికి ‘ఫోకస్’ను ఆన్ చేయండి.
కెమెరా: క్షణాన్ని క్యాప్చర్ చేయడానికి కెమెరా యాప్‌ను తెరవండి.
విజువల్ ఇంటెలిజెన్స్: మీ చుట్టూ ఉన్న ప్రదేశాలు, వస్తువుల గురించి మరింత తెలుసుకోవడానికి విజువల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించండి (iPhone 16e, iPhone 15 Pro, అలాగే iPhone 15 Pro Maxలలో అందుబాటులో ఉంది, ఇంకా Apple Intellignece అవసరం).
నోట్: Apple Intelligence is not available in all languages or regions. మీ డివైజ్, భాష, ప్రాంతంలో Apple Intelligence అందుబాటులో ఉందో లేదో చెక్ చేయడానికి, Apple Intelligenceను ఎలా పొందాలి అనే Apple మద్దతు ఆర్టికల్‌ను చూడండి.
ఫ్లాష్‌లైట్: మీకు అవసరమైనప్పుడు అదనపు లైట్‌ను ఆన్ చేయండి.
వాయిస్ మెమో: వ్యక్తిగత నోట్స్, సంగీతపరమైన ఆలోచనలు ఇంకా మరిన్నింటిని రికార్డ్ చేయండి.
సంగీతాన్ని గుర్తించండి: మీకు దగ్గరలో లేదా మీ iPhoneలో ప్లే అవుతున్న పాటను Shazam ద్వారా కనుగొనండి.
అనువదించండి: పదబంధాలను అనువదించండి లేదా వేరే భాషలో ఎవరితోనైనా సంభాషించండి.
మాగ్నిఫైయర్: మీకు దగ్గరలో ఉన్న వస్తువులను జూమ్ చేసి, వాటిని గుర్తించడానికి మీ iPhoneను మాగ్నిఫైయింగ్ గ్లాస్‌గా మార్చండి.
కంట్రోల్స్: మీ ఇష్టమైన కంట్రోల్‌ను త్వరగా యాక్సెస్ చేయండి.
షార్ట్‌కట్: యాప్‌ను తెరవండి లేదా మీకు ఇష్టమైన షార్ట్‌కట్‌ను అమలు చేయండి.
సౌలభ్య సాధనాలు: సౌలభ్య సాధనాల ఫీచర్‌ను వెంటనే ఉపయోగించండి.
యాక్షన్ లేదు
ఏమీ చేయవద్దు.
యాక్షన్ బటన్‌ను ఉపయోగించడం
యాక్షన్ బటన్‌కు కేటాయించిన చర్యను నిర్వహించడానికి, యాక్షన్ బటన్‌ను నొక్కి పట్టుకోండి.
అనేక ఫంక్షన్ల కోసం, సెట్టింగ్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయడానికి యాక్షన్ బటన్‌ను ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, ఎంచుకున్న యాక్షన్ ‘సైలెంట్ మోడ్’ అయితే, iPhoneను ‘సైలెంట్ మోడ్’లో పెట్టడానికి మీరు యాక్షన్ బటన్‌ను నొక్కి పట్టుకోండి . మీరు మళ్ళీ యాక్షన్ బటన్‌ను నొక్కి పట్టుకుంటే, అది ‘సైలెంట్ మోడ్’ను ఆఫ్ చేస్తుంది.
యాక్షన్ బటన్‌కు కంట్రోల్‌ను జోడించడం
మీరు కంట్రోల్ సెంటర్ కంట్రోల్‌ను, యాక్షన్ బటన్‌కు కేటాయించి, ఆపై యాక్షన్ బటన్‌ను ఉపయోగించి కంట్రోల్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు.
సెట్టింగ్స్
> యాక్షన్ బటన్‌కు వెళ్ళండి.
కంట్రోల్స్ యాక్షన్‌కు స్వైప్ చేసి, ఆపై ‘కంట్రోల్ ఎంచుకోండి’ను ట్యాప్ చేయండి.
కంట్రోల్ల ద్వారా స్క్రోల్ చేయండి లేదా మీకు కావలసిన కంట్రోల్ కోసం, దానిని కంట్రోల్ల పైన ఉన్న శోధన ఫీల్డ్‌లో నమోదు చేయడం ద్వారా శోధించండి.
మీరు జోడించాలనుకుంటున్న కంట్రోల్‌ను ట్యాప్ చేయండి.
ఉదాహరణకు, మీరు
ట్యాప్ చేయడం ద్వారా డార్క్ మోడ్‌ను యాక్షన్ బటన్‌కు కేటాయించవచ్చు. ఆపై మీరు యాక్షన్ బటన్‌ను నొక్కుతూ అలాగే నొక్కి ఉంచడం ద్వారా డార్క్ మోడ్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు.
యాక్షన్ బటన్‌తో విజువల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించండి
విజువల్ ఇంటెలిజెన్స్ మీ చుట్టూ ఉన్న ప్రదేశాలు, ఆబ్జెక్ట్‌లు, ఇంకా టెక్స్ట్ గురించి మరింత తెలుసుకోవడానికి మీకు సహాయపడుతుంది. మద్దతు ఉన్న మోడల్‌లలో (దిగువ చూడండి), మీరు విజువల్ ఇంటెలిజెన్స్‌ను యాక్సెస్ చేయడానికి యాక్షన్ బటన్‌ను ఉపయోగించవచ్చు.
నోట్: iOS 18.3 లేదా తర్వాతి వెర్షన్ ఉన్న iPhone 16eలో, iOS 18.4 లేదా తర్వాతి వెర్షన్ ఉన్న iPhone 15 Pro, iPhone 15 Pro Maxలో అందుబాటులో ఉంది. (కెమెరా కంట్రోల్ ఉన్న మోడల్‌లలో, విజువల్ ఇంటెలిజెన్స్‌ను యాక్సెస్ చేయడానికి దాన్ని క్లిక్ చేసి ఉంచండి.)
సెట్టింగ్స్
> యాక్షన్ బటన్‌కు వెళ్ళండి.
మీరు యాక్షన్ బటన్‌కు కేటాయించగల చర్యలను సూచించే ఐకాన్లతో iPhone సైడ్ ఇమేజ్ కనిపిస్తుంది.
విజువల్ ఇంటెలిజెన్స్ ఎంపిక స్క్రీన్‌పై కనిపించే వరకు ఎడమ లేదా కుడివైపుకి స్వైప్ చేయండి.
మీరు 1, 2 దశలను పూర్తి చేసిన తర్వాత, విజువల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించడానికి వాటిని రిపీట్ చేయనవసరం లేదు.
మీ iPhone కెమెరాను మీ ముందు ఉన్న వస్తువు వైపు చూపి, ఆపై యాక్షన్ బటన్‌ను నొక్కి ఉంచండి.
మరింత తెలుసుకోవడానికి స్క్రీన్‌పై ఉన్న ఎంపికలలో దేనినైనా ట్యాప్ చేయండి (ఎంపికలు మారుతూ ఉంటాయి, iPhoneలో విజువల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించండి చూడండి).
విజువల్ ఇంటెలిజెన్స్ ఫలితాలను మూసివేయడానికి
ను ట్యాప్ చేసి, ఆపై విజువల్ ఇంటెలిజెన్స్‌ను మూసివేయడానికి స్క్రీన్ దిగువ నుండి ఎగువకు స్వైప్ చేయండి.