iCloudలో మీ ఫోటోలను బ్యాకప్ చేసి, సింక్ చేయండి
మీ ఫోటోలు, వీడియోలను iCloudలో సురక్షితంగా స్టోర్ చేయడానికి మీరు iCloud ఫోటోలను ఉపయోగించవచ్చు. మీరు మీ అన్ని డివైజ్‌లలో iCloud ఫోటోలను ఆన్ చేసినట్లయితే, మీరు iPhoneలో తీసిన ఫోటోలు, వీడియోలను ఏదైనా డివైజ్‌లో చూడవచ్చు. మీరు మీ iCloud ఫోటోలు, వీడియోలను వెబ్ బ్రౌజర్లో కూడా యాక్సెస్ చేయవచ్చు.
iCloud ఫోటోలు ఆన్ చేసినప్పుడు, మీరు తీసే ఫోటోలు, వీడియోలు ఆటోమేటిక్‌గా అప్లోడ్ చేయబడతాయి, అలాగే పూర్తి రిజల్యూషన్‌తో వాటి ఒరిజినల్ ఫార్మాట్లో స్టోర్ చేయబడతాయి. ఒక డివైజ్‌లోని ఫోటో కలెక్షన్‌కు మీరు చేసే ఏవైనా మార్పులు, మీ ఇతర డివైజ్‌లలో కూడా కనిపిస్తాయి.
నోట్: మీరు మీ అన్ని డివైజ్‌లలో ఒకే Apple ఖాతాకు సైన్ ఇన్ చేసినట్లు, అలాగే మీ డివైజ్‌లు ఈ కనీస సిస్టమ్ అవసరాలను నెరవేర్చినట్లు నిర్ధారించుకోండి: iOS 8.3, iPadOS 13.1, macOS 10.10.3 లేదా తర్వాతి వెర్షన్ లేదా Windows 7.x లేదా తర్వాతి వెర్షన్లో iCloudతో కూడిన Windows డివైజ్.
మరింత తెలుసుకోవడానికి, మీ అన్ని డివైజ్‌లలో iCloud ఫోటోలు సెటప్ చేయడం చూడండి.
iCloud ఫోటోలను ఆన్ చేయడం
సెట్టింగ్స్
> [మీ పేరు] > iCloudకు వెళ్లండి.
ఫోటోలను ట్యాప్ చేసి, ఆపై ‘iPhoneను సింక్ చేయండి’ ఆన్ చేయండి.
iCloud మీరు తీసే ప్రతి ఫోటోను, వీడియోను ఆటోమేటిక్‌గా iCloudకు అప్లోడ్ చేస్తుంది, కావున మీ ఫోటోలు బ్యాకప్ చేయబడతాయి, అలాగే సింక్ చేయబడతాయి, మీరు ఏదైనా డివైజ్ నుండి, ఎప్పుడైనా మీ లైబ్రరీని యాక్సెస్ చేయవచ్చు.
మీ ఫోటోలు iCloudకు బ్యాకప్ చేయబడి ఉన్నాయో లేదో చెక్ చేయండి
మీరు iCloud ఫోటోలు మీ ఫోటోలను iCloudకు సింక్ చేస్తుందా లేదా అని చెక్ చేయవచ్చు, కావున మీరు మీ iPhoneకు ఏదైనా జరిగిన సందర్భంలో కాపీలను కలిగి ఉండవచ్చు.
మీ iPhoneలోని ఫోటోస్ యాప్
కు వెళ్లండి.
మీరు స్క్రీన్ ఎగువన కుడి మూలలో మీ సింకింగ్ స్టేటస్ ప్రివ్యూను చూడవచ్చు. మీరు దిగువ వాటిలో ఏదైనా చూడవచ్చు:
పసుపు బ్యాడ్జ్: iCloud సింకింగ్ పాజ్ చేయబడింది. వివరాలను చూడటానికి మీ ఖాతా ఐకాన్‌పై ట్యాప్ చేయండి.
పసుపు హెచ్చరిక ఐకాన్: మీ iCloud స్టోరేజ్ దాదాపుగా నిండిపోయింది. వివరాలను చూడటానికి మీ ఖాతా ఐకాన్‌పై ట్యాప్ చేయండి.
ఎరుపు రంగులో ఉన్న ఆశ్చర్యార్థక గుర్తు: మీ iCloud స్టోరేజ్ నిండి ఉంది. స్పేస్ సేవ్ చేయండి లేదా మరింత iCloud స్టోరేజ్‌ను పొందడం చూడండి.
బ్లూ బ్యాడ్జ్: మీరు షేర్ చేసిన లైబ్రరీ లేదా షేర్ చేసిన ఆల్బమ్ నుండి నోటిఫికేషన్లను అందుకున్నారు. వివరాలను చూడటానికి మీ ఖాతా ఐకాన్‌పై ట్యాప్ చేయండి.
మీ ఖాతా ఐకాన్ చుట్టూ పాక్షికంగా నింపబడి ఉన్న నీలి వృత్తం: iCloudలో ఫోటోలు యాక్టివ్‌గా అప్లోడ్ చేయబడుతున్నాయి. వివరాలను చూడటానికి మీ ఖాతా ఐకాన్‌ను ట్యాప్ చేయండి.
మీ ఖాతా ఐకాన్ చుట్టూ పాక్షికంగా నింపబడి ఉన్న గ్రే ఔట్‌లైన్: అప్లోడ్లు పాజ్ చేయబడ్డాయి. మీ ఖాతా వివరాలను చూడటానికి ఐకాన్‌ను ట్యాప్ చేయండి.
మరిన్ని వివరాలను చూడటానికి మీ ఖాతాను ట్యాప్ చేయండి. చివరిసారిగా మీ iPhone, iCloudతో సింక్ చేయబడిన వివరాలు ఖాతా ప్రొఫైల్‌కు దిగువన కనిపిస్తాయి.
మీ iPhoneలో స్పేస్‌ను సేవ్ చేయడం
iCloud ఫోటోలు మీ iPhoneలో స్టోరేజ్ స్పేస్‌ను సద్వినియోగం చేసుకోవడంలో మీకు సహాయపడతాయి. ‘iPhone స్టోరేజ్‌ను ఆప్టిమైజ్ చేయండి’ ఆన్‌లో ఉన్నప్పుడు, మీ పూర్తి‑రిజల్యూషన్ ఫోటోలు, వీడియోలన్నీ కూడా మీ iPhoneలోని స్టోరేజ్‌ను ఆదా చేసే వెర్షన్ల సహాయంతో, iCloudలో వాటి ఒరిజినల్ ఫార్మాట్లలో స్టోర్ చేయబడతాయి. ‘iPhone స్టోరేజ్‌ను ఆప్టిమైజ్ చేయండి’ డిఫాల్ట్‌గా ఆన్ చేయబడి ఉంది.
దీన్ని ఆఫ్ చేయడానికి, సెట్టింగ్స్ > [మీ పేరు] > iCloudకు వెళ్లండి. ఫోటోస్ యాప్ ట్యాప్ చేసి, ఆపై ‘ఒరిజినల్స్‌ని డౌన్లోడ్ చేసి సేవ్ చేయండి’.
మరింత iCloud స్టోరేజ్‌ను పొందడం
మీరు అప్లోడ్ చేసిన ఫోటోలు, వీడియోలు మీ స్టోరేజ్ ప్లాన్‌ను మించినట్లయితే, మీరు మరింత స్టోరేజ్, అదనపు ఫీచర్ల కోసం మీరు iCloud+కు అప్‌గ్రేడ్ చేయవచ్చు. iCloud+కు సబ్‌స్క్రైబ్ చేయడం చూడండి.