iPhoneలో వాయిస్ మెమోస్ ట్రాన్స్క్రిప్షన్ను చూడటం
iOS 18.0 లేదా ఆ తర్వాతి వెర్షన్లో, మీ ఆడియో రికార్డింగ్లోని స్పీచ్‌ను వాయిస్ మెమోస్‌లో టెక్స్ట్‌కు అనువాదం చేయవచ్చు. మీరు రికార్డింగ్ చేస్తున్నప్పుడు లేదా తర్వాత ట్రాన్స్క్రిప్షన్ను చూడవచ్చు.
నోట్: ఆడియో ట్రాన్స్క్రిప్షన్ iPhone 12 లేదా తర్వాతి వెర్షన్లలో ఇంగ్లీష్ (అన్ని వేరియంట్లు), స్పానిష్, పోర్చుగీస్, ఇటాలియన్, ఫ్రెంచ్, జర్మన్, జపనీస్, కొరియన్, సరళీకృత చైనీస్, సాంప్రదాయ చైనీస్ భాషలలో అందుబాటులో ఉంటుంది. ఇది అన్ని దేశాలు లేదా ప్రాంతాలలో అందుబాటులో లేదు.
మీరు మునుపటి (iOS 17 or అంతకంటే ముందు) వెర్షన్‌లోని వాయిస్ మెమోస్‌లో చేసిన రికార్డింగ్‌ను తెరిచినప్పుడు, దానిలో రికార్డ్ చేసిన స్పీచ్ ఉంటే వాయిస్ మెమోస్ దాన్ని ఆటోమేటిక్‌గా ట్రాన్స్క్రైబ్ చేస్తుంది.
రికార్డింగ్ చేస్తున్నప్పుడు ట్రాన్స్క్రిప్షన్ను చూడటం
మీ iPhoneలోని వాయిస్ మెమోస్ యాప్
(యుటిలిటీస్ ఫోల్డర్)కి వెళ్ళండి.
రికార్డింగ్ ప్రారంభించడానికి
ట్యాప్ చేయండి.
వేవ్‌ఫామ్ పైభాగం నుండి ఎగువకు స్వైప్ చేయండి, ఆపై ట్రాన్స్క్రిప్షన్ను లైవ్‌లో చూడటానికి
ట్యాప్ చేయండి.
వేవ్‌ఫామ్ తాత్కాలికంగా కనిపించదు, అలాగే ట్రాన్స్క్రిప్షన్లో ప్రస్తుత పదం హైలైట్ చేయబడి కనిపిస్తుంది. వేవ్‌ఫామ్ వీక్షణకు తిరిగి వెళ్లడానికి,
ట్యాప్ చేయండి.
రికార్డింగ్‌ను పాజ్ చేయడానికి
ట్యాప్ చేయండి; కొనసాగించడానికి తిరిగి ప్రారంభించండి ట్యాప్ చేయండి.
రికార్డింగ్‌ను సేవ్ చేయడానికి, ‘పూర్తి’ ట్యాప్ చేయండి.
రికార్డింగ్ చేసిన తర్వాత ట్రాన్స్క్రైబ్ చేసిన టెక్స్ట్‌ను చూడండి లేదా కాపీ చేయండి
మీ iPhoneలోని వాయిస్ మెమోస్ యాప్
(యుటిలిటీస్ ఫోల్డర్)కి వెళ్ళండి.
మీరు చూడాలనుకుంటున్న ట్రాన్స్‌క్రిప్ట్‌తో కూడిన రికార్డింగ్‌పై ట్యాప్ చేయండి.
ట్యాప్ చేసి, ఆపై దిగువ వాటిలో ఏదైనా చేయండి:
ట్రాన్స్క్రిప్ట్లోని ఒక భాగాన్ని కాపీ చేయడానికి: ట్రాన్స్క్రిప్ట్ను చూడండి ఎంచుకోండి, మీరు కాపీ చేయాలనుకుంటున్న టెక్స్ట్‌ను ఎంచుకోండి, ఆపై కాపీ ట్యాప్ చేయండి.
మొత్తం ట్రాన్స్క్రిప్ట్ను కాపీ చేయడానికి: ‘ట్రాన్స్క్రిప్ట్ను కాపీ చేయండి’ ఎంచుకోండి.
మీరు మరో డాక్యుమెంట్‌ను-ఉదాహరణకు Mail సందేశం లేదా టెక్స్ట్ ఫైల్‌ను తెరవవచ్చు—అలాగే, దానిలో టెక్స్ట్‌ను పేస్ట్ చేయవచ్చు.
టైటిల్లు, ట్రాన్స్క్రిప్షన్లలో టెక్స్ట్‌ను శోధించడం
మీ iPhoneలోని వాయిస్ మెమోస్ యాప్
(యుటిలిటీస్ ఫోల్డర్)కి వెళ్ళండి.
శోధన ఫీల్డ్‌ను చూపించడానికి రికార్డింగ్‌ల జాబితాలో ఎగువ నుండి దిగువకు స్వైప్ చేయండి.
శోధన ఫీల్డ్‌లో మీరు వెతకాలనుకుంటున్న టెక్స్ట్‌ను నమోదు చేయండి.
ఈ జాబితా టైటిల్ లేదా ఆడియో ట్రాన్స్క్రిప్షన్ రెండింటిలో—ఆ టెక్స్ట్‌తో కూడిన రికార్డింగ్‌లను మాత్రమే చూపుతుంది.
మీరు ట్రాన్స్క్రిప్షన్లో ఒక పదాన్ని ఎంచుకున్నప్పుడు, ప్లేహెడ్ ఆ లొకేషన్లోని ఆడియో వేవ్ఫామ్లో కనిపిస్తుంది. వేవ్ఫామ్కు తిరిగి వెళ్లడానికి, ట్యాప్ చేయండి.