iPhoneలోని iMessage గురించి పరిచయం
iMessage అనేది మీ iPhone, iPad, Mac, Apple Watch, Apple Vision Proలోని సందేశాలు యాప్ లో టెక్స్ట్ సందేశాలను పంపడానికి, స్వీకరించడానికి మీరు ఉపయోగించే సురక్షిత సందేశ సర్వీస్.
ఎవరైనా iMessageను ఉపయోగించి మీ ఇమెయిల్ అడ్రెస్‌కు లేదా ఫోన్ నంబర్‌కు సందేశం పంపితే, ఆ ఇమెయిల్ అడ్రెస్ లేదా ఫోన్ నంబర్‌కు పంపిన సందేశాలను స్వీకరించడానికి సెటప్ చేయబడిన మీ Apple డివైజ్‌లన్నింటిలో మీరు సందేశాన్ని అందుకుంటారు. మీరు iMessage సంభాషణను చూసినప్పుడు, మీకు అన్ని డివైజ్‌ల నుండి పంపబడిన సందేశాలన్నీ కనిపిస్తాయి, తద్వారా మీరు ఎక్కడ ఉన్నా ఇతరులతో కనెక్ట్ అయ్యి ఉండవచ్చు.
కొన్ని iMessage ఫీచర్లను ఉపయోగించడానికి మీకు Apple ఖాతా అవసరం. మీరు iTunes Store లేదా App Store నుండి కొనుగోళ్లు చేసినట్లయితే లేదా మీరు iCloudకు సైన్ ఇన్ చేసినట్లయితే, మీకు Apple ఖాతా ఉందని అర్థం.

iMessageలో కమ్యూనికేట్ చేయడం గురించి తెలుసుకోవలసిన కొన్ని విషయాలు:
మీరు Wi-Fi లేదా మొబైల్ సర్వీస్ ద్వారా టెక్స్ట్‌లను పంపవచ్చు.
మీరు iMessage ఉపయోగించి పంపే, స్వీకరించే టెక్స్ట్‌లు మీ మొబైల్ డేటా ప్లాన్‌లో SMS, MMS, లేదా RCS అలవెన్స్‌లో భాగంగా లెక్కించబడవు, కానీ వాటికి మొబైల్ డేటా రేట్లు వర్తించవచ్చు.
Apple డివైజ్‌లో iMessageను ఉపయోగించే ఇతరులతో మీరు కమ్యూనికేట్ చేసినప్పుడు, టెక్స్ట్‌లు నీలం బబల్ల రూపంలో కనిపిస్తాయి. (SMS, MMS, RCS సందేశాలు పచ్చ బబల్ల రూపంలో కనిపిస్తాయి.)
మీరు నీలి
‘పంపండి’ బటన్‌ను చూసినప్పుడు మీ సందేశం iMessageతో పంపబడుతుందని అర్థం; సందేశం SMS, MMS లేదా RCS లేదా మీ మొబైల్ సర్వీస్‌తో పంపబడుతుందని పచ్చ ‘పంపండి’ బటన్ సూచిస్తుంది.
మీరు మరొకరితో సంభాషణలో ఉన్నప్పుడు, ఎవరైనా సందేశాన్ని టైప్ చేస్తున్నారో లేదో మీరు చూడవచ్చు. వేరే వ్యక్తి చదివినట్లు తెలియజేయండి ఆన్ చేసినట్లయితే, వారు మీ సందేశాన్ని తెరిచారో లేదో అని కూడా మీరు చూడవచ్చు.
మీరు స్టైల్లు, డ్రాయింగ్లు, Memoji, ఇన్లైన్ రిప్లైలు, ఎడిటింగ్, అన్సెండింగ్, షెడ్యూల్ చేయడం, కొలాబరేషన్, గ్రూప్ సంభాషణల నిర్వహణ వంటి మరిన్ని విస్తృత స్థాయి యాప్‌లను, ఫీచర్లను ఉపయోగించవచ్చు.
మీరు Tapbackలతో ప్రతిస్పందించినప్పుడు, ఆడియో సందేశాలను పంపినప్పుడు, లేదా శాటిలైట్ ద్వారా పంపినప్పుడు మీకు చాలా ఎంపికలు అందుబాటులో ఉంటాయి.
మీరు iMessageను ఉపయోగించినప్పుడు, మీరు స్పామ్ లేదా జంక్ సందేశాలను Appleకు నివేందించవచ్చు.
భద్రత కోసం, iMessageను ఉపయోగించి పంపే సందేశాలను ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయడం జరుగుతుంది, మీరు కాంటాక్ట్ కీ ధృవీకరణను కూడా ఉపయోగించవచ్చు.