మీ iPhone, ఇతర Apple డివైజ్‌ల మధ్య కాపీ చేసి, పేస్ట్ చేయడం
మీరు మీ Apple డివైజ్‌లలో ఒకదాని నుండి కంటెంట్‌ను కాపీ చేసి వేరే దానిలో పేస్ట్ చేయడానికి యూనివర్సల్ క్లిప్‌బోర్డ్ అనే ఫీచర్‌ను ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, మీరు మీ iPadలో టెక్స్ట్‌ను కాపీ చేసి, దాన్ని మీ iPhone నోట్లో పేస్ట్ చేయవచ్చు లేదా మీ iPhoneలో Safari నుండి ఇమేజ్ను కాపీ చేసి, దాన్ని మీ Macలోని ఇమెయిల్ సందేశంలో పేస్ట్ చేయవచ్చు.
మీరు మీ iPhone, iPad, Macతో యూనివర్సల్ క్లిప్‌బోర్డ్‌ను ఉపయోగించవచ్చు.
మీరు ప్రారంభించే ముందు
వీటిని నిర్ధారించుకోండి:
రెండు డివైజ్‌లలోనూ Wi-Fi, Bluetooth®, అలాగే Handoff ఆన్‌లో ఉండాలి.
మీరు రెండు డివైజ్‌లలోనూ ఒకే Apple ఖాతాకు సైన్ ఇన్ చేయాలి.
రెండు డివైజ్‌లు యూనివర్సల్ క్లిప్‌బోర్డ్ కోసం కనీస సిస్టమ్ అవసరాలకు అనుగుణంగా ఉండాలి.
మీరు VPNను ఉపయోగిస్తే, దీని కాన్ఫిగరేషన్ స్థానిక నెట్‌వర్కింగ్‌ను నిరోధించడం లేదని నిర్ధారించుకోండి, ఎందుకంటే అది కొన్ని కంటిన్యూయిటీ ఫీచర్లకు అంతరాయం కలిగించవచ్చు.
మీ iPhone, ఇతర డివైజ్‌ల మధ్య కాపీ చేసి, పేస్ట్ చేయండి
యూనివర్సల్ క్లిప్‌బోర్డ్ అనేది మీకు కనిపించే ఫీచర్ కాదు. ఇది సాధారణ కాపీ, పేస్ట్ ఫీచర్లాగానే ఉన్నప్పటికీ, ఈ యూనివర్సల్ క్లిప్‌బోర్డ్ ఫీచర్‌ని ఉపయోగించి మీరు iPhoneలో కాపీ చేస్తే, మీరు దాన్ని iPad లేదా Mac వంటి మీ ఇతర Apple డివైజ్‌లలో కూడా పేస్ట్ చేయవచ్చు
మీ iPhoneలో టెక్స్ట్ లేదా ఇమేజ్ను ఎంచుకుని, ఆపై కాపీ ట్యాప్ చేయండి.
మీ వేరే డివైజ్‌లో, మీరు టెక్స్ట్ లేదా ఇమేజ్ను ఎక్కడైతే పేస్ట్ చేయాలనుకుంటున్నారో అక్కడ (మరో iPhone లేదా iPadలో) ట్యాప్ చేసి లేదా (Macలో) క్లిక్ చేసి, ఆపై ‘పేస్ట్’పై ట్యాప్ లేదా క్లిక్ చేయండి. మీరు కీబోర్డ్ షార్ట్‌కట్‌లను కూడా ఉపయోగించవచ్చు.
మీ iPhone, iPad లేదా Macలో కాపీ, పేస్ట్ చేయడం గురించి మరింత సమాచారం కోసం iPhone లేదా iPadలో కాపీ చేసి, పేస్ట్ చేయడం లేదా Macలో కాపీ చేసి, పేస్ట్ చేయడం చూడండి.
నోట్: మీరు కంటెంట్‌ను కాపీ చేసినప్పుడు, అది మీ క్లిప్‌బోర్డ్‌లో చాలా తక్కువ సమయం అందుబాటులో ఉంటుంది.
iPhone లేదా iPadలో కాపీ చేసి, పేస్ట్ చేయడం
టెక్స్ట్‌ను ఎంచుకుని, కాపీ చేయండి: పదాన్ని ఎంచుకోవడానికి ఒక వేలితో డబల్-ట్యాప్ చేయండి లేదా పేరాగ్రాఫ్‌ను ఎంచుకోవడానికి ఒక వేలితో ట్రిపల్-ట్యాప్ చేయండి. (మీ ఎంపికను సర్దుబాటు చేయడానికి మీరు గ్రాబ్ పాయింట్లను కూడా కదిలించవచ్చు.) ఆపై కాపీ ట్యాప్ చేయండి.
ఇమేజ్ను ఎంచుకుని, కాపీ చేయండి: ఇమేజ్ను ఎంచుకోవడానికి టచ్ చేసి నొక్కి ఉంచి, ఆపై కాపీ ట్యాప్ చేయండి.
టెక్స్ట్ లేదా ఇమేజ్ను పేస్ట్ చేయండి: మీరు టెక్స్ట్ లేదా ఇమేజ్ను పేస్ట్ చేయాలనుకుంటున్న చోట ట్యాప్ చేయండి, ఆపై ‘పేస్ట్ చేయండి’ ట్యాప్ చేయండి.
మిమ్మల్ని కాపీ, పేస్ట్ చేసేలా అనుమతించే అదనపు జెశ్చర్స్‌ను కనుగొనడానికి, iPhoneలో టెక్స్ట్‌ను ఎంచుకోండి, కట్ చేయండి, కాపీ చేసి, పేస్ట్ చేయండి అలాగే iPadలో టెక్స్ట్‌ను ఎంచుకోండి, కట్ చేయండి, కాపీ చేసి, పేస్ట్ చేయండి చూడండి.
Macలో కాపీ చేసి, పేస్ట్ చేయడం
టెక్స్ట్ లేదా ఇమేజ్ను ఎంచుకోండి: మీ పాయింటర్‌తో, మీరు కాపీ చేయాలనుకుంటున్న టెక్స్ట్ లేదా ఇమేజ్ను ఎంచుకోండి.
టెక్స్ట్ లేదా ఇమేజ్ను కాపీ చేయండి: కమాండ్-C నొక్కండి లేదా మెన్యూ బార్ నుండి ఎడిట్ > కాపీని ఎంచుకోండి.
టెక్స్ట్ లేదా ఇమేజ్ను పేస్ట్ చేయండి: మీరు టెక్స్ట్ లేదా ఇమేజ్ను పేస్ట్ చేయాలనుకుంటున్న చోట మీ పాయింటర్‌ను ఉంచి, క్లిక్ చేయండి, ఆపై కమాండ్-V నొక్కండి లేదా మెన్యూ బార్లో ఎడిట్ > పేస్ట్ ఎంచుకోండి.
మిమ్మల్ని కాపీ, పేస్ట్ చేసేలా అనుమతించే అదనపు జెశ్చర్స్‌ను కనుగొనడానికి, iPhoneలో టెక్స్ట్‌ను ఎంచుకోండి, కట్ చేయండి, కాపీ చేసి, పేస్ట్ చేయండి అలాగే iPadలో టెక్స్ట్‌ను ఎంచుకోండి, కట్ చేయండి, కాపీ చేసి, పేస్ట్ చేయండి చూడండి.
యూనివర్సల్ క్లిప్‌బోర్డ్ పనిచేయకపోతే
మీరు రెండు డివైజ్‌లలోనూ ఒకే Apple ఖాతాతో సైన్ ఇన్ చేశారని నిర్ధారించుకోండి.
మీ iPhoneలో, Macలో Wi-Fi, Bluetooth, అలాగే Handoff ఆన్‌లో ఉన్నాయని నిర్ధారించుకోండి.
మీ డివైజ్‌లు తప్పనిసరిగా ఒకదానికొకటి 30 అడుగుల (10 మీటర్లు) దూరంలోపు ఉండాలి.
మీ యూనివర్సల్ క్లిప్బోర్డ్తో సమస్య ఉంటే, మీ డివైజ్‌లను రీస్టార్ట్ చేసి, మళ్ళీ ప్రయత్నించండి.
డివైజ్‌ల మధ్య కొంచెం టెక్స్ట్ లేదా కాపీ చేసిన కొన్ని ఇమేజ్‌లను షేర్ చేయడానికి యూనివర్సల్ క్లిప్‌బోర్డ్ ఉత్తమమైనది. మీరు మీ Mac, వేరే Apple డివైజ్‌ల మధ్య మరిన్ని ఫైల్‌లను షేర్ చేయాలనుకుంటే, iPhone నుండి స్టోరేజ్ డివైజ్, సర్వర్ లేదా క్లౌడ్‌కు ఫైళ్ళను బదిలీ చేయడం చూడండి.