iPhoneలో విద్యుత్ వినియోగం, రేట్లను చూడండి (ఒప్పందం ఉన్న U.S. ప్రొవైడర్లు మాత్రమే)
మీ ఇంట్లో వినియోగించే విద్యుత్ వివరాలను హోమ్ యాప్‌లో చూడవచ్చు, కాలక్రమేణా మీ వినియోగాన్ని సులభంగా ట్ర్యాక్ చేయవచ్చు, అలాగే మీ విద్యుత్ రేటు ప్లాన్ సమాచారాన్ని కూడా చూడవచ్చు. విద్యుత్ వినియోగ డేటా సాధారణంగా 24 నుండి 72 గంటల ఆలస్యంతో ప్రదర్శించబడుతుంది.
నోట్: ఈ ఫీచర్లను ఉపయోగించడానికి, మీరు పాల్గొనే యుటిలిటీ ప్రొవైడర్‌తో రెసిడెన్షియల్ ఎలక్ట్రికల్ సర్వీస్‌ను కలిగి ఉండాలి, మీరు యుటిలిటీ ఖాతా యజమాని లేదా యుటిలిటీ ఖాతా అధీకృత యూజర్ అయ్యి ఉండాలి.
విద్యుత్ వినియోగం, రేట్ సమాచారాన్ని సెటప్ చేయడం
మీ iPhoneలో హోమ్ యాప్
కు వెళ్ళండి.
హోమ్ ట్యాబ్‌ను ట్యాప్ చేసి,
ను ట్యాప్ చేసి, ఆపై హోమ్ సెట్టింగ్స్‌ను ట్యాప్ చేయండి.
ఎనర్జీని ట్యాప్ చేసి, ఆపై ‘ఖాతాను కనెక్ట్ చేయండి’ని ట్యాప్ చేయండి.
నోట్: పాల్గొనే యుటిలిటీ ప్రొవైడర్లు, అందుబాటులో ఉన్న ప్రొవైడర్లలో జాబితా చేయబడ్డారు. జాబితాలో మీ యుటిలిటీ ప్రొవైడర్ లేకపోతే, ఈ ఫీచర్‌కు ప్రస్తుతం మీ ప్రాంతంలో మద్దతు లేదని అర్థం.
మీ అనుకూల ఎలక్ట్రిసిటీ ఖాతాను లింక్ చేయడానికి స్క్రీన్‌పై కనిపించే సూచనలను ఫాలో అవ్వండి.
అనేక యుటిలిటీ ఖాతాల కోసం విద్యుత్ వినియోగం, ధరను సెటప్ చేయడం
మీకు అనేక యుటిలిటీ ఖాతాలు లేదా ప్రొవైడర్లు ఉంటే, వాటిని హోమ్ యాప్‌కి జోడించడానికి అదనపు హోమ్‌ను సృష్టించవచ్చు.
మీ iPhoneలో హోమ్ యాప్
కు వెళ్ళండి.
హోమ్ ట్యాబ్‌పై ట్యాప్ చేసి,
ట్యాప్ చేసి, ‘కొత్త ఇల్లు జోడించండి’పై ట్యాప్ చేసి, ఆపై ‘సేవ్’ ట్యాప్ చేయండి.
హోమ్ ట్యాబ్ నుండి
ను ట్యాప్ చేసి, ఆపై హోమ్ సెట్టింగ్స్‌ను ట్యాప్ చేయండి.
ఎనర్జీని ట్యాప్ చేసి, ఆపై ‘ఖాతాను కనెక్ట్ చేయండి’ని ట్యాప్ చేయండి.
నోట్: పాల్గొనే యుటిలిటీ ప్రొవైడర్లు, అందుబాటులో ఉన్న ప్రొవైడర్లలో జాబితా చేయబడ్డారు. జాబితాలో మీ యుటిలిటీ ప్రొవైడర్ లేకపోతే, ఈ ఫీచర్‌కు ప్రస్తుతం మీ ప్రాంతంలో మద్దతు లేదని అర్థం.
మీ అదనపు అనుకూల ఎలక్ట్రిసిటీ ఖాతాను లింక్ చేయడానికి స్క్రీన్‌పై కనిపించే సూచనలను అనుసరించండి.
విద్యుత్ వినియోగం, రేట్ సమాచారం నుండి మీ ఖాతాను డిస్కనెక్ట్ చేయడం
మీ iPhoneలో హోమ్ యాప్
కు వెళ్ళండి.
హోమ్ ట్యాబ్‌ను ట్యాప్ చేసి,
ను ట్యాప్ చేసి, ఆపై హోమ్ సెట్టింగ్స్‌ను ట్యాప్ చేయండి.
ఎనర్జీని ట్యాప్ చేసి, మీ లింక్ చేయబడిన ఎలక్ట్రిసిటీ ఖాతాను ట్యాప్ చేయండి.
‘ఖాతాను డిస్కనెక్ట్ చేయండి’ని ట్యాప్ చేయండి.