iPhoneలో కంట్రోల్ సెంటర్‌ను ఉపయోగించి, కస్టమైజ్ చేయడం
iPhoneలో ఉన్న కంట్రోల్ సెంటర్ అనేది ఎయిర్‌ప్లేన్ మోడ్, అంతరాయం కలిగించవద్దు, ఫ్లాష్‌లైట్, వాల్యూమ్, స్క్రీన్ బ్రైట్నెస్ ఇంకా మరిన్నింటితో చేర్చబడిన ఉపయోగకరమైన కంట్రోల్లకు తక్షణ యాక్సెస్‌ను మీకు అందిస్తుంది.
కంట్రోల్ సెంటర్‌ను తెరవండి
కంట్రోల్ సెంటర్‌ను తెరవడానికి, వీటిలో ఒకదాన్ని చేయండి:
Face ID ఉన్న iPhoneలో: స్క్రీన్ ఎగువ కుడి మూల నుండి కిందికి స్వైప్ చేయండి. మీరు కిందికి స్వైప్ చేస్తూ వెళ్తే, మీకు మరిన్ని కంట్రోల్ల గ్రూప్‌లు కనిపిస్తాయి.
హోమ్ బటన్ ఉన్న iPhoneలో: దిగువ నుండి పైకి స్వైప్ చేయండి.
మీరు స్క్రీన్ కుడి మూలన ఉన్న ఐకాన్ల ద్వారా స్వైప్ చేసి, నిర్దిష్ట కంట్రోల్ గ్రూప్‌లకు వెళ్ళవచ్చు. మొదటి గ్రూప్‌కు తిరిగి వెళ్ళడానికి ఐకాన్ల ద్వారా పైకి స్వైప్ చేయండి.
కంట్రోల్ సెంటర్‌ను మూసివేయడానికి, (Face ID ఉన్న iPhoneలో) స్క్రీన్ దిగువ మధ్య నుండి పైకి స్వైప్ చేయండి లేదా హోమ్ బటన్‌ను ట్యాప్ చేయండి.
కంట్రోల్ సెంటర్లో మరిన్ని కంట్రోల్‌లను యాక్సెస్ చేయడం
చాలా కంట్రోల్‌లు అదనపు ఎంపికలను అందిస్తాయి. అందుబాటులో ఉన్న ఎంపికలను చూడటానికి, కంట్రోల్‌ను టచ్ చేసి పట్టుకోండి. ఉదాహరణకు, మీరు కంట్రోల్ సెంటర్లో ఇవి చేయవచ్చు:
ఎగువ ఎడమ కంట్రోల్ల గ్రూప్‌ను టచ్ చేసి పట్టుకోండి, ఆపై AirDrop ఎంపికలను తెరవడానికి
ట్యాప్ చేయండి.
సెల్ఫీ తీయడానికి, వీడియో రికార్డ్ చేయడానికి లేదా ఫోటో తీయడానికి
ను టచ్ చేసి పట్టుకోండి.
మీరు వైబ్రేషన్‌ను అనుభూతి చెందే వరకు స్క్రీన్ ఎగువ కుడివైపు ఉన్న
ను (కంట్రోల్ సెంటర్ తెరిచి ఉన్నప్పుడు) టచ్ చేసి ఉంచండి. ఆపై iPhoneను పవర్ ఆఫ్ చేయడానికి స్లైడర్‌ను డ్రాగ్ చేయండి.
కంట్రోల్‌లను కస్టమైజ్ చేయడం
మీరు కంట్రోల్ సెంటర్లో కంట్రోల్‌లను తిరిగి అమర్చవచ్చు, జోడించవచ్చు, తొలగించవచ్చు.
కంట్రోల్‌లను ఎడిట్ చేయడం ప్రారంభించడానికి కంట్రోల్ సెంటర్‌కు ఎగువ ఎడమవైపు ఉన్న
ట్యాప్ చేయండి.
దిగువ పేర్కొన్న వాటిలో ఏదైనా చేయండి:
కంట్రోల్‌లను తిరిగి అమర్చండి: కంట్రోల్‌ను కొత్త స్థానానికి డ్రాగ్ చేయండి.
కంట్రోల్ లేదా కంట్రోల్ల సెట్‌ను తొలగించండి: కంట్రోల్ ఎగువ ఎడమ వైపున
ట్యాప్ చేయండి.
కంట్రోల్ సైజ్ మార్చండి: కంట్రోల్ దిగువ కుడివైపున ఉన్న హ్యాండిల్‌ను డ్రాగ్ చేయండి.
మరిన్ని కంట్రోల్‌లను జోడించండి: కంట్రోల్ల గ్యాలరీని తెరవడానికి స్క్రీన్ దిగువన ఉన్న ‘కంట్రోల్‌ను జోడించండి’ ట్యాప్ చేయండి, ఆపై కంట్రోల్ సెంటర్‌కు జోడించడానికి కంట్రోల్‌ను ట్యాప్ చేయండి.
మీరు కస్టమైజ్ చేయడం పూర్తి చేసినప్పుడు, స్క్రీన్ దిగువ మధ్య నుండి పైకి స్వైప్ చేయడం ద్వారా కంట్రోల్ సెంటర్‌ను మూసివేయండి.
కస్టమ్ కంట్రోల్ల గ్రూప్‌ను జోడించడం
మీరు కంట్రోల్ సెంటర్‌కు కొత్త కంట్రోల్ గ్రూప్‌ను జోడించవచ్చు.
స్క్రీన్ ఎగువ ఎడమ వైపున
ట్యాప్ చేయండి.
స్క్రీన్ కుడి అంచున దిగువన ఉన్న ఐకాన్ని (చిన్న వృత్తం) ట్యాప్ చేయండి.
కంట్రోల్ల గ్యాలరీని తెరవడానికి స్క్రీన్ దిగువన ఉన్న ‘కంట్రోల్‌ను జోడించండి’ ట్యాప్ చేయండి.
గ్రూప్‌కి జోడించడానికి కంట్రోల్ గ్యాలరీలోని కంట్రోల్‌ను ట్యాప్ చేయండి.
కొత్త కంట్రోల్ల గ్రూప్‌ను మరింత కస్టమైజ్ చేయడానికి, ఈ దిగువ వాటిలో ఒకదాన్ని చేయండి:
కంట్రోల్‌లను తిరిగి అమర్చండి: కంట్రోల్‌ను కొత్త స్థానానికి డ్రాగ్ చేయండి.
కంట్రోల్ లేదా కంట్రోల్ల సెట్‌ను తొలగించండి: కంట్రోల్ ఎగువ ఎడమ వైపున
ట్యాప్ చేయండి.
కంట్రోల్ సైజ్ మార్చండి: కంట్రోల్ దిగువ కుడివైపున ఉన్న హ్యాండిల్‌ను డ్రాగ్ చేయండి.
మరిన్ని కంట్రోల్‌లను జోడించండి: కంట్రోల్స్ గ్యాలరీని తెరవడానికి కంట్రోల్ సెంటర్ దిగువన ఉన్న ‘కంట్రోల్‌ను జోడించండి’ ట్యాప్ చేయండి, ఆపై దానిని గ్రూప్‌కి జోడించడానికి వేరే కంట్రోల్‌ను ట్యాప్ చేయండి.
మీరు కస్టమైజ్ చేయడం పూర్తి చేసినప్పుడు, స్క్రీన్ దిగువ మధ్య నుండి పైకి స్వైప్ చేయడం ద్వారా కంట్రోల్ సెంటర్‌ను మూసివేయండి.
Wi-Fi నెట్వర్క్ నుండి తాత్కాలికంగా డిస్కనెక్ట్ చేయడం
కంట్రోల్ సెంటర్లో, తిరిగి కనెక్ట్ చేయడానికి ట్యాప్ చేసి, మళ్ళీ ట్యాప్ చేయండి.
కనెక్ట్ చేయబడిన Wi-Fi నెట్వర్క్ పేరును చూడటానికి, టచ్ చేసి పట్టుకోండి.
ఎందుకంటే మీరు నెట్వర్క్ నుండి డిస్కనెక్ట్ చేసినప్పుడు Wi-Fi ఆఫ్ చేయబడలేదు, AirPlay, AirDrop ఉపయోగంలోనే ఉన్నాయి, అలాగే మీరు లొకేషన్లను మార్చినప్పుడు లేదా iPhoneను రీస్టార్ట్ చేసినప్పుడు iPhone తెలిసిన నెట్‌వర్క్‌లను మాత్రమే జాయిన్ చేస్తుంది. Wi-Fi ఆఫ్ చేయడానికి, సెట్టింగ్స్ > Wi-Fiకి వెళ్ళండి. (కంట్రోల్ సెంటర్లో Wi-Fi మళ్ళీ ఆన్ చేయడానికి,
ట్యాప్ చేయండి.) ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఉన్నప్పుడు కంట్రోల్ సెంటర్లో Wi-Fiని ఆన్ లేదా ఆఫ్ చేయడం గురించి సమాచారం కోసం ప్రయాణానికి iPhone సెట్టింగ్‌లను ఎంచుకోవడం చూడండి.
Bluetooth డివైజ్‌ల నుండి తాత్కాలికంగా డిస్కనెక్ట్ చేయడం
కంట్రోల్ సెంటర్లో, కనెక్షన్లను అనుమతించడానికి ట్యాప్ చేసి; బటన్‌ను మళ్ళీ ట్యాప్ చేయండి.
ఎందుకంటే మీరు డివైజ్‌ల నుండి డిస్కనెక్ట్ చేసినప్పుడు Bluetooth® ఆఫ్ చేయబడలేదు, లొకేషన్ ఖచ్చితత్వం, ఇతర సేవలు ఇంకా ఎనేబల్ చేయబడి ఉన్నాయి. Bluetooth ఆఫ్ చేయడానికి, సెట్టింగ్స్ > Bluetoothకు వెళ్ళి, ఆపై Bluetooth ఆఫ్ చేయండి. కంట్రోల్ సెంటర్లో Bluetoothను మళ్ళీ ఆన్ చేయడానికి,
ట్యాప్ చేయండి. ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఉన్నప్పుడు కంట్రోల్ సెంటర్లో Bluetoothను ఆన్ లేదా ఆఫ్ చేయడం గురించి సమాచారం కోసం ప్రయాణానికి iPhone సెట్టింగ్‌లను ఎంచుకోవడం చూడండి.
యాప్‌లలో కంట్రోల్ సెంటర్‌కు యాక్సెస్‌ను ఆఫ్ చేయడం
సెట్టింగ్స్ > కంట్రోల్ సెంటర్‌కు వెళ్ళి, ఆపై యాప్‌లలో యాక్సెస్‌ను ఆఫ్ చేయండి.