iPhoneలో నోటిఫికేషన్లను చూడటం, వాటికి ప్రతిస్పందించడం
Notifications help you keep track of what’s new—they let you know if you missed a call, if the date of an event moved, and more. మీరు మీ నోటిఫికేషన్ సెట్టింగ్‌లను కస్టమైజ్ చేయవచ్చు, తద్వారా మీకు ముఖ్యమైనది ఏమిటో మాత్రమే మీకు తెలుస్తుంది.
మీరు ఫోకస్‌తో నోటిఫికేషన్స్‌ను నిశ్శబ్దపరిస్తే తప్ప, అవి వచ్చినవి వచ్చినట్లుగా iPhone వాటిని ప్రదర్శిస్తుంది—అంతరాయాన్ని తగ్గించడానికి అవి స్క్రీన్కు దిగువ నుండి రోల్ ఇన్ అవుతాయి. మీరు వాటిని లాక్ స్క్రీన్‌పై విస్తరించిన జాబితా వీక్షణలో, స్ట్యాక్ చేసిన వీక్షణలో లేదా లెక్కింపు వీక్షణలో చూడవచ్చు. లేఔట్‌ను మార్చడానికి లాక్ స్క్రీన్‌లో నోటిఫికేషన్లను పించ్ చేయండి.
నోట్: మీరు యాప్‌ను ఉపయోగిస్తున్నప్పుడు, దాని నుండి మీరు నోటిఫికేషన్లను ఎలా స్వీకరించాలనుకుంటున్నారో తక్షణమే, ఎప్పటికీ కాకుండా లేదా షెడ్యూల్ చేసిన సారాంశంలో మిమ్మల్ని అడగవచ్చు. మీ తర్వాత సెట్టింగ్స్ >నోటిఫికేషన్స్‌లో ఈ సెట్టింగ్‌ను మార్చవచ్చు.
నోటిఫికేషన్ సెంటర్లో మీ నోటిఫికేషన్లను కనుగొనడం
నోటిఫికేషన్ సెంటర్లో మీ నోటిఫికేషన్లను చూడటానికి, ఈ దిగువ వాటిలో ఒకదాన్ని చేయండి:
లాక్ స్క్రీన్‌లో: స్క్రీన్ మధ్య నుండి పైకి స్వైప్ చేయండి.
ఇతర స్క్రీన్లలో: ఎగువ మధ్య నుండి దిగువకు స్వైప్ చేయండి. పాత నోటిఫికేషన్లు ఏవైనా ఉంటే, వాటిని చూడటానికి మీరు స్క్రోల్ చేయవచ్చు.
నోటిఫికేషన్ సెంటర్‌ను మూసివేయడానికి, దిగువ నుండి ఒక వేలితో పైకి స్వైప్ చేయండి లేదా హోమ్ బటన్‌ను నొక్కండి (హోమ్ బటన్‌తో iPhoneలో).
నోటిఫికేషన్లకు ప్రతిస్పందించడం
మీరు నోటిఫికేషన్ సెంటర్లో లేదా లాక్ స్క్రీన్‌లో అనేక నోటిఫికేషన్లు ఉన్నప్పుడు, అవి యాప్ ప్రకారం గ్రూప్ చేయబడతాయి, అప్పుడు వాటిని చూడటం, నిర్వహించటం సులభమవుతుంది. కొన్ని యాప్‌ల నుండి వచ్చే నోటిఫికేషన్లను యాప్‌లో ఫీచర్లను ఆర్గనైజ్ చేయడం ద్వారా కూడా గ్రూప్ చేయవచ్చు, ఉదాహరణకు టాపిక్ లేదా థ్రెడ్ ప్రకారం. గ్రూప్ చేసిన నోటిఫికేషన్లు స్ట్యాక్గా కనిపిస్తాయి, వాటి పైన అత్యంత ఇటీవలి నోటిఫికేషన్ ఉంటుంది.
దిగువ పేర్కొన్న వాటిలో ఏదైనా చేయండి:
నోటిఫికేషన్లను ఒక్కొక్కటిగా చూసి, వాటి గ్రూప్‌ను విస్తరింపజేయడానికి: గ్రూప్‌ను ట్యాప్ చేయండి. గ్రూప్‌ను మూసివేయడానికి, ‘తక్కువ చూపించండి’ ట్యాప్ చేయండి.
To view a notification and perform quick actions if the app offers them (on supported models): నోటిఫికేషన్‌ను టచ్ చేసి పట్టుకోండి.
నోటిఫికేషన్ యాప్‌ను తెరవడానికి: నోటిఫికేషన్‌ను ట్యాప్ చేయండి.
నోటిఫికేషన్ సారాంశాన్ని షెడ్యూల్ చేయడం
సారాంశంగా డెలివరీ చేయాల్సిన మీ నోటిఫికేషన్లను షెడ్యూల్ చేయడం ద్వారా మీరు మీ రోజులో అంతరాయాలను తగ్గించవచ్చు-సారాంశంలో ఏ నోటిఫికేషన్లను చేర్చాలో, మీరు దాన్ని ఏ సమయంలో అందుకోవాలనుకుంటున్నారో ఎంచుకోవచ్చు.
నోటిఫికేషన్ సారాంశం మీ కోసం వ్యక్తిగతీకరించబడింది, పైన అత్యంత సంబంధిత నోటిఫికేషన్లతో, మీ ప్రస్తుత కార్యాచరణ ఆధారంగా, ప్రాధాన్యత ప్రకారం ఇంటెలిజెంట్‌గా ఆర్డర్ చేయబడింది. మీకు సమయం దొరికినప్పుడు నోటిఫికేషన్లతో ఎంగేజ్ అవ్వడానికి నోటిఫికేషన్ల సారాంశం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు యాక్టివిటీలో ఉన్నప్పుడు దృష్టి కేంద్రీకరించేలా నోటిఫికేషన్లను ఫిల్టర్ చేయడానికి ఫోకస్ ఉపయోగించడం ద్వారా మీరు దీని నుండి మరింత బాగా ప్రయోజనం పొందవచ్చు.
సెట్టింగ్స్
> నోటిఫికేషన్లు > 'షెడ్యూల్ చేసిన సారాంశం'కు వెళ్ళి, ఆపై 'షెడ్యూల్ చేసిన సారాంశం'ను ఆన్ చేయండి.
మీ సారాంశం కనిపించే సమయాన్ని సెట్ చేయండి. మీరు మరొక సారాంశాన్ని అందుకోవాలనుకుంటే, ‘సారాంశాన్ని జోడించండి’పై ట్యాప్ చేయండి.
మీ సారాంశంలో చేర్చడానికి యాప్‌లను ఎంచుకోండి.
సారాంశంలో యాప్‌ల దిగువన A నుండి Z వరకు ట్యాప్ చేయండి, ఆపై మీరు మీ సారాంశంలో చేర్చాలనుకుంటున్న యాప్‌లు ఆన్ చేయబడి ఉన్నాయని నిర్ధారించుకోండి.
నోట్: మీరు మీ నోటిఫికేషన్ సారాంశంలో చేర్చాలనుకుంటున్న యాప్ A నుండి Z జాబితాలో కనిపించకపోతే, మీరు యాప్ కోసం ’నోటిఫికేషన్స్‌ను అనుమతించండి’ ఆప్షన్‌ను ఆన్ చేయాల్సి ఉంటుంది. సెట్టింగ్స్ > నోటిఫికేషన్స్‌కు వెళ్ళి, యాప్‌ను ట్యాప్ చేసి, ఆపై ‘నోటిఫికేషన్లను అనుమతించండి’ ఆన్ చేయండి. See Change notification settings.
నోటిఫికేషన్లను చూడటం, విస్మరించడం, క్లియర్ చేయడం, మ్యూట్ చేయడం
మీ iPhoneలో నోటిఫికేషన్లు కనిపించినప్పుడు, ఈ వీటిలో ఒకదాన్ని చేయండి:
మరొక యాప్‌ను ఉపయోగిస్తున్నప్పుడు మీరు అందుకున్న నోటిఫికేషన్‌ను హ్యాండిల్ చేయండి: దాన్ని చూడటానికి ట్యాప్ చేయండి, ఆపై దాన్ని విస్మరించడానికి పైకి స్వైప్ చేయండి.
నోటిఫికేషన్లను క్లియర్ చేయండి: నోటిఫికేషన్ లేదా నోటిఫికేషన్ల గ్రూప్‌లో ఎడమ వైపుకి స్వైప్ చేయండి, ఆపై క్లియర్ లేదా అన్నీ క్లియర్ చేయండి ట్యాప్ చేయండి.
యాప్ కోసం నోటిఫికేషన్లను మ్యూట్ చేయండి: నోటిఫికేషన్ లేదా నోటిఫికేషన్ల గ్రూప్‌లో ఎడమ వైపుకి స్వైప్ చేయండి, ఎంపికలను ట్యాప్ చేయండి, ఆపై ఒక గంట లేదా ఒక రోజు పాటు యాప్ నోటిఫికేషన్లను మ్యూట్ చేయడానికి ఒక ఎంపికను ట్యాప్ చేయండి. ఇది వాటిని నేరుగా నోటిఫికేషన్ సెంటర్‌కు పంపిస్తుంది, అవి లాక్ స్క్రీన్‌లో కనిపించకుండా, సౌండ్‌ను ప్లే చేయకుండా, స్క్రీన్ లైటింగ్‌ను పెంచడం ద్వారా లేదా బ్యానర్‌ను ప్రదర్శించకుండా నివారిస్తుంది.
ఈ నోటిఫికేషన్లను చూడటానికి, వినడానికి, నోటిఫికేషన్ సెంటర్లో నోటిఫికేషన్లో ఎడమ వైపుకి స్వైప్ చేయండి, ఎంపికలను ట్యాప్ చేయండి, ఆపై అన్‌మ్యూట్ ట్యాప్ చేయండి.
యాప్ లేదా నోటిఫికేషన్ గ్రూప్ కోసం నోటిఫికేషన్లను ఆఫ్ చేయండి: నోటిఫికేషన్ లేదా నోటిఫికేషన్ల గ్రూప్‌లో ఎడమ వైపుకి స్వైప్ చేయండి, ఎంపికలను ట్యాప్ చేసి, ఆపై ‘ఆఫ్ చేయండి’ ట్యాప్ చేయండి.
యాప్ నోటిఫికేషన్లను ప్రదర్శించడాన్ని మార్చండి: నోటిఫికేషన్లో ఎడమవైపు స్వైప్ చేయండి, ఎంపికలను ట్యాప్ చేయండి, ఆపై సెట్టింగ్‌లను చూడండి ట్యాప్ చేయండి. మీరు మార్చగలిగే సెట్టింగ్స్ గురించి మరింత తెలుసుకోవడానికి నోటిఫికేషన్ సెట్టింగ్‌లను మార్చండి.
నోటిఫికేషన్ సెంటర్లో మీ అన్ని నోటిఫికేషన్లను క్లియర్ చేయండి: నోటిఫికేషన్ సెంటర్‌కు వెళ్ళండి,
ట్యాప్ చేసి, ఆపై 'క్లియర్ చేయండి' ట్యాప్ చేయండి.
అన్ని నోటిఫికేషన్లను నిశ్శబ్దం చేయండి: ‘అంతరాయం కలిగించవద్దు’ను ఆన్ చేయండి. ఫోకస్‌ను ఆన్ చేయడం లేదా షెడ్యూల్ చేయడం ఆర్టికల్ చూడండి.
మీరు కొంతకాలంగా యాప్‌ను ఉపయోగించనప్పుడు, మీరు ఆ యాప్ కోసం నోటిఫికేషన్లను ఆఫ్ చేయాలనే సూచనను చూడవచ్చు.
లాక్ స్క్రీన్‌లో ఇటీవలి నోటిఫికేషన్లను చూపించడం
మీరు లాక్ స్క్రీన్‌లో నోటిఫికేషన్ సెంటర్‌కు యాక్సెస్‌ను అనుమతించవచ్చు.
సెట్టింగ్స్
> Face ID & పాస్‌కోడ్ (Face ID ఉన్న iPhoneలో) లేదా Touch ID & పాస్‌కోడ్ (వేరే iPhone మోడల్‌లలో)కు వెళ్ళండి.
మీ పాస్‌కోడ్‌ను నమోదు చేయండి.
దిగువకు స్క్రోల్ చేసి నోటిఫికేషన్ సెంటర్‌ను ఆన్ చేయండి (లాక్ చేసినప్పుడు యాక్సెస్‌ను అనుమతించండి దిగువ ఉంటుంది).