iPhoneలోని మ్యాప్స్‌లో వాక్‌లు లేదా హైక్‌లను సేవ్ చేయడం
మీరు హైక్‌ను, వ్యాయామ మార్గాన్ని లేదా సిటీ టూర్‌ను ప్లాన్ చేయడానికి వాకింగ్ పాత్‌ను కస్టమైజ్ చేయవచ్చు. U.S. జాతీయ పార్కులలో, మీరు పొడవు, ఎత్తు, మార్గం రకాన్ని బట్టి హైక్‌లను బ్రౌజ్ చేసి, వాటిని ఫిల్టర్ చేయవచ్చు. మీరు ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పుడు యాక్సెస్ చేయడానికి మీరు జోడించిన నోట్స్‌తో పాటు మార్గాలను కూడా సేవ్ చేయవచ్చు.
నోట్: దేశం లేదా ప్రాంతాన్ని బట్టి లభ్యత మారవచ్చు.
మీ సొంత వాకింగ్ లేదా హైకింగ్ మార్గాన్ని సృష్టించడం
మీ iPhoneలో మ్యాప్స్ యాప్
కి వెళ్ళండి.
మ్యాప్‌లో ప్రారంభ పాయింట్‌ను ఎంచుకోవడానికి, పిన్ను డ్రాప్ చేయడానికి వాకింగ్ కోసం అనువుగా ఉండే ఏదైనా రహదారి, మార్గం, కాలిబాట లేదా ఇతర ప్రదేశాన్ని టచ్ చేసి ఉంచి, మరిన్ని
ని ట్యాప్ చేయండి, ఆపై ‘కస్టమ్ మార్గాన్ని సృష్టించండి’ ట్యాప్ చేయండి.
మార్గాన్ని ఎంచుకోవడానికి మీ మార్గంలోని ఇతర పాయింట్లను ట్యాప్ చేసి, ఆపై మీ మార్గాన్ని పూర్తి చేయడానికి ‘ఔట్ & బ్యాక్’ లేదా ‘లూప్‌ను క్లోజ్ చేయండి’ ట్యాప్ చేయండి.
దిగువ పేర్కొన్న వాటిలో ఏదైనా చేయండి:
ప్రారంభ పాయింట్‌కు వెళ్ళడం: ‘దిశలు’ ట్యాప్ చేయండి (మార్గం ప్రారంభానికి సమీపంలో అందుబాటులో ఉంటుంది).
టర్న్-బై-టర్న్ వాకింగ్ దిశలను ప్రారంభించడం: ’వెళ్ళండి’ ట్యాప్ చేయండి (మీరు మార్గానికి సమీపంలో లేకుంటే అందుబాటులో ఉంటుంది).
తర్వాత చూడటం కోసం మార్గాన్ని సేవ్ చేయడం: ‘సేవ్’ ట్యాప్ చేసి, మార్గానికి పేరు పెట్టండి, నోట్స్‌ను జోడించండి (ఐచ్ఛికం), ఆపై ‘పూర్తి’ ట్యాప్ చేయండి.
చిట్కా: మీకు ఇంటర్నెట్ కనెక్షన్ లేనప్పుడు కూడా మీరు మార్గాన్ని, చుట్టుపక్కల మ్యాప్‌ను యాక్సెస్ చేయాలనుకుంటే ‘మార్గాన్ని డౌన్లోడ్ చేయండి’ ఆన్‌లో ఉందని నిర్ధారించుకోండి.
హైక్‌లను బ్రౌజ్ చేసి, సేవ్ చేయడం
హైక్‌ల కోసం శోధించడానికి మీరు ఆన్లైన్లో ఉండాలి.

మీ iPhoneలో మ్యాప్స్ యాప్
కి వెళ్ళండి.
మీరు మీ మ్యాప్ ఎగువ కుడి వైపున
సూచించిన, ఎక్స్ప్లోర్ మ్యాప్‌లో ఉన్నారని నిర్ధారించుకోండి. వేరే మ్యాప్ వీక్షణకు మార్చడం చూడండి.
“[నేషనల్ పార్క్ పేరు]లో హైక్‌లు” కోసం శోధించి, ఆపై శోధన ఫలితాన్ని ట్యాప్ చేయండి.
మీ ఎంపికలను తగ్గించడానికి, ఫిల్టర్లను ట్యాప్ చేయండి—అన్ని పొడవులు లేదా అన్ని రకాల మార్గాలు వంటివి. మరిన్ని ఎంపికలను చూడటానికి స్వైప్ చేయండి.
హైక్‌ను తెరవడానికి ట్యాప్ చేసి, ‘లైబ్రరీకి జోడించండి’ ట్యాప్ చేసి, హైక్‌కు పేరు పెట్టండి, నోట్స్‌ను జోడించండి (ఐచ్ఛికం), ఆపై ‘పూర్తి’ ట్యాప్ చేయండి.
మీరు హైక్‌ను మీ లైబ్రరీలో సేవ్ చేయడానికి బదులుగా దిగువ పేర్కొన్న వాటిలో ఏదైనా చేయవచ్చు:
మీరు మార్గం సమీపంలో ఉంటే: మీరు ట్రైల్‌హెడ్‌కు నావిగేట్ చేయాలనుకుంటే ‘దిశలు’ ట్యాప్ చేయండి.
మీరు మార్గానికి సమీపంలో లేకపోతే: టర్న్-బై-టర్న్ వాకింగ్ దిశలను ప్రారంభించడానికి ‘వెళ్ళండి’ ట్యాప్ చేయండి.
చిట్కా: మీకు ఇంటర్నెట్ కనెక్షన్ లేనప్పుడు కూడా మీరు మీ iPhoneలో మార్గాన్ని, చుట్టుపక్కల మ్యాప్‌ను యాక్సెస్ చేయాలనుకుంటే ‘మార్గాన్ని డౌన్లోడ్ చేయండి’ ఆన్‌లో ఉందని నిర్ధారించుకోండి.