దశ 3: మీ పిల్లల డివైజ్‌లో వెబ్సైట్లు, ఇంకా యాప్‌ల కోసం భద్రతా సెట్టింగ్‌లను సెట్ చేయండి
మీరు మొదటిసారిగా మీ పిల్లల కోసం iPhone లేదా iPadను సెటప్ చేసేటప్పుడు, మీరు సముచితమైనవిగా భావించే యాప్‌లను ఎంచుకోవచ్చు, అలాగే ఎప్పటికప్పుడు వారు కొత్త వాటిని అభ్యర్థించవచ్చు. మీ పిల్లలు కొత్త యాప్, గేమ్ లేదా వెబ్‌సైట్‌ను అభ్యర్థించినప్పుడు, కుటుంబంగా కలిసి దాన్ని రివ్యూ చేయాలని American Academy of Pediatrics (AAP) సిఫార్సు చేస్తోంది.
App Storeలోని ప్రతి యాప్ వయస్సు ఆధారిత రేటింగ్‌ను కలిగి ఉంటుంది, అందులో ఇన్-యాప్ కంట్రోల్స్ ఉన్నాయో లేదో స్పష్టంగా తెలియజేస్తుంది. దీని ద్వారా ఆ కంటెంట్ మీ పిల్లలకు సరిపోతుందో లేదో అంచనా వేయడానికి మీకు సహాయపడుతుంది. అది ఇప్పటికీ మీ కుటుంబానికి సరిపోతుందో లేదో చూడటానికి రెండు వారాల తర్వాత అందరూ కలిసి ఆ నిర్ణయాన్ని మళ్ళీ పరిశీలించవచ్చు.
మీరు మీ ఫ్యామిలీ షేరింగ్ గ్రూప్‌లోని పిల్లల కోసం ఈ పేరెంటల్ కంట్రోల్‌లను సెటప్ చేస్తుంటే, మీ కుటుంబంలోని అన్ని డివైజ్‌లలో iOS, iPadOS, macOS, watchOS లేదా visionOSను తప్పనిసరిగా వెర్షన్ 27 లేదా ఆ తర్వాతి వెర్షన్‌కు అప్‌గ్రేడ్ చేయాలి. మీ Apple డివైజ్‌లను ఎలా అప్డేట్ చేయాలో తెలుసుకోండి. | |||||||||||
మీ పిల్లలు యాప్‌లను డౌన్లోడ్ చేసే ముందు వాటిని రివ్యూ చేయడం
‘కొనడానికి అడగాలి’ ద్వారా మీ పిల్లలు ఏ యాప్‌లను కొనుగోలు చేయవచ్చో లేదా డౌన్లోడ్ చేయవచ్చో మీరు నిర్ణయించవచ్చు, తద్వారా కంటెంట్‌ను సురక్షితంగా, సముచితంగా ఉంచడంలో సహాయపడుతుంది. మీ పిల్లలు ఏదైనా డౌన్లోడ్ చేయాలనుకున్నప్పుడు లేదా కొత్తగా ఏదైనా కొనుగోలు చేయాలనుకున్నప్పుడు, వారు మీకు సందేశాలలో అభ్యర్థనను పంపుతారు లేదా మీరు వారి డివైజ్‌లో నేరుగా దాన్ని ఆమోదించగలరు. ఆమోదించే ముందు, అది మీ కుటుంబానికి సరిపోతుందో లేదో చూడటానికి మీరు దాన్ని రివ్యూ చేయవచ్చు.
‘కొనడానికి అడగాలి’ ఫీచర్‌ను ప్రారంభించడానికి, మీ ఫ్యామిలీ షేరింగ్ సెట్టింగ్‌లకు వెళ్ళి, మీ పిల్లల పేరును ఎంచుకుని, ఆపై ‘కొనడానికి అడగాలి’పై క్లిక్ చేయండి లేదా ట్యాప్ చేయండి. మరింత సమాచారం కోసం, ‘కొనడానికి అడగాలి’తో కొత్త యాప్ కొనుగోళ్ళు, డౌన్లోడ్ల కోసం ఆమోదం అవసరం అనే ఆర్టికల్‌ను చూడండి.
గమనిక: ‘కొనడానికి అడగాలి’ App Storeలో (యాప్‌లో కొనుగోళ్ళతో సహా), అలాగే Apple యాప్‌లు అయిన ‘పుస్తకాలు’ వంటి వాటిలో అందుబాటులో ఉంది. పిల్లల ఖాతాతో 13 సంవత్సరాల లోపు పిల్లల కోసం (అలాగే కొన్ని సందర్భాల్లో 18 సంవత్సరాల లోపు టీనేజర్ల కోసం) ఇది డిఫాల్ట్‌గా ఆన్ చేయబడి ఉంటుంది. (దేశం లేదా ప్రాంతాన్ని బట్టి వయో పరిమితులు మారవచ్చు.)
మీ పిల్లలు వెబ్సైట్లను సందర్శించే ముందు వాటిని రివ్యూ చేయడం
‘బ్రౌజ్ చేయడానికి అడగాలి’ ద్వారా, మీరు మీ పిల్లలు ఏయే వెబ్సైట్లను Safariలో యాక్సెస్ చేయవచ్చో నిర్ణయించవచ్చు, తద్వారా మీరు ఆమోదించే కంటెంట్‌ను మాత్రమే వారు చూడగలుగుతారు. మీ పిల్లలు కొత్త వెబ్‌సైట్‌ను సందర్శించాలనుకున్నప్పుడు, వారు మీకు సందేశాలలో అభ్యర్థన పంపుతారు లేదా మీరు వారి డివైజ్‌లో నేరుగా ఆమోదించవచ్చు. ఆమోదించే ముందు, అది మీ కుటుంబానికి సరిపోతుందో లేదో చూడటానికి మీరు దాన్ని రివ్యూ చేయవచ్చు.
‘బ్రౌజ్ చేయడానికి అడగాలి’ ఫీచర్‌ను ప్రారంభించడానికి, మీ ఫ్యామిలీ షేరింగ్ సెట్టింగ్‌లకు వెళ్ళి, మీ పిల్లల పేరును ఎంచుకుని, ఆపై ‘యాప్‌లు & వెబ్సైట్లు’పై క్లిక్ చేయండి లేదా ట్యాప్ చేయండి. మరింత సమాచారం కోసం, Safariలో నిర్దిష్ట యాప్‌లు, వెబ్సైట్లను బ్లాక్ చేయడం లేదా అనుమతించడం అనే ఆర్టికల్‌ను చూడండి.
గమనిక: పిల్లల ఖాతా ఉన్న 13 సంవత్సరాల లోపు పిల్లల కోసం ‘బ్రౌజ్ చేయడానికి అడగాలి’ డిఫాల్ట్‌గా ఆన్‌లో ఉంటుంది, అలాగే పిల్లల ఖాతా ఉన్న 13 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లల కోసం ‘వయోజన వెబ్సైట్లను పరిమితం చేయండి’ డిఫాల్ట్‌గా ఆన్‌లో ఉంటుంది. ‘బ్రౌజ్ చేయడానికి అడగాలి’ అనేది Safariలోని వెబ్సైట్లకు వర్తిస్తుంది. (దేశం లేదా ప్రాంతాన్ని బట్టి వయో పరిమితులు మారవచ్చు.)
అనుమతించబడిన పుస్తకాలు, సంగీతం, మూవీలు, ఇంకా మరిన్నింటిని వయస్సుకు తగిన రేటింగ్‌ల ఆధారంగా ఎంచుకోవడం
మీరు Apple Music, Apple Books వంటి Apple సర్వీస్‌లలో మీ పిల్లలు చూడగలిగే, వినగలిగే వాటిని వయస్సు రేటింగ్‌ల ఆధారంగా సర్దుబాటు చేయవచ్చు, తద్వారా వారి వయస్సుకి తగినవని మీరు భావించే కంటెంట్ మాత్రమే వారికి కనిపిస్తుంది. మీరు కంటి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడటానికి స్క్రీన్ నుండి దూరం ఆన్ చేయడం లేదా Siriని ఆన్ లేదా ఆఫ్ చేయడం వంటి ఇతర సెట్టింగ్‌లను కూడా నిర్వహించవచ్చు.
ప్రారంభించడానికి, మీ ఫ్యామిలీ షేరింగ్ సెట్టింగ్‌లకు వెళ్ళి, మీ పిల్లల పేరును ఎంచుకోండి, ఆపై ‘కంటెంట్, గోప్యత పరిమితులు’ క్లిక్ చేయండి లేదా ట్యాప్ చేయండి. మరింత సమాచారం కోసం, మీ పిల్లల డివైజ్‌లో మూవీలు, సంగీతం, మరిన్నింటి కోసం వయస్సుకు తగిన కంటెంట్‌ను ఎంచుకోవడం అనే ఆర్టికల్‌ను చూడండి.
గమనిక: పిల్లల ఖాతా ఉన్న 18 సంవత్సరాల లోపు పిల్లల కోసం వయస్సు ఆధారిత కంటెంట్ మరియు గోప్యతా పరిమితులు డిఫాల్ట్‌గా ఎనేబల్ చేయబడి ఉంటాయి. (దేశం లేదా ప్రాంతాన్ని బట్టి వయో పరిమితులు మారవచ్చు.)