దశ 2: పిల్లల ఖాతాను సృష్టించడం
పిల్లల ఖాతాను సృష్టించడం వలన వారు వయస్సు ఆధారిత సంరక్షణలను పొందవచ్చు, అలాగే మీ కుటుంబ అవసరాలకు తగినట్లుగా మీరు వాటిని ఎప్పుడైనా సర్దుబాటు చేయవచ్చు. మీ పిల్లల కోసం ఒక ఖాతాను సృష్టించి, ఫ్యామిలీ షేరింగ్ గ్రూప్‌లో చేర్చినప్పుడు, పేరెంటల్ కంట్రోల్‌లను నిర్వహించడానికి అలాగే కొనుగోళ్ళు, సబ్స్క్రిప్షన్లను షేర్ చేసుకోవడానికి వేరే పెద్దలను కూడా తల్లిదండ్రులుగా లేదా సంరక్షకులుగా జోడించవచ్చు. కొత్త పేరెంటల్ కంట్రోల్ అనుభవాన్ని పొందడానికి, మీరు, మీ కుటుంబ సభ్యులు మీ డివైజ్‌లను అప్డేట్ చేయాలి.
గమనిక: 13 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు పిల్లల ఖాతా అవసరం, అలాగే 18 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలకు ఇది అందుబాటులో ఉంటుంది. పిల్లల ఖాతాను సృష్టించడానికి అవసరమైన కనీస వయస్సు దేశాలు, ప్రాంతాల వారీగా మారవచ్చు. మరింత సమాచారం కోసం, మీ పిల్లల కోసం Apple ఖాతాను సృష్టించడం అనే Apple మద్దతు ఆర్టికల్‌ను చూడండి.
పిల్లల ఖాతాను సృష్టించడం ప్రారంభించడానికి, సెట్టింగ్స్ యాప్‌కి (లేదా Macలో సిస్టమ్ సెట్టింగ్స్) వెళ్ళండి, 'పిల్లలను జోడించండి' బటన్‌ను క్లిక్ చేయండి లేదా ట్యాప్ చేయండి, ఆపై 'పిల్లల ఖాతాను సృష్టించండి'ని ఎంచుకోండి. మీ పరిస్థితిని బట్టి, అలాగే మీరు దిగువ పేర్కొన్న వాటిలో ఏదైనా చేయవచ్చు:
మీరు మీ పిల్లల మొదటి iPhone, iPad, Mac లేదా Apple Watchను సెటప్ చేస్తున్నట్లయితే: మీరు మీ పిల్లల కోసం మొదటిసారి Apple డివైజ్‌ను సెటప్ చేసేటప్పుడు, వారి కోసం మొదటి Apple ఖాతాను సృష్టించడానికి దశల వారీగా మీకు మార్గనిర్దేశం చేయబడుతుంది. మీరు ఈ ప్రాసెస్‌లో స్క్రీన్ టైమ్, ఇంకా ఇతర పేరెంటల్ కంట్రోల్‌లను కూడా సెటప్ చేయగలరు. మీ పిల్లల కోసం iPhone లేదా iPad, Mac లేదా Apple Watchను సెటప్ చేయడం అనే ఆర్టికల్ చూడండి.
మీరు మీ పిల్లలకు డివైజ్‌ను ఇస్తున్నట్లయితే: మీ పిల్లలు ఉపయోగించే డివైజ్‌లో వేరొకరు సైన్ ఇన్ చేసి ఉంటే, ఆ Apple ఖాతా నుండి సైన్ ఔట్ చేయండి, ఆపై ఫ్యామిలీ షేరింగ్‌ను ఉపయోగించి వారికి పిల్లల ఖాతాను సెటప్ చేయండి. దీనివల్ల, మీ వ్యక్తిగత వివరాలు వేరుగా ఉంటాయి, అలాగే వారి వయసుకు తగిన పేరెంటల్ కంట్రోల్‌లను కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. మీ iPhone, iPad, Mac లేదా Apple Watchను విక్రయించడానికి, ఎవరికైనా ఇవ్వడానికి లేదా ట్రేడ్ చేయడానికి ముందు ఏమి చేయాలి అనే Apple మద్దతు ఆర్టికల్స్ చూడండి.
మీ పిల్లల వయస్సు సరైనది కాకపోతే: కొంతమంది పిల్లలు Apple ఖాతాలో వారి పుట్టినరోజు వివరాలను సరిగ్గా నమోదు చేయలేదు, దాని వలన వారి వయస్సుకు తగిన సెట్టింగ్‌లు, ఇంకా సూచనలు సరిగ్గా పనిచేయకపోవచ్చు. మీరు పుట్టిన తేదీని సరిచేయవచ్చు, అవసరమైతే దాన్ని పిల్లల ఖాతాగా మార్చవచ్చు. దీనివల్ల, మీ కుటుంబ అవసరాలకు తగ్గట్టుగా కస్టమైజ్ చేసుకోగలిగే వయసుకు తగిన పేరెంటల్ కంట్రోల్‌లు మీ పిల్లలకు లభిస్తాయి. మీరు Apple ఖాతాను పిల్లల ఖాతాగా మార్చినట్లయితే అనే Apple మద్దతు ఆర్టికల్ చూడండి.