దశ 1: స్క్రీన్ టైమ్ గురించి మీ పిల్లలతో మాట్లాడటం
మీరు American Academy of Pediatrics (AAP) నుండి స్క్రీన్ టైమ్ మార్గదర్శకాలను పరిశీలించి, మీ కుటుంబానికి ఏది సరిపోతుందో అని ఆలోచించిన తర్వాత, మీ పిల్లలతో మాట్లాడటమే తదుపరి దశ. ఈ సంభాషణలు ఒకసారి వర్తించే నిబంధనలుగా కాకుండా, వయస్సు పెరిగే కొద్దీ వారితో ఎప్పటికప్పుడు చర్చించే విషయంగా ఉంటే ఉత్తమంగా పనిచేస్తాయి.
మీ పిల్లలతో సంభాషణను ప్రారంభించడం
చిన్నపిల్లల కోసం, వారి దృక్కోణాన్ని మీరు అర్థం చేసుకోవడానికి వారితో కలిసి చూడండి, ఆడుకోండి, ఇంకా సాధారణమైన, భాగస్వామ్య ఒప్పందాలను సెట్ చేయండి. భోజనం చేసే సమయాలు, అలాగే పడుకునే ముందు గంట పాటు స్క్రీన్ చూపకుండా ఉండే సమయాలు, ఇంకా పడకగదుల వంటి స్క్రీన్ చూపని ప్రదేశాలను చేర్చవచ్చు. మీరు సెట్ చేసిన పరిమితులకు గల కారణాలను వివరించండి. పెరుగుతున్న శరీరం, అలాగే మనస్సుకు నిద్ర, కదలిక, ఇంకా భౌతికపరమైన ఆటలు ఎంతో ముఖ్యం. మరియు మీరు చర్చించే పరిమితులకు మద్దతు ఇవ్వడానికి మీరు వారి Apple డివైజ్లో స్క్రీన్ టైమ్ సెట్టింగ్లను సర్దుబాటు చేయవచ్చు.
మీ పిల్లలు పెద్దవుతున్న కొద్దీ, వారి కోసం స్క్రీన్ టైమ్ను నిర్వహించడం నుండి, వారే దాన్ని స్వయంగా నిర్వహించుకోవడంలో వారికి సహాయపడేలా మీరు మార్చాలనుకుంటారు, అప్పుడు వారు వయోజనులు అయ్యే సమయానికి అప్పటికే ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకుంటారు. వారు డివైజ్లో ఎంత సమయం గడుపుతున్నారని కాకుండా వారు నిజంగా ఏమి చేస్తున్నారనే దాని వైపు సంభాషణను కొనసాగించండి. నిందించేలా కాకుండా ఆసక్తిగా తెలుసుకునేలా ఉండండి.
ఆ వెబ్సైట్లో, AAP మీరు అనుసరించగల సంభాషణ ప్రారంభకాలను అందిస్తుంది, అవి:
“సాంకేతికతను ఉపయోగించడం కోసం మన కుటుంబం ఎలాంటి పరిమితులను సెట్ చేసుకోవాలనే దాని గురించి మనం మాట్లాడుకుందామా? ఈ నిర్ణయాలలో నిన్ను కూడా చేర్చాలనుకుంటున్నాను, కాబట్టి దీనిపై మనం కలిసి పనిచేద్దాం.”
“మనం డివైజ్లు లేదా ఫోన్లను ఉపయోగించకూడదని నువ్వు భావించే సమయాలు రోజులో ఏమైనా ఉన్నాయా? అంటే, మనమంతా కలిసి భోజనం చేసేటప్పుడు కావచ్చు.”
“నేను డివైజ్ లేదా ఫోన్లో కాకుండా నీతో ఉండటం నీకు ముఖ్యమనిపించే సమయాలు ఏమైనా ఉన్నాయా?”
అదనపు సూచనల కోసం, AAPలోని మీడియా గురించిన కుటుంబాల కోసం సంభాషణ ప్రారంభకాలను చూడండి.
మీ పిల్లలు డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించుకోవడంలో సహాయపడటం
మీరు మీ పిల్లలతో స్క్రీన్ టైమ్ గురించి మాట్లాడేటప్పుడు, డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించుకోవడంలో, అంటే సాంకేతికతను సురక్షితంగా, ఆలోచనాత్మకంగా ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడం గురించి వారికి సహాయపడవచ్చు. ఏమి షేర్ చేయాలి, ఎవరిని నమ్మాలి, అలాగే ఆన్లైన్లో వ్యక్తులతో ఎలా వ్యవహరించాలనే విషయాలను అర్థం చేసుకోవడంలో మీరు మీ పిల్లలకు సహాయపడగలరు. మీకు కనిపించే తప్పుడు సమాచారానికి సంబంధించిన ఉదాహరణలను మీరు గుర్తించవచ్చు, ఇన్ఫ్లూయెన్సర్లు, ప్రకటనలు ఏమి విక్రయిస్తున్నాయో ప్రశ్నించవచ్చు, ఇంకా ఉపయోగించడం ఆపడం కష్టంగా ఉండే యాప్ల గురించి మాట్లాడవచ్చు. సంభాషణను పరస్పరం కొనసాగించడం వలన సైబర్బుల్లీయింగ్, అలాగే గోప్యత వంటి అతి ముఖ్యమైన అంశాలకు కూడా అవకాశం ఏర్పడుతుంది, తద్వారా మీ పిల్లలు దేని గురించైనా మీతో మాట్లాడగలరని తెలుసుకుంటారు.
మరింత సమాచారం కోసం, AAP నుండి డిజిటల్ ప్రపంచంలో పిల్లల ఎదుగుదలకు సహాయపడటం: AAP విధాన వివరణ అనే ఆర్టికల్ను చూడండి.