American Academy of Pediatrics (AAP) నుండి స్క్రీన్ టైమ్ మార్గదర్శకం
స్క్రీన్ వినియోగం పట్ల ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవడంలో కుటుంబాలకు సహాయపడటానికి American Academy of Pediatrics (AAP) పరిశోధన ఆధారిత మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. పిల్లలు మీడియాను ఎందుకు, ఎలా, దేని కోసం ఉపయోగిస్తున్నారో గమనించమని, అలాగే వారు పెరిగే కొద్దీ దాని గురించి వారితో చర్చిస్తూనే ఉండాలని కుటుంబాలను AAP ప్రోత్సహిస్తుంది.
వయో సమూహం వారీగా స్క్రీన్ టైమ్ మార్గదర్శకం
క్లినికల్, అలాగే పిల్లల అభివృద్ధి పరిశోధనల ఆధారంగా దిగువ ఉన్న మార్గదర్శకం రూపొందించబడింది. కుటుంబాలు వారి పిల్లలకు ఏది ఉత్తమంగా పని చేస్తుందో దాని ఆధారంగా సర్దుబాటు చేయగల ప్రారంభ స్థానాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో ఇది రూపొందించబడింది.
5 సంవత్సరాల లోపు పిల్లల కోసం మార్గదర్శకం:
2 సంవత్సరాల లోపు వారికి: కుటుంబ సభ్యులు, అలాగే స్నేహితులతో వీడియో కాల్స్ మినహా, ఈ వయస్సు పిల్లలను స్క్రీన్ టైమ్‌కు దూరంగా ఉంచాలని పరిశోధనలు, ఇంకా నిపుణుల సూచన సాధారణంగా తెలియజేస్తోంది. ఈ దశలో, చిన్నపిల్లలు, శిశువులు వారి చుట్టూ ఉన్న వ్యక్తులతో ఆటల ద్వారా, అలాగే పరస్పరం మాట్లాడటం ద్వారా ఉత్తమంగా నేర్చుకుంటారు.
2–5 సంవత్సరాల పిల్లలకు: ఈ వయస్సులో, చిన్న పిల్లలు డిజిటల్ మీడియాను ఎలా ఉపయోగిస్తారనే దానితో సహా అలవాట్లను అలవర్చుకోవడం ప్రారంభిస్తారు. మీడియా పరిమితులను సెట్ చేయడం వలన ఆడుకోవడానికి, కలిసి చదువుకోవడానికి, ఇంకా కుటుంబం కోసం సమయాన్ని ఆదా చేయడంలో సహాయపడుతుంది. ఏ ప్రోగ్రామ్ అయినా వయస్సుకు తగినదిగా ఉండాలి, అందరూ కలిసి చూడటం మంచిది, తద్వారా మీరు స్క్రీన్‌పై కనిపించే వాటి గురించి మాట్లాడవచ్చు. ఈ వయస్సులో కూడా తీవ్రమైన భావోద్వేగాలు ఉంటాయి, అలాగే పిల్లలకు వివిధ వ్యూహాలతో ఆ భావోద్వేగాలను అధిగమించడంలో సహాయపడటం వలన ప్రారంభంలోనే ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవచ్చు.
6–12 సంవత్సరాల పిల్లల కోసం మార్గదర్శకం: ఈ వయస్సులో, నిద్ర, కదలిక, ఆట, ఇంకా కుటుంబం కోసం తగినంత సమయాన్ని కేటాయించడం ఎంతో ముఖ్యం. విద్యాపరమైన విలువతో కూడిన నాణ్యమైన కంటెంట్ కోసం వెతకండి, అలాగే అవసరం ఉన్న చోట ఆటోప్లే, ఇంకా నిరంతర స్క్రోలింగ్‌ను ఆఫ్ చేయండి. సోషల్ మీడియాను పరిగణనలోకి తీసుకునే ముందు 13 సంవత్సరాలు వచ్చే వరకు వేచి ఉండాలని చాలా మంది నిపుణులు సూచిస్తున్నారు.
13–17 సంవత్సరాల టీనేజర్ల కోసం మార్గదర్శకం: చాలా కుటుంబాలు గమనించేది ఏమిటంటే, టీనేజర్లకు క్రమంగా స్వేచ్ఛ ఇవ్వడం మంచి ఫలితాలను ఇస్తుంది, మొదట్లో, వారు నేర్చుకుంటున్నప్పుడు ఎక్కువ మార్గదర్శకం, పర్యవేక్షణ అవసరం ఉంటుంది, వారు బాధ్యతగా నడుచుకోవడం మొదలుపెట్టిన తర్వాత, వారికి ఎక్కువ స్వేచ్ఛ ఇవ్వవచ్చు.
ముఖ్యంగా చిన్న వయస్సులో ఉన్న టీనేజర్ల విషయంలో, సోషల్ మీడియాను ఉపయోగించడానికి వారు ఎంత సిద్ధంగా ఉన్నారో ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండండి, అలాగే, నిద్ర, కుటుంబంతో సమయం గడపడం, శారీరక వ్యాయామం, ఇంకా ప్రత్యక్ష సంబంధాల వంటి ముఖ్యమైన విషయాలకు తగినంత సమయం కేటాయించేలా చూసుకోండి.
ఎక్కువ స్వేచ్ఛ ఉన్న టీనేజర్ల విషయంలో, అంతరాయం కలిగిన నిద్ర, అతిగా వినియోగించడం, తగ్గుతున్న గ్రేడ్లు, లేదా సెల్ఫ్-ఇమేజ్ సంబంధిత ఆందోళనలు వంటి డివైజ్ వినియోగం అడ్డంకిగా మారుతున్నట్లు తెలిపే సంకేతాల కోసం చూస్తూ ఉండండి. వారితో మాట్లాడుతూ ఉండండి, తద్వారా టీనేజర్లకు మద్దతు అవసరమైతే మీ వద్దకు రావచ్చని వారికి అనిపిస్తుంది.
ఆరోగ్యకరమైన స్క్రీన్ టైమ్ అలవాట్లను అలవర్చుకోవడానికి చిట్కాలు
స్క్రీన్ వినియోగం గురించిన నిర్ణయాలకు మార్గనిర్దేశం చేయడానికి, American Academy of Pediatrics “ఐదు రకాల పద్ధతుల”ను పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తోంది:
పిల్లలు: మీ పిల్లల వయస్సు, స్వభావం, అలాగే వారి అభివృద్ధి దశను పరిగణనలోకి తీసుకోండి. పిల్లలు ఒకే రకమైన లేదా ఒకే మోతాదులో ఉన్న మీడియాకు వేర్వేరు విధాలుగా ప్రతిస్పందించవచ్చు.
కంటెంట్: వేగవంతమైన లేదా హింసాత్మక మీడియా కంటే విద్యాపరమైన, వయస్సుకు తగిన, అలాగే సానుకూల కంటెంట్‌ను ఎంచుకోవడం మంచిది.
ప్రశాంతత: మీడియా వినియోగం మీ పిల్లలు వారి భావోద్వేగాలను నియంత్రించుకునే సామర్థ్యానికి సహాయపడుతుందా లేదా హాని చేస్తుందా అనే దాని గురించి ఆలోచించండి.
ఇతర పనులకు సమయం కేటాయించకపోవడం: నిద్ర, శారీరక శ్రమ, హోమ్‌వర్క్, బయట ఆడుకోవడం లేదా కుటుంబం, స్నేహితులతో గడిపే సమయంలో స్క్రీన్ టైమ్ దేన్ని భర్తీ చేస్తుందో ఆలోచించండి, ఇంకా ఆ యాక్టివిటీల కోసం మరింత సమయాన్ని కేటాయించండి.
మాట్లాడటం: పిల్లలు ఆన్లైన్లో చూసే, ఇంకా చేసే వాటి గురించి వారితో మాట్లాడండి, తద్వారా వారు మీడియాను అర్థం చేసుకోవడంలో, అలాగే దాని నుండి నేర్చుకోవడంలో వారికి సహాయపడుతుంది.
మీరు మీ కుటుంబం కోసం ఆరోగ్యకరమైన స్క్రీన్ టైమ్ అలవాట్లను ఎలా అలవర్చుకోవాలనే దాని గురించి ఆలోచించేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన మరికొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి:
కుటుంబంతో కలిసి భోజనం చేసే నిర్దిష్ట సమయాలలో, అలాగే పడకగదుల వంటి నిర్దిష్ట ప్రదేశాలలో స్క్రీన్‌ను చూపకుండా ఉంచడం వలన మాట్లాడుకోవడానికి అవకాశం ఏర్పడటమే కాకుండా డివైజ్‌లకు దూరంగా ఉండే అవకాశం కూడా పిల్లలకు లభిస్తుంది.
పిల్లలకు నిద్ర అనేది చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన నిద్రకు తోడ్పడటంలో పడకగదికి బయట డివైజ్‌లను ఛార్జ్ చేయాలని, అలాగే నిద్రపోవడానికి గంట ముందు డివైజ్ కర్ఫ్యూ విధించాలని AAP సూచిస్తోంది.
పిల్లలు తరచుగా వారి చుట్టూ ఉన్న పెద్దవారి నుండి విషయాలను గ్రహిస్తారు, కాబట్టి మీరు మీ స్వంత డివైజ్‌లను ఉపయోగించే విధానం వారి అలవాట్లను రూపొందించడంలో సహాయపడవచ్చు.
AAP నుండి వనరులు
కుటుంబ మీడియా ప్లాన్: AAP మీకు, మీ కుటుంబానికి సహాయపడే ఉచిత సాధనాన్ని అందిస్తోంది, తద్వారా అది డివైజ్ వినియోగించని సమయాలు, నిద్రపోయే సమయం, అలాగే రోజువారీ దినచర్యలతో సహా స్క్రీన్ టైమ్ వినియోగం కోసం కస్టమైజ్ చేయబడిన ప్లాన్‌ను రూపొందించడంలో మీకు సహాయపడుతుంది. కుటుంబ మీడియా ప్లాన్‌ను AAP వెబ్సైట్లో చూడండి.
మీడియా వినియోగంలో 5 రకాల పద్ధతులు: మీడియా వినియోగానికి సంబంధించిన ఐదు రకాల పద్ధతుల గురించి వయస్సు ఆధారిత మార్గదర్శకం, చిట్కాలు, ఇంకా వనరులను AAP అందిస్తుంది. AAP వెబ్సైట్లో పిల్లలు & స్క్రీన్ టైమ్: మీడియా మార్గదర్శకంలోని 5 రకాల పద్ధతులను ఎలా ఉపయోగించాలి అనే ఆర్టికల్‌ను చూడండి.
బాల్యదశ అభివృద్ధి మరియు స్క్రీన్ టైమ్ టూల్‌కిట్: ఆరోగ్యకరమైన మీడియా అలవాట్లను అలవర్చుకోవడంలో కుటుంబాలకు సహాయపడేలా వనరులను AAP అందిస్తుంది. బాల్యదశ అభివృద్ధి, అలాగే స్క్రీన్ టైమ్ టూల్‌కిట్‌ను AAP వెబ్సైట్లో చూడండి.
స్క్రీన్ టైమ్ మార్గదర్శకాలు: టీనేజర్లు సోషల్ మీడియాలో ఎంత సమయం గడపాలనే దానికి సంబంధించిన సాధారణ ప్రశ్నలకు ఆధారాలతో కూడిన మార్గదర్శకంతో AAP సమాధానమిస్తుంది. స్క్రీన్ టైమ్ మార్గదర్శకాలను AAP వెబ్సైట్లో చూడండి.