మీ పిల్లల Apple Watchలో స్కూల్టైమ్ను ప్రారంభించడం
స్కూల్టైమ్ ద్వారా మీరు ఎంచుకున్న రోజులు, సమయాలలో, అంటే స్కూల్ వేళల్లో మీ పిల్లల Apple Watchలో నోటిఫికేషన్లు, ఇంకా యాప్ వినియోగం బ్లాక్ చేయబడతాయి. ఇది యాక్టివ్‌గా ఉన్నప్పుడు, వారి వాచ్ ఫేస్‌పై పసుపు రంగు సర్కిల్ కనిపిస్తుంది, అలాగే ‘అంతరాయం కలిగించవద్దు’ ఆన్ అవుతుంది. మీ పిల్లలు సందేశాలను చూడటానికి లేదా ఎమర్జెన్సీ సర్వీస్‌లకు కాల్ చేయడానికి స్కూల్టైమ్ నుండి తాత్కాలికంగా నిష్క్రమించవచ్చు, వారు అలా చేసిన ప్రతిసారీ మీకు నోటిఫికేషన్ అందుతుంది. మీ పిల్లలు వారి మణికట్టును కిందికి దించినప్పుడు స్కూల్టైమ్ మళ్ళీ ఆన్ అవుతుంది.
గమనిక: మీ పిల్లల కోసం Apple Watch అన్ని దేశాలు లేదా ప్రాంతాలలో అందుబాటులో లేదు. మద్దతు ఉన్న నెట్‌వర్క్‌లతో సహా లభ్యత గురించిన సమాచారం కోసం, Apple Watch GPS + మొబైల్ సర్వీస్ అనే ఆర్టికల్ చూడండి.
మీరు ప్రారంభించే ముందు
కుటుంబ సభ్యుల Apple Watchలో స్కూల్టైమ్ షెడ్యూల్‌లను ఉపయోగించడానికి, ముందుగా మీ పిల్లల కోసం Apple Watchను సెటప్ చేయండి. దీనికి watchOS 7 లేదా ఆ తర్వాతి వెర్షన్‌తో ఉన్న ఈ Apple Watch మోడల్‌లలో ఒకటి అవసరం:
మొబైల్ సర్వీస్‌తో Apple Watch Series 6 లేదా ఆ తర్వాత వెర్షన్లు
మొబైల్ సర్వీస్‌తో Apple Watch SE (1వ జనరేషన్) లేదా ఆ తర్వాత వెర్షన్లు
Apple Watch Ultra, Apple Watch Ultra 2 లేదా ఆ తర్వాత వెర్షన్లు
ప్రారంభ వాచ్ సెటప్ కోసం మీకు iOS 14 లేదా ఆ తర్వాతి వెర్షన్‌తో కూడిన iPhone 6s లేదా ఆ తర్వాతి మోడల్ కూడా అవసరం. మీ సొంత Apple Watchలో స్కూల్టైమ్ను ఉపయోగించడానికి, మీకు watchOS 7 లేదా ఆ తర్వాతి వెర్షన్ అవసరం.
గమనిక: కుటుంబ సభ్యుల కోసం Apple Watchను సెటప్ చేయడానికి మొబైల్ సర్వీస్ ప్లాన్ అవసరం లేదు, కానీ కొన్ని ఫీచర్ల కోసం అవసరం.
స్కూల్టైమ్ను సెటప్ చేయడం
వాచ్‌ను నిర్వహించడానికి ఉపయోగించే iPhoneలో Apple Watch యాప్
కి వెళ్ళండి.
‘నా వాచ్’పై ట్యాప్ చేసి, ఆపై ‘కుటుంబ వాచ్‌లు’ కింద ఉన్న ‘వాచ్’పై ట్యాప్ చేయండి.
ట్యాప్ చేసి, ఆపై స్కూల్టైమ్ను ట్యాప్ చేయండి.
స్కూల్టైమ్ను ఆన్ చేసి, ఆపై ‘షెడ్యూల్‌ను ఎడిట్ చేయండి’ ట్యాప్ చేయండి.
మీరు స్కూల్టైమ్ వాచ్‌లో యాక్టివ్‌గా ఉండాలనుకుంటున్న రోజులు, సమయాలను ఎంచుకోండి.
గమనిక: వివిధ రోజుల కోసం షెడ్యూల్‌లను సెట్ చేయడానికి, ‘రోజులను కస్టమైజ్ చేయండి’పై ట్యాప్ చేయండి.
మీరు ఒక రోజులో వివిధ షెడ్యూల్‌లను సెటప్ చేయాలనుకుంటే, ‘సమయాన్ని జోడించండి’పై ట్యాప్ చేయండి.
స్కూల్టైమ్ నుండి నిష్క్రమించడం
మీ పిల్లలు స్కూల్టైమ్ నుండి తాత్కాలికంగా నిష్క్రమించవచ్చు.
డిస్ప్లేను ట్యాప్ చేసి, ఆపై Digital Crownను నొక్కి ఉంచండి.
‘నిష్క్రమించండి’పై ట్యాప్ చేయండి.
మీ పిల్లలు షెడ్యూల్ చేయబడిన సమయాల్లో స్కూల్టైమ్ నుండి నిష్క్రమిస్తే, వారు తమ మణికట్టును కిందకు దించినప్పుడు స్కూల్టైమ్ వాచ్ ఫేస్ తిరిగి కనిపిస్తుంది. షెడ్యూల్ చేయని గంటల సమయంలో, తదుపరి షెడ్యూల్ చేయబడిన ప్రారంభ సమయం వరకు లేదా మీ పిల్లలు కంట్రోల్ సెంటర్లో స్కూల్టైమ్ను ట్యాప్ చేసే వరకు స్కూల్టైమ్ ఇన్‌యాక్టివ్‌గా ఉంటుంది.
స్కూల్టైమ్ ఎప్పుడు అన్‌లాక్ చేయబడిందో చూడటం
వాచ్‌ను నిర్వహించడానికి ఉపయోగించే iPhoneలో Apple Watch యాప్
కి వెళ్ళండి.
‘నా వాచ్’పై ట్యాప్ చేసి, ఆపై ‘కుటుంబ వాచ్‌లు’ కింద ఉన్న ‘వాచ్’పై ట్యాప్ చేయండి.
పై ట్యాప్ చేసి, ఆపై స్కూల్టైమ్ అన్‌లాక్ చేయబడిన రోజులు, సమయాలు, వ్యవధుల కోసం రిపోర్ట్‌లను చూడటానికి స్కూల్టైమ్పై ట్యాప్ చేయండి.
Apple Watchలో కూడా రిపోర్ట్ కనిపిస్తుంది. దీన్ని చూడటానికి, Apple Watchలోని సెట్టింగ్స్ యాప్
కి వెళ్లి, ఆపై స్కూల్టైమ్ను ట్యాప్ చేయండి.
డిస్ప్లే స్లీప్ మోడ్‌లోకి వెళ్ళినప్పుడు స్కూల్టైమ్ మళ్లీ ఆన్ అవుతుంది.
చిట్కా: స్కూల్టైమ్ యాక్టివ్‌గా లేనప్పుడు, మీ చిన్నారి దాన్ని ఆన్ చేసుకోవచ్చు-ఉదాహరణకు, వారు షెడ్యూల్ చేసిన సమయాల కంటే వేరే సమయంలో జరిగే ఆఫ్టర్-స్కూల్ స్టడీ గ్రూప్‌లో చేరినప్పుడు, ఎలాంటి దృష్టి మళ్లింపులు వద్దనుకుంటే వారు దాన్ని ఆన్ చేయవచ్చు. సైడ్ బటన్‌ను నొక్కి, ఆపై కంట్రోల్ సెంటర్లో పై ట్యాప్ చేయండి. స్కూల్టైమ్ నుండి నిష్క్రమించడానికి, Digital Crownను నొక్కి ఉంచి, ఆపై ‘నిష్క్రమించండి’పై ట్యాప్ చేయండి.
తర్వాత ఏమి చేయాలి?
మీ ఫ్యామిలీ షేరింగ్ గ్రూప్‌లో Apple Music ఫ్యామిలీ సబ్స్క్రిప్షన్ ఉంటే, మీ పిల్లలకు Wi-Fi లేదా మొబైల్ సర్వీస్ కనెక్షన్ ఉన్నంత కాలం వారు Apple Musicను వినవచ్చు. వారు పాడ్‌కాస్ట్‌లను కూడా ఫాలో చేయవచ్చు, స్ట్రీమ్ చేయవచ్చు. ప్రారంభించడానికి, మీ పిల్లల Apple Watchలో సంగీతం లేదా పాడ్‌కాస్ట్స్ యాప్
ను తెరవండి.