మీ ఎడమ లేదా కుడి AirPod పని చేయకపోతే

ఒక AirPodలో సౌండ్ ఏమీ వినిపించకపోతే లేదా ఒక AirPodలో మరొకదానితో పోలిస్తే సౌండ్ చాలా ఎక్కువగా లేదా చాలా తక్కువగా వినిపిస్తే ఏం చేయాలో తెలుసుకోండి.

ఒక AirPodలో సౌండ్ ఏమీ వినిపించకపోతే

  1. మీ ఛార్జింగ్ కేస్ పూర్తిగా ఛార్జ్ అయ్యిందో, లేదో చూసుకోండి.

  2. రెండు AirPodsనూ ఛార్జింగ్ కేస్‌లో ఉంచి, 30 సెకన్ల వరకు ఛార్జ్ అవ్వనివ్వండి.

  3. మీ iPhone లేదా iPad దగ్గర ఛార్జింగ్ కేస్ తెరవండి.

    AirPods 4 ఛార్జింగ్ కేస్‌లో ఉంది, లిడ్ తెరుచుకుని ఉంది
  4. ప్రతి AirPod ఛార్జ్ అవుతోంది అని నిర్ధారించుకోవడానికి మీ iPhone లేదా iPadలో ఛార్జింగ్ స్టేటస్‌ను చెక్ చేయండి .

    iPhone హోమ్ స్క్రీన్‌లో AirPods, అలాగే ఛార్జింగ్ కేస్ బ్యాటరీ లెవల్స్
  5. పని చేయని AirPodను సరైన చెవిలో పెట్టుకోండి.

  6. మరొక AirPod ఛార్జింగ్ కేస్‌లో ఉండగానే, కేస్ లిడ్‌ను మూసివేయండి.

  7. సరిగ్గా పని చేయని AirPodను టెస్ట్ చేయడానికి ఆడియోను ప్లే చేయండి.

  8. టెస్ట్‌లో తేలిన అంశం ఆధారంగా:

    • సరిగ్గా పని చేయని AirPod సౌండ్‌ను ప్లే చేస్తే, రెండు AirPodsనూ ఛార్జింగ్ కేస్‌లో ఉంచండి, 30 సెకన్ల వరకు వాటిని ఛార్జ్ అవ్వనివ్వండి, మీ iPhone లేదా iPad దగ్గర ఛార్జింగ్ కేస్‌ను తెరిచి, అవి రెండూ సరిగ్గా పని చేస్తున్నాయో, లేదో టెస్ట్ చేయండి.

    • AirPod ఇప్పటికీ పని చేయకపోతే, మీ AirPodsను రీసెట్ చేయండి

ఒక AirPod సౌండ్ మరొక దానితో పోలిస్తే, ఎక్కువగా లేదా తక్కువగా ఉంటే

మీ ఎడమ లేదా కుడి AirPod ఎలాంటి సౌండ్ ప్లే చేయకపోతే, లేదా వాల్యూమ్ చాలా తక్కువగా ఉంటే:

  1. ప్రతి AirPodలో మైక్రోఫోన్, అలాగే స్పీకర్ మెష్‌ను చెక్ చేయండి.

    ఎడమ AirPods ఇయర్‌బడ్‌లో స్పీకర్ మెష్
  2. చెత్త పేరుకొని ఉంటే, మీ AirPods లేదా మీ AirPods Proను క్లీన్ చేయండి.

  3. సెట్టింగ్‌లు > యాక్సెసిబిలిటీ > ఆడియో/విజువల్ > బ్యాలెన్స్‌కు వెళ్లండి, అలాగే బ్యాలెన్స్ మధ్యలో సెట్ అయి ఉండేలా చూసుకోండి.

మరింత సహాయం కావాలా?

ఏం జరుగుతోంది అన్నదాని గురించి మాకు మరిన్ని వివరాలు తెలియజేయండి, తర్వాత ఏం చేయాలన్నదాని గురించి మీకు సూచనలు చేస్తాము.

సూచనలు పొందండి

ప్రచురించబడిన తేదీ: