మీ AirPodsను, AirPods Proను రీసెట్ చేయడం ఎలా
మీ AirPods ఛార్జ్ అవ్వకపోయినా, లేదా వేరే ఏదైనా సమస్యను పరిష్కరించాలన్నా, మీరు వాటిని రీసెట్ చేయాల్సి రావచ్చు.
మీ AirPods 1, AirPods 2, AirPods 3, AirPods Pro 1, లేదా AirPods Pro 2లను రీసెట్ చేయడం
మీ AirPodsను వాటి ఛార్జింగ్ కేసులో ఉంచి, లిడ్‌ను మూసివేయండి, ఆపై 30 సెకెన్ల పాటు వేచి ఉండండి.
మీ AirPodsతో పెయిర్ అయి ఉన్న iPhone లేదా iPadలో, సెట్టింగ్‌లు > బ్లూటూత్ ఆప్షన్‌కు వెళ్లండి:
మీ AirPods నా డివైజ్‌ల లిస్ట్‌లో కనిపించకుంటే, మీ AirPodsకు పక్కన ఉన్న మరింత సమాచారం బటన్ను ట్యాప్ చేయండి, తర్వాత ఈ డివైజ్‌ను విస్మరించండి ఆప్షన్‌పై ట్యాప్ చేసి, నిర్దారించుకోవడానికి మరో సారి అదే ఆప్షన్‌పై ట్యాప్ చేయండి.
మీ AirPods లిస్ట్‌లో కనిపించకపోతే, తదుపరి దశకు కొనసాగండి.
మీ ఛార్జింగ్ కేసు లిడ్‌ను తెరవండి.
కేసు వెనుక భాగంలో ఉన్న సెటప్ బటన్‌ను దాదాపు 15 సెకన్ల పాటు నొక్కి, పట్టుకోండి.
కేసు ముందు భాగంలో ఉన్న స్టేటస్ లైట్ కాషాయ రంగులో ఫ్లాష్ అయి, ఆపై తెలుపు రంగులో ఫ్లాష్ అయినప్పుడు, మీ AirPodsను తిరిగి కనెక్ట్ చేయడానికి, మీరు మీ డివైజ్ స్క్రీన్‌పై కనిపించే దశలను ఫాలో అవ్వవచ్చు.
మీ AirPods 4 (అన్ని మోడల్స్) లేదా AirPods Pro 3ను రీసెట్ చేయండి
మీ AirPodsను వాటి ఛార్జింగ్ కేసులో ఉంచి, లిడ్‌ను మూసివేయండి, ఆపై 30 సెకెన్ల పాటు వేచి ఉండండి.
మీ AirPodsతో పెయిర్ అయి ఉన్న iPhone లేదా iPadలో, సెట్టింగ్‌లు > బ్లూటూత్ ఆప్షన్‌కు వెళ్లండి:
మీ AirPods నా డివైజ్‌ల లిస్ట్‌లో కనిపించకుంటే, మీ AirPodsకు పక్కన ఉన్న మరింత సమాచారం బటన్ను ట్యాప్ చేయండి, తర్వాత ఈ డివైజ్‌ను విస్మరించండి ఆప్షన్‌పై ట్యాప్ చేసి, నిర్దారించుకోవడానికి మరో సారి అదే ఆప్షన్‌పై ట్యాప్ చేయండి.
మీ AirPods లిస్ట్‌లో కనిపించకపోతే, తదుపరి దశకు కొనసాగండి.
మీ ఛార్జింగ్ కేసు లిడ్‌ను తెరవండి.
స్టేటస్ లైట్ ఆన్‌లో ఉన్నప్పుడు కేసు ముందు భాగంలో డబుల్-ట్యాప్ చేయండి.
స్టేటస్ లైట్ తెలుపు రంగులో ఫ్లాష్ అయినప్పుడు, మళ్లీ డబుల్-ట్యాప్ చేయండి.
స్టేటస్ లైట్ వేగంగా ఫ్లాష్ అవుతున్నప్పుడు, మూడవసారి డబుల్-ట్యాప్ చేయండి.
స్టేటస్ లైట్ కాషాయ రంగులో ఫ్లాష్ అయి, ఆపై తెలుపు రంగులో ఫ్లాష్ అయినప్పుడు, మీరు మీ AirPodsను తిరిగి కనెక్ట్ చేయడానికి మీ డివైజ్ స్క్రీన్‌పై కనిపించే దశలను ఫాలో అవ్వవచ్చు.
మీరు మీ AirPodsను రీసెట్ చేసినా కూడా స్టేటస్ లైట్ తెలుపు రంగులో ఫ్లాష్ కాకుంటే
మీ AirPodsను ఛార్జింగ్ కేసులో ఉంచి, 20 సెకన్ల పాటు లిడ్‌ను మూసివేయండి.
మీ ఛార్జింగ్ కేసు లిడ్‌ను తెరవండి.
మీ AirPods మోడల్‌ను బట్టి ఈ ప్రాసెస్‌ను ఫాలో అవ్వండి:
AirPods 1, AirPods 2, AirPods 3, AirPods Pro 1, లేదా AirPods Pro 2 మోడల్స్ అయితే, కేసు ముందు భాగంలో ఉన్న స్టేటస్ లైట్ కాషాయ రంగులో ఫ్లాష్ అయి, ఆపై తెలుపు రంగులో ఫ్లాష్ అయ్యే వరకు, కేసుపై ఉన్న సెటప్ బటన్‌ను దాదాపు 15 సెకన్ల పాటు నొక్కి, పట్టుకోండి.
AirPods 4 మోడల్స్, AirPods Pro 3 మోడల్ అయితే, స్టేటస్ లైట్ ఆన్‌లో ఉన్నప్పుడు కేసు ముందు భాగంలో డబుల్-ట్యాప్ చేయండి, ఆపై స్టేటస్ లైట్ తెలుపు రంగులో ఫ్లాష్ అయినప్పుడు మళ్ళీ డబుల్-ట్యాప్ చేయండి. స్టేటస్ లైట్ వేగంగా ఫ్లాష్ అయినప్పుడు, స్టేటస్ లైట్ కాషాయ రంగులో ఫ్లాష్ అయి, ఆపై తెలుపు రంగులో ఫ్లాష్ అయ్యే వరకు మూడవసారి డబుల్-ట్యాప్ చేయండి.
మీ AirPodsను తిరిగి కనెక్ట్ చేయడానికి: మీ AirPodsను వాటి ఛార్జింగ్ కేసులో ఉంచి, లిడ్ తెరిచి ఉంచి, మీ AirPodsను మీ డివైజ్‌ను దగ్గరగా ఉంచండి, ఆపై మీ డివైజ్ స్క్రీన్‌పై కనిపించే దశలను ఫాలో అవ్వండి.
మరింత తెలుసుకోండి
మీ AirPods లేదా ఛార్జింగ్ కేసు రీప్లేస్‌మెంట్‌ను సెటప్ చేయండి