మీ AirPodsను క్లీన్ చేయడం ఎలా

మీ AirPodsను క్రమం తప్పకుండా క్లీన్ చేస్తూ ఉండటం వల్ల వాటిని సులభంగా మెయింటైన్ చేసుకోవచ్చు.

మీ AirPodsను గుర్తించండి, లేదా మీ AirPods Proను క్లీన్ చేయడం లేదా మీ AirPods Max ఎలాగో తెలుసుకోండి.

మీ AirPods మెష్‌లను క్లీన్ చేయండి

మీ AirPods 3, AirPods 4 మెష్‌లను క్లీన్ చేయడానికి, మీకు Belkin AirPods క్లీనింగ్ కిట్ అవసరం లేదా క్లీనింగ్ కోసం మీరు వీటిని కూడా వాడవచ్చు:

  • PEG-6 కాప్రిలిక్/కాప్రిక్ గ్లిజరైడ్స్ ఉన్న మైసెలార్ వాటర్ అవసరం, ఉదాహరణకు, Bioderma లేదా Neutrogena బ్రాండ్స్‌వి

  • డిస్టిల్డ్ వాటర్

  • సాఫ్ట్ బ్రిస్టల్స్ ఉన్న చిన్న పిల్లల టూత్‌బ్రష్

  • రెండు చిన్న కప్పులు

  • ఒక పేపర్ టవల్

మీ AirPods 4 మెష్‌లను క్లీన్ చేయండి

మీరు మీ AirPods 4లో పాడ్స్ చుట్టూ ఉన్న మెష్‌లను క్లీన్ చేయవచ్చు. ఇంకా మరెక్కడా క్లీనింగ్ చేయవద్దు.

AirPods 4 మెష్‌లు.
  1. ఒక కప్పు తీసుకుని, దానిలో కొద్దిగా మైసెలార్ వాటర్‌ను కలపండి.

  2. బ్రిస్టల్స్ పూర్తిగా తడిసే వరకు టూత్‌బ్రష్‌ను మైసెలార్ వాటర్ ఉన్న కప్పులో ముంచండి.

  3. మెష్ పైకి కనిపించేలా మీ AirPodను పట్టుకోండి.

  4. మెష్‌ పైన, బ్రష్‌తో గుండ్రంగా తిప్పుతూ 15 సెకన్ల పాటు క్లీన్ చేయండి.

  5. మీ AirPodను అడ్డంగా తిప్పి దానిని పేపర్ టవల్‌తో నెమ్మదిగా ఒత్తండి. పేపర్ టవల్ మెష్‌కు టచ్ అయ్యేలా చూసుకోండి.

  6. మీరు క్లీన్ చేయాలనుకునే ప్రతి మెష్‌కు, 2-5 దశలను మరో రెండు సార్లు (మొత్తం మూడు సార్లు) రిపీట్ చేయండి.

  7. మైసెలార్ వాటర్‌ను క్లీన్ చేయడానికి, బ్రష్‌ను డిస్టిల్డ్ వాటర్‌తో కడగండి, తర్వాత మీరు క్లీన్ చేసిన ప్రతి మెష్‌కు డిస్టిల్డ్ వాటర్‌ను ఉపయోగించి 1-5 దశలను రిపీట్ చేయండి.

  8. మీ AirPodsను ఛార్జింగ్ కేసులో పెట్టే ముందు లేదా వాటిని ఉపయోగించే ముందు— కనీసం రెండు గంటల పాటు — పూర్తిగా తడి లేకుండా ఆరనివ్వండి.

మీ AirPods 3 మెష్‌లను క్లీన్ చేయండి

మీరు మీ AirPods 3లో పాడ్స్ చుట్టూ ఉన్న మెష్‌లను క్లీన్ చేయవచ్చు. ఇంక మరెక్కడా క్లీనింగ్ చేయవద్దు.

మీరు మీ AirPods 3లో స్నార్కెల్ మెష్, కంట్రోల్ లీక్ మెష్, ఇంకా టాప్ మైక్‌ను క్లీన్ చేయవచ్చు.
  1. ఒక కప్పును తీసుకుని, దానిలో కొద్దిగా మైసెలార్ వాటర్‌ను కలపండి.

  2. బ్రిస్టల్స్ పూర్తిగా తడిసే వరకు టూత్‌బ్రష్‌ను మైసెలార్ వాటర్ ఉన్న కప్పులో ముంచండి.

  3. మెష్ పైకి కనిపించేలా మీ AirPodను పట్టుకోండి.

  4. మెష్‌ పైన, బ్రష్‌తో గుండ్రంగా తిప్పుతూ 15 సెకన్ల పాటు క్లీన్ చేయండి.

  5. మీ AirPodను అడ్డంగా తిప్పి దానిని పేపర్ టవల్‌తో నెమ్మదిగా ఒత్తండి. పేపర్ టవల్ మెష్‌కు టచ్ అయ్యేలా చూసుకోండి.

  6. మీరు క్లీన్ చేయాలనుకునే ప్రతి మెష్‌కు, 2-5 దశలను మరో రెండు సార్లు (మొత్తం మూడు సార్లు) రిపీట్ చేయండి.

  7. మైసెలార్ వాటర్‌ను క్లీన్ చేయడానికి, బ్రష్‌ను డిస్టిల్డ్ వాటర్‌తో కడగండి, తర్వాత మీరు క్లీన్ చేసిన ప్రతి మెష్‌కు డిస్టిల్డ్ వాటర్‌ను ఉపయోగించి 1-5 దశలను రిపీట్ చేయండి.

  8. మీ AirPodsను ఛార్జింగ్ కేసులో పెట్టే ముందు లేదా వాటిని ఉపయోగించే ముందు— కనీసం రెండు గంటల పాటు — పూర్తిగా ఆరనివ్వండి.

మీ AirPods బాడీని క్లీన్ చేయండి

మీ AirPods పైన ఏమైనా మరకలు పడితే లేదా దానికి అది ఏమైనా డ్యామేజ్ అయితే—ఉదాహరణకు; సబ్బులు, షాంపూలు, కండిషనర్లు, లోషన్లు, పర్‌ఫ్యూమ్స్, ద్రావకాలు, డిటర్జెంట్, యాసిడ్స్ లేదా యాసిడిక్ ఫుడ్స్, ఇన్సెక్ట్ రిపెలెంట్, సన్‌స్క్రీన్, నూనె లేదా హెయిర్ డై:

  1. వాటిని మంచి నీళ్ళతో కొద్దిగా తడి చేసిన గుడ్డతో తుడవండి, ఆ తర్వాత వాటిని సాఫ్ట్, పొడిగా ఉండే, ఇంకా ఎలాంటి పోగులు లేని గుడ్డతో ఆరబెట్టండి.

  2. వాటిని ఛార్జింగ్ కేసులో పెట్టే ముందు లేదా వాటిని ఉపయోగించే ముందు - కనీసం రెండు గంటల పాటు - పూర్తిగా ఆరనివ్వండి.

మీ AirPodsపై నీళ్ళు పడకుండా చూసుకోండి, ఇంకా మీ AirPodsను క్లీన్ చేయడానికి పదునైన వస్తువులను లేదా రఫ్ మెటీరియల్స్ వంటివి వాడకండి.

మీ AirPods ఛార్జింగ్ కేసును క్లీన్ చేయండి

  1. ఛార్జింగ్ పోర్ట్‌లో ఏదైనా డస్ట్ ఉంటే, దాన్ని శుభ్రమైన, పొడిగా ఉండే, సాఫ్ట్ బ్రిస్టల్స్ ఉన్న బ్రష్‌తో తొలగించండి. మెటల్ కాంటాక్ట్‌లు దెబ్బతినకుండా ఉండటానికి, ఛార్జింగ్ పోర్టులలోకి ఏదీ వెళ్ళకుండా చూసుకోండి.

  2. ఛార్జింగ్ కేసును సాఫ్ట్, పొడిగా ఉండే, ఇంకా ఎలాంటి పోగులు లేని గుడ్డతో క్లీన్ చేయండి. అవసరమైతే, ఐసోప్రొపైల్ ఆల్కహాల్‌తో ఆ గుడ్డను తడపండి.

  3. ఛార్జింగ్ కేసును గాలికి ఆరనివ్వండి.

ఛార్జింగ్ పోర్టులలోకి ఎటువంటి లిక్విడ్ పోకుండా చూసుకోండి, ఇంకా ఛార్జింగ్ కేసును క్లీన్ చేయడానికి పదునైన వస్తువులను లేదా రఫ్ మెటీరియల్స్ వంటివి వాడకండి.

స్కిన్ ఇరిటేషన్‌ను నివారించండి

  • AirPods 3 లేదా AirPods 4తో వర్క్అవుట్‌లు చేశాక, లేదా మీ డివైజ్‌పై చెమట, సబ్బు, షాంపూ, మేకప్, సన్‌స్క్రీన్, స్కిన్ ఇరిటేషన్స్ కలిగించే లోషన్స్ వంటి లిక్విడ్స్‌ ఒలికితే, మీ డివైజ్‌ను క్లీన్ చేసి, గాలికి ఆరబెట్టండి. మీ AirPodsను—అలాగే మీ చర్మాన్ని—క్లీన్‌గా, పొడిగా ఉంచుకోండి, దీని వల్ల మీ కంఫర్ట్ పెరుగుతుంది, ఇంకా మీ డివైజ్‌ను దీర్ఘ కాలిక డ్యామేజ్ నుండి కాపాడవచ్చు.

  • మీకు ఏవైనా నిర్దిష్ట పదార్థాల వల్ల అలెర్జీలు వస్తాయని లేదా అవి సూట్ కావు అని తెలిస్తే, AirPodsలో ఆ మెటీరీయల్స్‌ను చెక్ చేయండి.

  • AirPods చెమట, నీరు నిరోధకత గురించి తెలుసుకోండి.

మరింత సహాయాన్ని పొందండి

ప్రచురించబడిన తేదీ: