iPadలో స్క్రీన్ టైమ్‌లో షెడ్యూల్‌లను, పరిమితులను సెట్ చేయడం
మీరు స్క్రీన్ నుండి దూరంగా ఉండాలనుకుంటున్న సమయాన్ని షెడ్యూల్ చేయవచ్చు, యాప్ వినియోగం కోసం సమయ పరిమితులను సెట్ చేయవచ్చు, మరెన్నో చేయవచ్చు.
స్క్రీన్ నుండి దూరంగా గడిపే సమయాన్ని షెడ్యూల్ చేయడం
మీరు మీ డివైజ్‌లకు దూరంగా సమయం గడపాలనుకునే వ్యవధుల కోసం యాప్‌లను, నోటిఫికేషన్లను బ్లాక్ చేయండి. ఉదాహరణకు, మీరు భోజన సమయంలో లేదా పడుకునే సమయంలో డౌన్‌టైమ్‌ను షెడ్యూల్ చేయాలనుకోవచ్చు.
డౌన్‌టైమ్ సమయంలో మీరు అనుమతించడానికి ఎంచుకున్న కాల్స్, సందేశాలు, యాప్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి. మీరు డౌన్‌టౌన్ సమయంలో కమ్యూనికేషన్‌ను అనుమతించడానికి, మీరు ఎంచుకున్న కాంటాక్ట్‌ల నుండి కాల్‌లను స్వీకరించవచ్చు, మీరు ఎల్లవేళలా అనుమతించడానికి, మీరు ఎంచుకున్న యాప్‌లను ఉపయోగించవచ్చు.
సెట్టింగ్స్
> స్క్రీన్ టైమ్‌కు వెళ్లండి.
‘యాప్ & వెబ్సైట్ యాక్టివిటి’ని ట్యాప్ చేసి, ఆపై మీరు ఇప్పటికే ఆన్ చేయకపోతే ‘యాప్ & వెబ్సైట్ యాక్టివిటి’ని ఆన్ చేయండి.
డౌన్‌టైమ్‌ను ట్యాప్ చేసి, ఆపై దిగువ పేర్కొన్న వాటిలో ఏదైనా చేయండి:
‘రేపటి వరకు డౌన్‌టైమ్‌ను ఆన్ చేయండి’ ట్యాప్ చేయండి.
ముందస్తుగా డౌన్‌టైమ్‌ను షెడ్యూల్ చేయడానికి ‘షెడ్యూల్ చేసినవి’ ట్యాప్ చేయండి.
మీరు డౌన్‌టైమ్‌ను షెడ్యూల్ చేసినప్పుడు, డౌన్‌టైమ్ ప్రారంభమయ్యే 5 నిమిషాల ముందు రిమైండర్ పంపబడుతుంది. మీరు రిమైండర్‌ను విస్మరించవచ్చు లేదా షెడ్యూల్ చేసిన డౌన్‌టైమ్ ఆన్ అయ్యే వరకు డౌన్‌టైమ్‌ను ఆన్ చేయవచ్చు.
‘ప్రతి రోజు’ లేదా ‘రోజులను కస్టమైజ్ చేయండి’ని ఎంచుకుని, ఆపై ప్రారంభ, ముగింపు సమయాలను సెట్ చేయండి.
మీరు ‘షెడ్యూల్ చేసినవి’ని ఆఫ్ చేయడం ద్వారా ఎప్పుడైనా డౌన్‌టైమ్ షెడ్యూల్‌ను ఆఫ్ చేయవచ్చు.
యాప్ వినియోగానికి సంబంధించిన పరిమితులను సెట్ చేయడం
యాప్‌ల విభాగానికి (ఉదాహరణకు, గేమ్స్ లేదా సోషల్ నెట్వర్కింగ్), ఒక్కో యాప్‌కి సంబంధించిన సమయ పరిమితిని సెట్ చేయండి.
సెట్టింగ్స్
> స్క్రీన్ టైమ్‌కు వెళ్లండి.
‘యాప్ పరిమితులు’ ట్యాప్ చేసి, ఆపై ‘పరిమితిని జోడించండి’ని ట్యాప్ చేయండి.
ఒకటి లేదా అంతకంటే ఎక్కువ యాప్ విభాగాలను ఎంచుకోండి.
విడివిడిగా యాప్‌లకు పరిమితులను సెట్ చేయడానికి, ఆ విభాగంలోని అన్ని యాప్‌లను చూడటానికి, విభాగం పేరును ట్యాప్ చేసి, ఆపై మీరు పరిమితం చేయాలనుకుంటున్న యాప్‌లను ఎంచుకోండి. మీరు వివిధ విభాగాలను లేదా యాప్‌లను ఎంచుకుంటే, మీరు సెట్ చేసిన సమయ పరిమితి వాటన్నింటికీ వర్తిస్తుంది.
‘తర్వాత’ ట్యాప్ చేయండి, ఆపై అనుమతించిన సమయాన్ని సెట్ చేయండి.
ప్రతి రోజు సమయాన్ని సెట్ చేయడానికి, ‘రోజులను కస్టమైజ్ చేయండి’ ట్యాప్ చేసి, ఆపై నిర్దిష్ట రోజులకు పరిమితులను సెట్ చేయండి.
మీరు సెట్టింగ్ పరిమితులను పూర్తి చేసిన తర్వాత, ‘జోడించండి’ ట్యాప్ చేయండి.
అన్ని సమయాల్లో అనుమతించడానికి యాప్‌లను, కాంటాక్ట్‌లను ఎంచుకోవడం
ఎల్లవేళలా, అలాగే డౌన్‌టైమ్ సమయంలో కూడా ఉపయోగించగల యాప్‌లు, మీతో కమ్యూనికేట్ చేయగల కాంటాక్ట్‌లను (ఉదాహరణకు, అత్యవసర పరిస్థితుల్లో) పేర్కొనండి.
సెట్టింగ్స్
> స్క్రీన్ టైమ్ > ‘ఎల్లవేళలా అనుమతించబడినవి’కి వెళ్ళండి.
మీరు కమ్యూనికేషన్‌ను అనుమతించాలనుకుంటున్న కాంటాక్ట్‌లను పేర్కొనడానికి, ‘కాంటాక్ట్స్’ను ట్యాప్ చేయండి.
మీరు కమ్యూనికేషన్ పరిమితులులో ఎంచుకున్న ఎంపిక ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఈ సెట్టింగ్‌లను ‘నిర్దిష్ట కాంటాక్ట్‌లు’కు మార్చి, ఆపై దిగువ పేర్కొన్న వాటిలో ఎంచుకోండి:
‘నా కాంటాక్ట్‌లు’ నుండి ఎంచుకోవడం: కమ్యూనికేషన్‌ను అనుమతించడానికి నిర్దిష్ట వ్యక్తులను ఎంచుకోండి.
కొత్త కాంటాక్ట్‌ను జోడించడం: కొత్త కాంటాక్ట్‌ను జోడించి, ఆ వ్యక్తితో కమ్యూనికేషన్‌ను అనుమతించడానికి.
ఎగువ ఎడమ వైపున ఉన్న
ను ట్యాప్ చేసి, ఆపై అనుమతించబడిన యాప్స్ దిగువున ఉన్న
లేదా యాప్‌లను ఎంచుకోండికి దిగువున ఉన్న
ను ట్యాప్ చేయండి.
ఎగువ ఎడమవైపు ఉన్న
ను ట్యాప్ చేయండి.