మీ iPhone, iPadలో స్టోరేజ్‌ను ఎలా చెక్ చేయాలి
iOS, iPadOS డివైజ్ స్టోరేజ్‌ను మానిటర్ చేసి, ప్రతి యాప్ ఎంత స్పేస్ వాడుతోందో చూపిస్తాయి. మీరు సెట్టింగ్‌లు, Finder, Apple Devices యాప్, లేదా iTunesలో స్టోరేజ్‌ను చెక్ చేయవచ్చు.
iOS, iPadOS స్టోరేజ్‌ను ఆప్టిమైజ్ చేయండి
మీ డివైజ్‌లో స్టోరేజ్ తక్కువగా ఉన్నప్పుడు, అది మళ్లీ డౌన్‌లోడ్ చేసుకునే వీలున్న లేదా అవసరం లేని ఐటెమ్‌లను తీసివేయడం ద్వారా ఆటోమేటిక్‌గా స్పేస్‌ను ఖాళీ చేస్తుంది, ఉదాహరణకు, వాడని యాప్‌లు, తాత్కాలిక ఫైల్స్.
మీ డివైజ్ సహాయంతో దానిలోని స్టోరేజ్‌ను చెక్ చేయడం
సెట్టింగ్‌లు > సాధారణ సెట్టింగ్‌లు > [Device] స్టోరేజ్‌కు వెళ్లండి, అక్కడ మీకు సిఫార్సులు, ఇంకా యాప్‌ల లిస్ట్, వాటి స్టోరేజ్ వినియోగం కనిపిస్తాయి.
ఏదైనా యాప్ స్టోరేజ్‌కు సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి, దాని పేరుపై ట్యాప్ చేయండి. కాష్ చేసిన డేటాను, తాత్కాలిక డేటాను వినియోగ డేటాగా కౌంట్ చేయకపోవచ్చు.
వివరణాత్మక వీక్షణలో, మీరు వీటిని చేయవచ్చు:
యాప్‌ను ఆఫ్‌లోడ్ చేయడం, ఇది యాప్ ఉపయోగించే స్టోరేజ్‌ను ఖాళీ చేస్తుంది, కానీ దాని డాక్యుమెంట్స్‌ను, డేటాను ఉంచుతుంది.
యాప్‌ను తొలగించడం, దీని వల్ల యాప్‌తో పాటు దాని సంబంధించిన డేటా తొలగిపోతుంది.
యాప్‌ను బట్టి, దానిలో కొన్ని డాక్యుమెంట్స్‌ను లేదా కొంత డేటాను వేరుగా తొలగించవచ్చు.
మీ డివైజ్ "స్టోరేజ్ దాదాపుగా నిండిపోయింది" అనే హెచ్చరికను చూపిస్తే, స్టోరేజ్ సిఫార్సులను చెక్ చేయండి లేదా వీడియోలు, యాప్‌ల వంటి కొంత కంటెంట్‌ను తీసివేయండి.
కంటెంట్‌ను వర్గీకరించండి
మీ డివైజ్‌లో ఉన్న కంటెంట్ రకాల లిస్ట్, ఇంకా ప్రతి రకంలో ఏమి ఉంటుందో ఇక్కడ ఉంది:
యాప్‌లు: ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లు, వాటిలోని కంటెంట్, Files యాప్‌లోని "నా iPhone/iPad/iPod touchలో" అనే డైరెక్టరీలో స్టోర్ చేసిన కంటెంట్, Safari డౌన్‌లోడ్‌లు.
ఫోటోలు: Photos యాప్‌లో స్టోర్ చేసిన ఫోటోలు, వీడియోలు.
మీడియా: మ్యూజిక్, వీడియోలు, పాడ్‌కాస్ట్‌లు, రింగ్‌టోన్‌లు, ఆర్ట్‌వర్క్, ఇంకా వాయిస్ మెమోలు.
మెయిల్: ఈమెయిల్స్, వాటి అటాచ్‌మెంట్‌లు.
Apple Books: Books యాప్‌లోని బుక్స్, PDFలు.
మెసేజ్‌లు: మెసేజ్‌లు, వాటి అటాచ్‌మెంట్‌లు.
iCloud Drive: మీ డివైజ్‌లో మీరు లోకల్‌గా డౌన్‌లోడ్ చేసుకున్న iCloud Drive కంటెంట్.1
ఇతర కేటగిరీలు: తీసివేసే వీలు కాని మొబైల్ అసెట్స్ (ఉదా: Siri వాయిస్‌లు, ఫాంట్స్, డిక్షనరీలు, తీసివేసే వీలు కాని లాగ్స్, కాష్‌లు, Spotlight ఇండెక్స్), అలాగే సిస్టమ్ డేటా (ఉదా: Keychain, CloudKit డేటాబేస్).2
సిస్టమ్: ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకున్న స్పేస్. ఇది మీ డివైజ్, మోడల్ ఆధారంగా మారవచ్చు.
మీ స్టోరేజ్ నిండినట్లయితే, స్టోరేజ్‌ను ఆప్టిమైజ్ చేయడానికి సిఫార్సులను ఉపయోగించండి.
సెట్టింగ్‌లలోని స్టోరేజ్ విభాగంలో, మీ డివైజ్ మీ స్టోరేజ్‌ను ఆప్టిమైజ్ చేయడానికి సిఫార్సులను అందించవచ్చు. మీ స్టోరేజ్‌ను ఆప్టిమైజ్ చేయడానికి:
మీ డివైజ్‌కు సంబంధించిన సిఫార్సులను చూడటానికి అన్నీ చూడండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
ప్రతి సిఫార్సు వివరణను చదవండి, ఆపై దాన్ని ఆన్ చేయడానికి ఎనేబుల్ చేయండి ఆప్షన్‌పై ట్యాప్ చేయండి లేదా మీరు తొలగించగల కంటెంట్‌లను రివ్యూ చేయడానికి సిఫార్సు ఆప్షన్‌పై ట్యాప్ చేయండి.
మీ iOS డివైజ్‌లో స్టోరేజ్‌ను చెక్ చేయడానికి Finder, the Apple Devices యాప్ లేదా iTunesను ఉపయోగించండి
మీ Macలో Finderకు స్విచ్ అవ్వండి, లేదా Apple Devices యాప్. మీ PCలో Apple Devices యాప్ లేకపోతే, లేదా మీ Mac macOS Mojave లేదా అంతకు ముందు వచ్చిన వెర్షన్ ఉపయోగిస్తుంటే, iTunes యాప్‌ను ఉపయోగించండి. మీ Mac ఏ macOS ఉపయోగిస్తుందో తెలుసుకోండి.
మీ డివైజ్‌ను మీ కంప్యూటర్‌కు కనెక్ట్ చేయండి.
Finder విండో లేదా Apple Devices యాప్ సైడ్‌బార్‌లో మీ డివైజ్‌ను ఎంచుకోండి. iTunesను ఉపయోగిస్తుంటే, iTunes విండో ఎగువ ఎడమ మూలలో మీ డివైజ్‌ను ఎంచుకోండి. మీ కంటెంట్ ఎంత స్టోరేజ్ వాడుతోందో, కంటెంట్ రకం వారీగా విభజించి చూపించే బార్ కనిపిస్తుంది.
ప్రతి కంటెంట్ రకం ఎంత స్టోరేజ్ వాడుతోందో చూడటానికి, బార్‌పై మీ మౌస్‌ను ఉంచండి.
కంటెంట్‌ను వర్గీకరించండి
మీ డివైజ్‌లో ఉన్న కంటెంట్ రకాల లిస్ట్, ఇంకా ప్రతి రకంలో ఏమి ఉంటుందో ఇక్కడ ఉంది:
ఆడియో: పాటలు, ఆడియో పాడ్‌కాస్ట్‌లు, ఆడియోబుక్‌లు, వాయిస్ మెమోలు, రింగ్‌టోన్‌లు.
వీడియో: సినిమాలు, మ్యూజిక్ వీడియోలు, టీవీ షోలు.
ఫోటోలు: మీ ఫోటో లైబ్రరీ, కెమెరా రోల్, ఫోటో స్ట్రీమ్‌లోని కంటెంట్.
యాప్‌లు: ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లు. డాక్యుమెంట్స్ & డేటాలో యాప్‌లకు చెందిన కంటెంట్ లిస్ట్ ఉంటుంది.
బుక్స్: iBooks బుక్స్, ఆడియో బుక్స్, PDF ఫైల్స్.
డాక్యుమెంట్స్ & డేటా: Safari ఆఫ్‌లైన్ రీడింగ్ లిస్ట్, ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లలో స్టోర్ చేసిన ఫైల్స్, కాంటాక్ట్‌లు, క్యాలెండర్‌లు, మెసేజ్‌లు, ఇంకా ఈమెయిల్స్ (అలాగే వాటి అటాచ్‌మెంట్‌లు) వంటి యాప్ కంటెంట్.
ఇతర కేటగిరీలు: సెట్టింగ్‌లు, Siri వాయిస్‌లు, సిస్టమ్ డేటా, కాష్ చేసిన ఫైల్స్.
సింక్ చేసిన కంటెంట్: మీరు Finder విండోలో సింక్రనైజ్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేసినప్పుడు మీ కంప్యూటర్ నుండి సింక్ చేయబడిన మీడియా కంటెంట్.3
ఇతర రకాల్లో కాష్ చేసిన ఫైల్స్ గురించి
The Finder, Apple Devices యాప్, ఇంకా iTunes కాష్ చేసిన మ్యూజిక్‌ను, వీడియోలను, ఫోటోలను "ఇతర కేటగిరీల" స్టోరేజ్‌గా చూపిస్తాయి. మీరు కంటెంట్‌ను స్ట్రీమ్ చేసినప్పుడు లేదా చూసినప్పుడు సిస్టమ్ ఫైల్స్‌ను క్రియేట్ చేస్తుంది, తద్వారా, మీరు మళ్లీ ఆ కంటెంట్‌ను ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు వేగంగా యాక్సెస్ చేయగలుగుతారు. మీ డివైజ్‌కు ఎక్కువ స్పేస్ అవసరమైనప్పుడు అది ఈ ఫైల్స్‌ను తీసివేస్తుంది.
మీ డివైజ్‌లోని స్టోరేజ్ మీరు Finder, Apple Devices యాప్, లేదా iTunesలో చూసే దానికి భిన్నంగా ఉంటే
Finder, Apple Devices, iTunes కాష్ చేసిన ఫైల్స్‌ను ఇతర రకాలుగా వర్గీకరిస్తాయి కాబట్టి, రిపోర్ట్ అయిన మ్యూజిక్ లేదా వీడియోల స్టోరేజ్ వినియోగంలో తేడా కనిపించవచ్చు. మీ డివైజ్‌లో వినియోగాన్ని చూడటానికి, సెట్టింగ్‌లు > సాధారణ సెట్టింగ్‌లు > [Device] స్టోరేజ్‌కు వెళ్లండి.
మీ డివైజ్ నుండి కాష్ చేసిన ఫైల్స్‌ను తొలగించాలనుకుంటే
స్పేస్‌ను ఖాళీ చేయడానికి, మీ డివైజ్ కాష్ చేసిన, తాత్కాలిక ఫైల్స్‌ను తొలగిస్తుంది, కాబట్టి మీరు అలా చేయనవసరం లేదు.
1. మీరు iCloud కంటెంట్‌ను ఆటోమేటిక్‌గా తొలగించలేరు.
2. సిస్టమ్ కాష్ చేయబడిన ఫైల్స్‌ను తొలగించలేదు.
3. మీరు మీ iPhoneను ఉపయోగించి సింక్ చేసిన కంటెంట్‌లోని డేటాను తీసివేయలేరు. ఈ డేటాను తొలగించడానికి, Finderకు స్విచ్ అవ్వండి లేదా Apple Devices యాప్ లేదా iTunesను తెరిచి, డేటా ఎంపికను తీసివేసి, సింక్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.