మీ iPhoneలో Wi-Fiని ఆన్ చేయండి

సెట్టింగ్స్  > Wi-Fiకి వెళ్లి, ఆపై Wi-Fiని ఆన్ చేయండి.

నెట్‌వర్క్‌లో జాయిన్ కావడానికి, ఈ కింది వాటిలో ఒకదాన్ని ట్యాప్ చేయండి:

  • నెట్‌వర్క్: అవసరమైతే పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి.

  • ఇతరం: దాచిన నెట్‌వర్క్‌లో జాయిన్ అవ్వడం. దాచిన నెట్‌వర్క్ పేరు, భద్రతా రకం, పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి.

Wi-Fi ఐకాన్ స్క్రీన్ ఎగువ భాగంలో కనిపిస్తే, iPhone Wi-Fi నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయబడి చేయబడిందని అర్థం. (దీన్ని ధృవీకరించడానికి, వెబ్‌పేజీని చూడటానికి Safariని తెరవండి.) మీరు అదే లొకేషన్‌కు తిరిగి వెళ్లినప్పుడు iPhone రీకనెక్ట్ అవుతుంది.