Handoffను ఆన్ చేయండి

  • iPhone లేదా iPadలో: సెట్టింగ్స్ > సాధారణం > AirPlay & కంటిన్యూటికి వెళ్లండి, ఆపై Handoffను ఆన్ చేయండి.

  • macOS 13 లేదా తర్వాతి వెర్షన్ ఉన్న Macలో: Apple మెన్యూ > సిస్టమ్ సెట్టింగ్స్ ఎంచుకోండి, సైడ్ బార్‌లో సాధారణంపై క్లిక్ చేసి, AirDrop & Handoff క్లిక్ చేయండి, ఆపై “ఈ Mac, మీ iCloud డివైజ్‌ల మధ్య Handoffను అనుమతించండి”ని ఆన్ చేయండి.

  • macOS 12.5 లేదా అంతకు ముందు వెర్షన్ ఉన్న Mac: Apple మెన్యూ > సిస్టమ్ ప్రాధాన్యతలను ఎంచుకోండి, సాధారణంపై క్లిక్ చేసి, ఆపై “ఈ Mac, మీ iCloud డివైజ్‌ల మధ్య Handoffను అనుమతించండి”ని ఎంచుకోండి.