iPadలో నోట్స్ యాప్‌లో డ్రాయింగ్‌లు, చేతిరాతను జోడించడం

Apple Pencilతో స్కెచ్ గీయడానికి లేదా (మద్దతుగల మోడల్లలో) మీ చేతిరాతతో నోట్‌ను రాయడానికి నోట్స్ యాప్‌ను ఉపయోగించండి. వివిధ రకాల మార్కప్ టూల్స్, రంగులను ఎంచుకొని, రూలర్‌తో స్ట్రెయిట్ లైన్‌లు గీయవచ్చు. మీరు Apple Pencilతో రాస్తున్నప్పుడు, మీ స్వంత చేతివ్రాత శైలిని, అనుభూతిని అలాగే కొనసాగిస్తూ మీ చేతిరాత మరింత స్పష్టంగా ఉండేలా రియల్ టైమ్‌లో ఆటోమేటిక్‌గా మెరుగుపరచబడుతుంది.

స్క్రీన్ దిగువన డ్రాయింగ్, మార్కప్ టూల్‌ను చూపే నోట్.

డ్రాయింగ్, చేతిరాత టూల్స్ ఉపయోగించడం

  1. మీ iPadలో నోట్స్ యాప్ కి వెళ్లండి.

  2. నోట్‌లో, Apple Pencilతో డ్రాయింగ్ లేదా రాయడం ప్రారంభించండి. లేదా మీ వేలితో గీయడానికి లేదా రాయడానికి, చేతిరాత టూల్స్ బటన్ ట్యాప్ చేయండి.

  3. కింది వాటిలో ఏదైనా చేయండి:

    • రంగు లేదా టూల్‌లు మార్చడం: మార్కప్ టూల్స్ ఉపయోగించడం.

    • చేతితో రాసే ప్రాంతాన్ని అడ్జస్ట్ చేయడం: రీసైజ్ హ్యాండిల్‌ను (ఎడమ వైపున) పైకి లేదా కిందకు డ్రాగ్ చేయండి.

    • మీరు Apple Pencilతో రాస్తున్నప్పుడు, మీ చేతిరాతను టైప్ చేసిన టెక్స్ట్‌గా ట్రాన్‌స్క్రైబ్ చేయండి: స్క్రిబల్ టూల్ (పెన్ ఎడమ వైపుకి) ట్యాప్ చేయండి, ఆపై రాయడం ప్రారంభించండి.

      నోట్: మద్దతుగల భాషలలో స్క్రిబల్ అందుబాటులో ఉంది. iOS, iPadOS ఫీచర్ లభ్యత వెబ్‌సైట్ చూడండి. Apple Pencilతో నోట్స్ రాయడం గురించి మరింత తెలుసుకోవడానికి, స్క్రిబల్‌తో టెక్స్ట్ నమోదు చేయడం చూడండి.

చిట్కా: మీరు (మద్దతు ఉన్న భాషలులో) చేతితో రాసిన టెక్స్ట్‌ను నోట్స్‌లో వెతకవచ్చు. నోట్‌కు టైటిల్ లేకపోతే, చేతితో రాసిన టెక్స్ట్‌లోని మొదటి లైన్ టైటిల్ అవుతుంది. హెడింగ్‌ను ఎడిట్ చేయడానికి, నోట్ పైభాగానికి స్క్రోల్ చేయండి, ఆపై ‘ఎడిట్’పై ట్యాప్ చేయండి.

డ్రాయింగ్‌లు, చేతిరాతను ఎంచుకోవడం, ఎడిట్ చేయడం

స్మార్ట్ సెలెక్షన్‌తో, మీరు టైప్ చేసిన టెక్స్ట్ కోసం ఉపయోగించే అదే జెశ్చర్‌లను ఉపయోగించి డ్రాయింగ్‌లు, చేతిరాతను ఎంచుకోవచ్చు. మీరు నోట్‌లో ఎంచుకున్నవాటి స్థానాన్ని మార్చవచ్చు, కాపీ లేదా డిలీట్ చేయవచ్చు. మీరు దీన్ని వేరే నోట్ లేదా యాప్‌లో టైప్ చేసిన టెక్స్ట్‌గా కూడా పేస్ట్ చేయవచ్చు.

నోట్: మీ iPad సిస్టమ్ భాష, సెట్టింగ్స్  > సాధారణం > భాషా & ప్రాంతం > iPad భాషలో మద్దతు గల భాషకు సెట్ చేయబడితే స్మార్ట్ సెలక్షన్, చేతిరాత ట్రాన్స్‌క్రిప్షన్ పని చేస్తాయి. iOS, iPadOS ఫీచర్ లభ్యత వెబ్‌సైట్ చూడండి.

  1. మీ iPadలో నోట్స్ యాప్ కి వెళ్లండి.

  2. నోట్‌లో, ఈ కింది పద్ధతుల్లో దేనినైనా ఉపయోగించి మీ వేలితో డ్రాయింగ్‌లు, చేతిరాతను ఎంచుకోండి:

    • లాసో టూల్‌తో: చేతిరాత టూల్స్ బటన్ ట్యాప్ చేయండి, లాసో టూల్ ట్యాప్ చేయండి (టూల్ పాలెట్‌లో ఎరేజర్, Image Wand మధ్య ఉంటుంది), ఆపై మీరు ఎంచుకోవాలనుకుంటున్న అంశాలను మీ వేలితో ఔట్‌లైన్ చేయండి.

    • జెశ్చర్స్‌తో:

      • టచ్ చేసి ఉంచి, ఆపై ఎంపికను విస్తరించడానికి డ్రాగ్ చేయండి.

      • పదాన్ని ఎంచుకోవడానికి డబల్ ట్యాప్ చేయండి.

      • వాక్యాన్ని ఎంచుకోవడానికి ట్రిపల్ ట్యాప్ చేయండి.

      • అవసరమైన విధంగా ఎంపికను అడ్జస్ట్ చేయడానికి హ్యాండిల్స్ డ్రాగ్ చేయండి.

  3. ఎంపికను ట్యాప్ చేసి, ఆపై దిగువ వాటిలో ఏదైనా ఎంచుకోండి:

    • కట్ చేయడం

    • కాపీ చేయడం

    • డిలీట్ చేయడం

    • డూప్లికేట్ చేయడం

    • Playgroundకు జోడించండి

    • టెక్స్ట్‌గా కాపీ చేయండి

    • పైన స్పేస్‌ను ఇన్సర్ట్ చేయడం

    • అనువాదం

చేతిరాత టెక్స్ట్‌తో పని చేయడం

iPad మీ చేతిరాతను సరళంగా, నిటారుగా, మరింత స్పష్టంగా ఉండేలా మెరుగుపరచగలదు. మీరు మీ చేతిరాతలో టైప్ చేసిన టెక్స్ట్‌ను పేస్ట్ చేయవచ్చు లేదా మార్చవచ్చు, ఇన్‌లైన్‌లో స్పెల్లింగ్ సరిచేయవచ్చు, అలాగే చేతిరాతను కదిలించవచ్చు లేదా డిలీట్ చేయవచ్చు.

  1. మీ iPadలో నోట్స్ యాప్ కి వెళ్లండి.

  2. నోట్ యాప్‌లో, చేతివ్రాతను ఎంచుకోండి.

  3. కింది వాటిలో ఏదైనా చేయండి:

    • రిఫ్లైన్ చేయడం: మీ చేతిరాతను సున్నితంగా, స్ట్రెయిట్‌గా, అలాగే మరింత స్పష్టంగా చేయడానికి, 1ను ‘మెరుగుపరచండి’ ట్యాప్ చేయండి.

      మీ చేతిరాతను ఆటోమేటిక్‌గా మెరుగుపరచడానికి, చేతిరాత టూల్స్ బటన్ ట్యాప్ చేసి, మరిన్ని బటన్ ట్యాప్ చేసి, ఆపై ‘చేతిరాతను ఆటోమేటిక్‌గా మెరుగుపరచండి’ ఆన్ చేయండి.

    • మీ రచనను మరింత స్థాయిని మార్చడానికి: ‘స్ట్రెయిట్‌గా చేసినది’ ట్యాప్ చేయండి.

    • సరైన స్పెల్లింగ్: అండర్‌లైన్ చేసిన పదంపై ట్యాప్ చేసి, ఆపై దానిని ఎలా కరెక్ట్ చేయాలనుకుంటున్నారో ఎంచుకోండి. మార్చిన పదం మీ సొంత చేతిరాత లాగానే కనిపిస్తుంది.

    • చేతిరాతను తరలించడం: ఎంచుకున్న టెక్స్ట్‌ను టచ్ చేసి ఉంచి, ఆపై దానిని కొత్త స్థానానికి డ్రాగ్ చేయండి.

    • టెక్స్ట్ ఆబ్జెక్ట్‌ను చేతిరాతగా మార్చడానికి: డ్రాయింగ్ ఏరియాలో టెక్స్ట్ ఆబ్జెక్ట్‌ను ట్యాప్ చేసి, మరిన్ని బటన్ ట్యాప్ చేసి, ఆపై ‘చేతిరాతకు మార్చండి’ ట్యాప్ చేయండి. (ఈ ఫీచర్ 2కి మీ చేతిరాతలో కనీసం 10 ప్రత్యేకమైన చిన్న అక్షరాలతో గతంలో సేవ్ చేసిన నోట్స్ ఉండటం అవసరం.)

    • టైప్ చేసిన టెక్స్ట్‌ను మీ చేతిరాతలా పేస్ట్ చేయడం: వెబ్‌పేజీ, డాక్యుమెంట్ లేదా ఇమెయిల్ నుండి టెక్స్ట్ ఎంచుకొని కాపీ చేయండి; నోట్స్‌లో చేతిరాత ఉన్న ప్రదేశంలో, ‘పేస్ట్’ ట్యాప్ చేయండి. (ఈ ఫీచర్ 2 కోసం మీ చేతిరాతలో కనీసం 10 ప్రత్యేకమైన చిన్న అక్షరాలను రాసిన, గతంలో సేవ్ చేసిన నోట్స్ అవసరం.)

  4. టెక్స్ట్ ఎరేజ్ చేయడానికి, రైటింగ్‌ను స్క్రాచ్ చేయండి, ఆపై మీ రైటింగ్ ఇన్‌స్ట్రుమెంట్ (Apple Pencil లేదా మీ వేలు వంటివి) నొక్కి ఉంచండి. (పెన్, మోనో లైన్ లేదా మార్కర్ వంటి మార్కప్ టూల్స్ ఉపయోగిస్తున్నప్పుడు మద్దతు ఇవ్వబడుతుంది.)

ఇతర యాప్‌ల నుంచి ఇమేజ్‌లను డ్రాగ్ చేయడం

మీరు ఇతర యాప్‌ల నుండి ఇమేజ్‌లను నోట్‌కు డ్రాగ్ చేసి, వాటిని చేతితో వ్రాసిన, గీసిన చేసిన కంటెంట్‌తో కలపవచ్చు. మీరు డ్రాయింగ్ చేసే ప్రాంతానికి ఇమేజ్‌ను జోడించిన తర్వాత, మీరు ఇమేజ్ స్థానాన్ని, సైజ్‌ను మార్చవచ్చు.

ఇమేజ్ వాండ్‌ను ఉపయోగించడం

Apple Intelligence* ఆన్ చేయబడి ఉంటే, మీరు సృష్టించే రఫ్ స్కెచ్‌ల ఆధారంగా ఇమేజ్‌లను రూపొందించడానికి మీరు నోట్స్‌లో Image Wandను ఉపయోగించవచ్చు. మీరు చుట్టుపక్కల ప్రాంతాలలోని పదాలు, ఇమేజ్‌ల ఆధారంగా ఇమేజ్‌ను సృష్టించడానికి ఖాళీ స్థలాన్ని కూడా ఎంచుకోవచ్చు. Apple intelligenceతో ఇమేజ్ వాండ్‌ను ఉపయోగించడం చూడండి.

1. iPad Pro (M4, M5), iPad Pro 12.9 అంగుళాలు (5వ జనరేషన్, తర్వాతది), iPad Pro 11 అంగుళాలు (3వ జనరేషన్, తర్వాతది), iPad Air (M2, M3), iPad Air 10.9 అంగుళాలు (4వ జనరేషన్, తర్వాతది), iPad (10వ జనరేషన్, తర్వాతది), iPad mini (6వ జనరేషన్), అలాగే iPad mini (A17 Pro)లో చేతిరాత మెరుగుదల అందుబాటులో ఉంది, ఇంగ్లీష్ (ఆస్ట్రేలియా), ఇంగ్లీష్ (కెనడా), ఇంగ్లీష్ (భారతదేశం), ఇంగ్లీష్ (ఐర్లాండ్), ఇంగ్లీష్ (న్యూజిల్యాండ్), ఇంగ్లీష్ (సింగపూర్), ఇంగ్లీష్ (దక్షిణాఫ్రికా), ఇంగ్లీష్ (యుకె), ఇంగ్లీష్ (యుఎస్), ఫ్రెంచ్ (బెల్జియం), ఫ్రెంచ్ (కెనడా), ఫ్రెంచ్ (ఫ్రాన్స్), ఫ్రెంచ్ (స్విట్జర్లాండ్), జర్మన్ (ఆస్ట్రియా), జర్మన్ (జర్మనీ), జర్మన్ (స్విట్జర్‌ల్యాండ్), ఇటాలియన్ (ఇటలీ), ఇటాలియన్ (స్విట్జర్లాండ్), పోర్చుగీస్ (బ్రెజిల్), పోర్చుగీస్ (పోర్చుగల్), స్పానిష్ (లాటిన్ అమెరికా), స్పానిష్ (మెక్సికో), స్పానిష్ (స్పెయిన్)కి మద్దతు ఉంది.
2. కాంటోనీస్ (సాంప్రదాయ), చైనీస్ (సరళీకృతం), చైనీస్ (సాంప్రదాయ), ఇంగ్లీష్ (ఆస్ట్రేలియా), ఇంగ్లీష్ (కెనడా), ఇంగ్లీష్ (ఇండియా), ఇంగ్లీష్ (ఐర్లాండ్), ఇంగ్లీష్ (న్యూజిలాండ్), ఇంగ్లీష్ (సింగపూర్), ఇంగ్లీష్ (సౌత్ ఆఫ్రికా), ఇంగ్లీష్ (యూకె), ఇంగ్లీష్ (యూఎస్), ఫ్రెంచ్ (బెల్జియం), ఫ్రెంచ్ (కెనడా), ఫ్రెంచ్ (ఫ్రాన్స్), ఫ్రెంచ్ (స్విట్జర్లాండ్), జర్మన్ (ఆస్ట్రియా), జర్మన్ (జర్మనీ), జర్మన్ (స్విట్జర్లాండ్), ఇటాలియన్ (ఇటలీ), ఇటాలియన్ (స్విట్జర్లాండ్), జపనీస్, కొరియన్, పోర్చుగీస్ (బ్రెజిల్), పోర్చుగీస్ (పోర్చుగల్), రష్యన్, స్పానిష్ (లాటిన్ అమెరికా), స్పానిష్ (మెక్సికో), స్పానిష్ (స్పెయిన్), థాయ్ (థాయిలాండ్), యుక్రేనియన్, వియత్నామీస్ భాషలలో చేతివ్రాత రిఫ్లోకు మద్దతు ఉంది.
*Apple Intelligence ఈ కింది భాషలకు మద్దతుతో బీటాలో అందుబాటులో ఉంది: ఇంగ్లీష్, డానిష్, డచ్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, నార్వేజియన్, పోర్చుగీస్, స్పానిష్, స్వీడిష్, టర్కిష్, చైనీస్ (సరళీకృతం), చైనీస్ (సాంప్రదాయ), జపనీస్, కొరియన్, ఇంకా వియత్నామీస్. కొన్ని ఫీచర్‌లు అన్ని భాషలు లేదా ప్రాంతాలలో అందుబాటులో ఉండకపోవచ్చు. భాష, ఫీచర్ లభ్యత, ఇంకా సిస్టమ్ అవసరాలకు సంబంధించిన మరింత సమాచారం కోసం, Apple Intelligenceను ఎలా పొందాలి అనే Apple మద్దతు ఆర్టికల్‌ను చూడండి.