iPadలోని Mailలో ఇమెయిల్ పంపడం
మీరు మీకు సంబంధించిన ఇమెయిల్ ఖాతాల నుండి ఇమెయిల్ సందేశాలను రాయవచ్చు, పంపవచ్చు, షెడ్యూల్ చేయవచ్చు.

ఇమెయిల్ రాసి, పంపడం
మీ iPadలో Mail యాప్
కు వెళ్ళండి.
ట్యాప్ చేయండి.ఇమెయిల్‌లో ట్యాప్ చేసి, ఆపై మీ సందేశాన్ని టైప్ చేయండి.
ఆన్‌స్క్రీన్ కీబోర్డ్‌తో మీరు వ్యక్తిగత కీలను ట్యాప్ చేయవచ్చు. లేదా చిన్న QuickType కీబోర్డ్‌ను ఉపయోగించడానికి మూడు వేళ్లతో లోపలికి పించ్ చేయండి, ఆపై మీ వేలిని ఒక అక్షరం నుండి మరొకదానికి స్లైడ్ చేయండి, ప్రతి పదం తర్వాత మీ వేలిని ఎత్తండి.
ఫార్మాటింగ్ మార్చడానికి, కీబోర్డ్ ఎగువన
ట్యాప్ చేయండి.మీరు టెక్స్ట్ ఫాంట్ స్టైల్‌ను, రంగును మార్చవచ్చు, బోల్డ్ లేదా ఇటాలిక్ స్టైల్‌ను ఉపయోగించవచ్చు, బుల్లెట్‌లు గల జాబితాను లేదా సంఖ్యల జాబితాను జోడించవచ్చు, మరెన్నో చేయవచ్చు.
మీ సందేశాన్ని పంపడానికి
ట్యాప్ చేయండి.
చిట్కా: మీరు ఇమెయిల్‌లను కంపోజ్ చేస్తున్నప్పుడు స్టిక్కర్‌లను సృష్టించి, వాటిని సందేశాలకు జోడించవచ్చు. iPad కీబోర్డ్‌తో ఎమోజీ, Memoji, స్టిక్కర్‌లను జోడించడం చూడండి.
గ్రహీతలను జోడించడం
మీ iPadలో Mail యాప్
కు వెళ్ళండి.
ను ట్యాప్ చేసి, ‘వీరికి’ ఫీల్డ్‌ను ట్యాప్ చేసి, ఆపై గ్రహీతల పేర్లను టైప్ చేయండి.మీరు టైప్ చేస్తున్నప్పుడు Mail యాప్ అనేది, ఆటోమేటిక్‌గా ఒకటి కంటే ఎక్కువ ఇమెయిల్ అడ్రెస్‌లను కలిగి ఉండి, మీ కాంటాక్ట్‌లలో ఉన్న వ్యక్తులను వారి ఇమెయిల్ అడ్రెస్‌లతో సహా సూచిస్తుంది.
‘కాంటాక్ట్స్’ను తెరిచి, అక్కడ నుండి గ్రహీతలను జోడించడానికి మీరు
ను కూడా ట్యాప్ చేయవచ్చు.మీరు ఇతర వ్యక్తులకు కాపీని పంపాలనుకుంటే, Cc/Bcc ఫీల్డ్‌ను ట్యాప్ చేసి, దిగువ పేర్కొన్న వాటిలో ఏదైనా చేయండి:
Cc ఫీల్డ్‌ను ట్యాప్ చేసి, ఆపై మీరు కాపీని పంపాలనుకుంటున్న వ్యక్తుల పేర్లను నమోదు చేయండి.
Bcc ఫీల్డ్‌ను ట్యాప్ చేసి, ఏ వ్యక్తుల పేర్లను అయితే ఇతర గ్రహీతలు చూడకూడదని మీరు కోరుకుంటున్నారో ఆ వ్యక్తుల పేర్లను నమోదు చేయండి.
ఇమెయిల్ సందేశానికి హైపర్‌లింక్‌ను జోడించడం
Safari
లో లేదా మరో వెబ్ బ్రౌజర్‌లో, వెబ్‌పేజీ URLను కాపీ చేయండి.మీరు Mail
లో సందేశాన్ని కంపోజ్ చేస్తున్నప్పుడు, మీరు లింక్ చేయాలనుకుంటున్న టెక్స్ట్‌ను హైలైట్ చేయండి.‘పేస్ట్ చేయండి’ని ట్యాప్ చేయండి.
ఇమెయిల్ డ్రాఫ్ట్‌లో లింక్‌ను ఎడిట్ చేయడం
మీ iPadలో Mail యాప్
కు వెళ్ళండి.మీరు రాస్తున్న సందేశంలో, లింక్‌ను లేదా లింక్ చేసిన టెక్స్ట్‌ను ట్యాప్ చేసి, ఆపై
ను ట్యాప్ చేయండి.దిగువ వాటిలో ఏదైనా చేయండి:
లింక్ ప్రివ్యూను చూపడం: హైపర్‌లింక్ చేయబడిన టెక్స్ట్‌ను పొందుపరిచిన వెబ్‌సైట్ ప్రివ్యూ ఇమేజ్‌ను మార్చండి.
లింక్‌ను తెరవడం: వెబ్ బ్రౌజర్‌లో ఆ వెబ్‌సైట్‌కు వెళ్ళండి.
లింక్‌ను ఎడిట్ చేయడం: లింక్ URLను మార్చండి.
లింక్‌ను తొలగించడం: మీ సందేశం డ్రాఫ్ట్ నుండి లింక్‌ను డిలీట్ చేయండి.
టెక్స్ట్ వివరణను ఎడిట్ చేయడం: లింక్ చేయబడిన టెక్స్ట్‌ను మార్చండి.
ఫోటో నుండి ఇమెయిల్ అడ్రెస్‌ను క్యాప్చర్ చేయడం
iPadలోని ఫోటోస్ యాప్‌ను ఉపయోగించి, బిజినెస్ కార్డ్‌లో, పోస్టర్‌లో, అలాగే మరిన్నింటిలో ప్రింట్ చేయబడిన ఇమెయిల్ అడ్రెస్‌ను స్కాన్ చేయడానికి మీరు లైవ్ టెక్స్ట్‌ను ఉపయోగించవచ్చు. ఇమెయిల్ అడ్రెస్‌ను మాన్యువల్‌ను నమోదు చేసే అవసరం లేకుండా ఇమెయిల్‌లను త్వరగా ప్రారంభించడానికి ఇది మీకు వీలు కల్పిస్తుంది.
మీ iPadలోని ఫోటోస్ యాప్
కు వెళ్లండి.ఫోటోను తెరిచి, ఆపై మీరు క్యాప్చర్ చేయాలనుకుంటున్న ఇమెయిల్ అడ్రెస్ ట్యాప్ చేయండి.
గుర్తించబడిన టెక్స్ట్ చుట్టూ పసుపు ఫ్రేమ్ కనిపించిన తర్వాత,
ట్యాప్ చేయండి.ఇమెయిల్ అడ్రెస్ ఎంచుకోవడానికి ట్యాప్ చేయండి లేదా గ్రాబ్ పాయింట్‌లు ఉపయోగించండి, ఆపై కొత్త Mail సందేశాన్ని ట్యాప్ చేయండి.
చిట్కా: మీరు కెమెరా యాప్‌ను ఉపయోగించి ఇమెయిల్ అడ్రస్‌ను క్యాప్చర్ చేయడానికి, అదే లైవ్ టెక్స్ట్ ఫీచర్‌ను ఉపయోగించవచ్చు. మీ iPad కెమెరాతో లైవ్ టెక్స్ట్‌ను ఉపయోగించడం చూడండి.
‘తర్వాత పంపండి’ని ఉపయోగించి ఇమెయిల్‌ను షెడ్యూల్ చేయడం
మీ iPadలో Mail యాప్
కు వెళ్ళండి.మీరు రాస్తున్న సందేశంలో,
ను టచ్ చేసి పట్టుకుని, ఆపై మీరు సందేశాన్ని ఎప్పుడు పంపాలనుకుంటున్నారో ఎంచుకోండి.మరిన్ని ఎంపికలను చూడటానికి, ’తర్వాత పంపండి’ని ట్యాప్ చేయండి.
ఆటోమేటిక్‌గా మీకు కాపీని పంపడం
మీ iPadలోని సెట్టింగ్స్ యాప్
కి వెళ్లండి.యాప్స్‌ను ట్యాప్ చేసి, ఆపై Mailను ట్యాప్ చేయండి.
’నన్ను ఎల్లప్పుడూ Bccలో ఉంచండి’(కంపోజింగ్ దిగువన) ఆన్ చేయండి.
వేరే ఖాతా నుండి ఇమెయిల్‌ను పంపడం
మీకు ఒకటి కంటే ఎక్కువ ఇమెయిల్ ఖాతాలు ఉంటే, మీరు ఏ ఖాతా నుండి ఇమెయిల్ పంపాలో పేర్కొనవచ్చు.
మీ iPadలో Mail యాప్
కు వెళ్ళండి.మీ సందేశం డ్రాఫ్ట్‌లో, Cc/Bcc, ‘వీరి నుండి’ ఫీల్డ్‌ను ట్యాప్ చేయండి.
‘వీరి నుండి’ ఫీల్డ్‌ను ట్యాప్ చేసి, ఆపై ఖాతాను ఎంచుకోండి.
మీ ఇమెయిల్‌ను సంక్షిప్తీకరించడం, ప్రూఫ్ రీడ్ చేయడం, అలాగే సవరించడానికి రైటింగ్ టూల్స్ ఉపయోగించడం
Apple Intelligenceతో*, మీరు ఎంచుకున్న టెక్స్ట్‌ను ట్యాప్ చేసి, సారాంశాన్ని పొందడానికి, మీ పనిని ప్రూఫ్ రీడ్ చేయడానికి, అలాగే మీకు సరైన పదాలు, భావాన్ని కనుగొనడంలో సహాయపడటానికి ఒకే టెక్స్ట్‌కు సంబంధించిన విభిన్న వెర్షన్‌లను సృష్టించడానికి మీరు రైటింగ్ టూల్స్ ఉపయోగించవచ్చు. Apple Intelligenceతో రైటింగ్ టూల్స్ ఉపయోగించడం చూడండి.