iPad స్టేటస్ ఐకాన్‌ల అర్థాన్ని తెలుసుకోండి
స్క్రీన్ పైభాగంలో ఉన్న స్టేటస్ బార్‌లోని ఐకాన్‌లు iPad గురించిన సమాచారాన్ని అందిస్తాయి.
నోట్: మీరు ఫోకస్ ఆన్ చేస్తే , దాని ఐకాన్, స్టేటస్ బార్‌లో కనిపిస్తుంది.
స్టేటస్ ఐకాన్ | దాని అర్థం | ||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Wi-Fi. iPadకి Wi-Fi ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది. ఎంత ఎక్కువ బార్లు ఉంటే, కనెక్షన్ అంత బలంగా ఉంటుంది. అందుబాటులో ఉన్న నెట్‌వర్క్‌ను చూడటం, Wi-Fiకి కనెక్ట్ చేయడం చూడండి. | |||||||||||
సెల్ సిగ్నల్.iPad (Wi-Fi + Cellular మోడల్‌లు) మొబైల్ నెట్‌వర్క్ పరిధిలో ఉంది. సిగ్నల్ లేనట్లయితే, “సర్వీస్ లేదు” అని కనిపిస్తుంది. | |||||||||||
ఎయిర్‌ప్లేన్ మోడ్. ఎయిర్‌ప్లేన్ మోడ్ ఆన్‌లో ఉంది. నాన్ వైర్‌లెస్ ఫీచర్ అందుబాటులో ఉంది, కానీ వైర్‌లెస్ ఫంక్షన్‌లను డిసేబల్ చేయవచ్చు. ప్రయాణ సెట్టింగ్‌లను ఎంచుకోవడం ఆర్టికల్ చూడండి. | |||||||||||
5G. మీ నెట్‌వర్క్ ప్రొవైడర్ 5G అందుబాటులో ఉంది, అలాగే మద్దతు ఉన్న మోడల్‌లు ఆ నెట్‌వర్క్ ద్వారా ఇంటర్నెట్‌కు కనెక్ట్ అవ్వవచ్చు (అన్ని దేశాలు లేదా ప్రాంతాలలో అందుబాటులో లేదు). మీ iPhoneతో 5G ఉపయోగించడం అనే Apple మద్దతు ఆర్టికల్ చూడండి. | |||||||||||
5G UC. మీ నెట్‌వర్క్ ప్రొవైడర్ 5G UC అందుబాటులో ఉంది, ఇందులో మీ నెట్‌వర్క్ ప్రొవైడర్ 5G అధిక ఫ్రీక్వెన్సీ వెర్షన్ ఉండవచ్చు. మద్దతు ఉన్న మోడల్‌లు ఆ నెట్‌వర్క్ ద్వారా ఇంటర్నెట్‌కు కనెక్ట్ అవ్వవచ్చు (అన్ని దేశాలు లేదా ప్రాంతాలలో అందుబాటులో లేదు). మీ iPhoneతో 5G ఉపయోగించడం అనే Apple మద్దతు ఆర్టికల్ చూడండి. | |||||||||||
5G+. మీ నెట్‌వర్క్ ప్రొవైడర్ 5G+ అందుబాటులో ఉంది, ఇందులో మీ నెట్‌వర్క్ ప్రొవైడర్ 5G అధిక ఫ్రీక్వెన్సీ వెర్షన్ ఉండవచ్చు. మద్దతు ఉన్న మోడల్‌లు ఆ నెట్‌వర్క్ ద్వారా ఇంటర్నెట్‌కు కనెక్ట్ అవ్వవచ్చు (అన్ని దేశాలు లేదా ప్రాంతాలలో అందుబాటులో లేదు). మీ iPhoneతో 5G ఉపయోగించడం అనే Apple మద్దతు ఆర్టికల్ చూడండి. | |||||||||||
5G UW. మీ నెట్‌వర్క్ ప్రొవైడర్ 5G UW అందుబాటులో ఉంది, ఇందులో మీ నెట్‌వర్క్ ప్రొవైడర్ 5G అధిక ఫ్రీక్వెన్సీ వెర్షన్ ఉండవచ్చు. మద్దతు ఉన్న మోడల్‌లు ఆ నెట్‌వర్క్ ద్వారా ఇంటర్నెట్‌కు కనెక్ట్ అవ్వవచ్చు (అన్ని దేశాలు లేదా ప్రాంతాలలో అందుబాటులో లేదు). మీ iPhoneతో 5G ఉపయోగించడం అనే Apple మద్దతు ఆర్టికల్ చూడండి. | |||||||||||
5G E. మీ నెట్‌వర్క్ ప్రొవైడర్ 5G E అందుబాటులో ఉంది, అలాగే మద్దతు ఉన్న మోడల్‌లు ఆ నెట్‌వర్క్ ద్వారా ఇంటర్నెట్‌కు కనెక్ట్ అవ్వవచ్చు (అన్ని దేశాలు లేదా ప్రాంతాలలో అందుబాటులో లేదు). మొబైల్ డేటా సెట్టింగ్‌లు చూడటం లేదా మార్చడం అనే ఆర్టికల్ చూడండి. | |||||||||||
LTE. iPad (Wi-Fi + Cellular మోడల్‌లు) 4G LTE నెట్‌వర్క్ ద్వారా ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయబడింది (అన్ని దేశాలు లేదా ప్రాంతాలలో అందుబాటులో లేదు). మొబైల్ డేటా సెట్టింగ్‌లు చూడటం లేదా మార్చడం అనే ఆర్టికల్ చూడండి. | |||||||||||
4G. iPad (Wi-Fi + Cellular మోడల్‌లు), 4G నెట్‌వర్క్ ద్వారా ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయబడింది (అన్ని దేశాలు లేదా ప్రాంతాలలో అందుబాటులో లేదు). మొబైల్ డేటా సెట్టింగ్‌లను చూడటం లేదా మార్చడం అనే ఆర్టికల్ చూడండి. | |||||||||||
3G. iPad ( Wi-Fi + Cellular మోడల్‌లు) 3G నెట్‌వర్క్ ద్వారా ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయబడింది. మొబైల్ డేటా సెట్టింగ్‌లను చూడటం లేదా మార్చడం అనే ఆర్టికల్ చూడండి. | |||||||||||
EDGE. iPad (Wi-Fi + Cellular మోడల్‌లు) EDGE నెట్‌వర్క్ ద్వారా ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయబడింది. మొబైల్ డేటా సెట్టింగ్‌లను చూడటం లేదా మార్చడం అనే ఆర్టికల్ చూడండి. | |||||||||||
GPRS. iPad (Wi-Fi + Cellular మోడల్‌లు) GPRS నెట్‌వర్క్ ద్వారా ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయబడింది. మొబైల్ డేటా సెట్టింగ్‌లను చూడటం లేదా మార్చడం అనే ఆర్టికల్ చూడండి. | |||||||||||
వ్యక్తిగత హాట్‌స్పాట్ కనెక్షన్. వేరే డివైజ్ వ్యక్తిగత హాట్‌స్పాట్ ద్వారా iPad, ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయబడింది. వ్యక్తిగత హాట్‌స్పాట్‌లో జాయిన్ అవ్వడం అనే ఆర్టికల్ చూడండి. | |||||||||||
VPN. iPad VPN ఉపయోగించి నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయబడింది. | |||||||||||
నావిగేషన్. iPad మలుపుల దిశలను అందిస్తోంది. డ్రైవింగ్ దిశలను పొందడం ఆర్టికల్ చూడండి. | |||||||||||
వ్యక్తిగత హాట్‌స్పాట్. iPad వ్యక్తిగత హాట్‌స్పాట్‌ను అందిస్తోంది. వ్యక్తిగత హాట్‌స్పాట్‌తో మీ ఇంటర్నెట్ కనెక్షన్‌ను షేర్ చేయడం అనే ఆర్టికల్ చూడండి. | |||||||||||
ఫోన్ కాల్. iPad ఫోన్ కాల్‌లో ఉంది. మీ iPadలో కాల్‌లు, టెక్స్ట్ సందేశాలను అనుమతించడానికి iPhoneను ఉపయోగించడం చూడండి. | |||||||||||
FaceTime. iPad, FaceTime కాల్‌లో ఉంది. FaceTime కాల్‌లు చేయడం ఆర్టికల్ చూడండి. | |||||||||||
స్క్రీన్ రికార్డింగ్. iPad మీ స్క్రీన్‌ను రికార్డ్ చేస్తోంది. స్క్రీన్‌ను రికార్డ్ చేయడం ఆర్టికల్ చూడండి. | |||||||||||
కెమెరా వినియోగంలో ఉంది. ఏదో యాప్ మీ కెమెరాను ఉపయోగిస్తోంది. మీ iPadలో కెమెరా, మైక్రోఫోన్‌కు యాక్సెస్ ఉన్న యాప్‌లను కంట్రోల్ చేయడం చూడండి. | |||||||||||
మైక్రోఫోన్ వినియోగంలో ఉంది. ఏదో యాప్ మీ మైక్రోఫోన్‌ను ఉపయోగిస్తోంది. మీ iPadలో కెమెరా, మైక్రోఫోన్‌కు యాక్సెస్ ఉన్న యాప్‌లను కంట్రోల్ చేయడం చూడండి. | |||||||||||
సింక్ చేయబడుతోంది. iPad మీ కంప్యూటర్‌తో సింక్ చేయబడుతోంది. మీ iPadను ఇతర డివైజ్‌లతో సింక్ చేయడం చూడండి. | |||||||||||
నెట్‌వర్క్ యాక్టివిటి. నెట్‌వర్క్ లేదా ఇతర యాక్టివిటి ఉంది. కొన్ని థర్డ్ పార్టీ యాప్‌లు యాప్ యాక్టివిటీని చూపడానికి ఈ ఐకాన్‌ను ఉపయోగిస్తాయి. ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయడం అనే ఆర్టికల్ చూడండి | |||||||||||
లాక్. iPad లాక్ చేయబడింది. iOSను మేల్కొలపడం, అన్‌లాక్ చేయడం, లాక్ చేయడం చూడండి. | |||||||||||
అంతరాయం కలిగించవద్దు. అంతరాయం కలిగించవద్దు ఆన్ చేయబడింది. ఫోకస్‌ను ఆన్ చేయడం లేదా షెడ్యూల్ చేయడం అనే ఆర్టికల్ చూడండి. | |||||||||||
ఓరియంటేషన్ లాక్. స్క్రీన్ ఓరియంటేషన్ లాక్ చేయబడింది. స్క్రీన్ ఓరియంటేషన్‌ను మార్చడం లేదా లాక్ చేయడం ఆర్టికల్ చూడండి. | |||||||||||
లొకేషన్ సర్వీస్‌లు. ఏదో యాప్, లొకేషన్ సర్వీస్‌లను ఉపయోగిస్తోంది. మీ iPad లొకేషన్‌ను ఏ యాప్‌లు ఉపయోగించవచ్చో కంట్రోల్ చేయడం చూడండి. | |||||||||||
అలారం. అలారం సెట్ చేయబడింది. అలారం సెట్ చేయడం ఆర్టికల్ చూడండి. | |||||||||||
హెడ్‌ఫోన్‌లు కనెక్ట్ చేయబడ్డాయి. iPad, Bluetooth® హెడ్‌ఫోన్‌లతో పెయిర్ చేయబడి, అవి Bluetooth పరిధిలో ఉంటాయి. Bluetooth హెడ్‌ఫోన్‌లను సెటప్ చేసి వినడం ఆర్టికల్ చూడండి. | |||||||||||
బ్యాటరీ. iPad బ్యాటరీ లెవెల్‌ను చూపుతుంది. ఐకాన్ పసుపు రంగులో ఉంటే, తక్కువ పవర్ మోడ్ ఆన్‌లో ఉందని అర్థం. iPad బ్యాటరీ శాతాన్ని చూపడం చూడండి. | |||||||||||
బ్యాటరీ ఛార్జింగ్. iPad బ్యాటరీ ఛార్జ్ అవుతోంది. ఐకాన్ బూడిద రంగులో ఉన్నప్పుడు, ఛార్జింగ్ పాజ్ చేయబడుతుంది. బ్యాటరీని ఛార్జ్ చేయడం ఆర్టికల్ చూడండి. | |||||||||||
Bluetooth బ్యాటరీ. మద్దతు గల పెయిర్ చేసిన Bluetooth డివైజ్ బ్యాటరీ స్థాయిని చూపుతుంది. Bluetooth యాక్సెసరీలకు కనెక్ట్ చేయడం ఆర్టికల్ చూడండి. | |||||||||||
AirPlay. AirPlay ఆన్‌లో ఉంది. వీడియోలు, ఫోటోలను స్ట్రీమ్ చేయడం ఆర్టికల్ చూడండి. | |||||||||||
వాయిస్ కంట్రోల్. సెట్టింగ్స్ > సౌలభ్య సాధనాలలో వాయిస్ కంట్రోల్ ఆన్ చేయబడింది, మీరు iPadతో ఇంటరాక్ట్ చేయడానికి మీ వాయిస్‌ను ఉపయోగించవచ్చు. | |||||||||||
RTT. RTT ఆన్ చేయబడింది. RTTని సెటప్ చేసి, చూడటం అనే ఆర్టికల్‌ను చూడండి. | |||||||||||



































