యాప్ Exposé

యాప్ Exposé అనేది నిర్దిష్ట యాప్‌కి సంబంధించిన మీ అన్ని తెరిచి ఉన్న విండోల డిస్‌ప్లే.

యాప్ Exposéను తెరవడానికి, కింది వాటిలో ఏదైనా చేయండి:

  • Exposéను తెరిచి, విండోలలో ఒకదానిలో యాప్ చిహ్నంపై ట్యాప్ చేయండి.

  • హోమ్ స్క్రీన్, Dock లేదా యాప్ లైబ్రరీలో యాప్ చిహ్నాన్ని నొక్కి ఉంచి, ఆపై “అన్ని విండోలను చూపండి” ట్యాప్ చేయండి.

  • తెరిచిన యాప్‌లో, మెన్యూ బార్‌ను తెరిచి, విండో మెన్యూను ట్యాప్ చేసి, ఆపై ‘అన్ని విండోలను చూపండి’ని ఎంచుకోండి.

మరిన్ని యాప్‌లను చూడటానికి, కుడివైపు స్వైప్ చేయండి. యాప్ Exposéను మూసివేయడానికి, స్క్రీన్‌ను ట్యాప్ చేయండి లేదా హోమ్ బటన్‌ను నొక్కండి (హోమ్ బటన్‌తో కూడిన iPadలో).