iPadను ఆన్ లేదా ఆఫ్ చేయడం
iPadను ఆన్ చేయడానికి టాప్ బటన్‌ను ఉపయోగించండి. మీరు iPadను ఆఫ్ చేయడానికి టాప్ బటన్‌ను (కొన్ని మోడల్‌లలో వాల్యూమ్ బటన్‌తో కలిపి) లేదా సెట్టింగ్స్
ను ఉపయోగించవచ్చు.
మీ iPad ఆశించిన విధంగా పనిచేయకపోతే, మీరు దాన్ని ఆఫ్ చేసి, ఆపై దాన్ని తిరిగి ఆన్ చేయడం ద్వారా రీస్టార్ట్ చేయడానికి ప్రయత్నించవచ్చు. ఆఫ్ చేసినప్పటికీ సమస్య అలాగే కొనసాగితే, బలవంతంగా రీస్టార్ట్ చేయడానికి ప్రయత్నించండి.
iPadను ఆన్ లేదా ఆఫ్ చేయండి (టాప్ బటన్‌లో Face ID లేదా Touch ID ఉన్న మోడల్‌లు)
మీ iPadకు హోమ్ బటన్ లేకపోతే, దిగువ పేర్కొన్న వాటిలో ఏదైనా చేయండి:
iPadను ఆన్ చేయడం: Apple లోగో కనిపించే వరకు టాప్ బటన్‌ను నొక్కి పట్టుకోండి.
iPadను ఆఫ్ చేయడం: అదే సమయంలో టాప్ బటన్, వాల్యూమ్ బటన్‌ను నొక్కి ఉంచి, ఆపై స్లైడర్‌ను డ్రాగ్ చేయండి.

iPadను ఆన్ లేదా ఆఫ్ చేయండి (హోమ్ బటన్ గల మోడల్‌లు)
iPadను ఆన్ చేయడం: Apple లోగో కనిపించే వరకు టాప్ బటన్‌ను నొక్కి పట్టుకోండి.
iPadను ఆఫ్ చేయడం: టాప్ బటన్‌ను నొక్కి పట్టుకుని, ఆపై స్లైడర్‌ను డ్రాగ్ చేయండి.

ఏదైనా మోడల్‌ను ఆఫ్ చేయడానికి, మీరు సెట్టింగ్స్
>సాధారణం >షట్‌డౌన్‌కు వెళ్లి, ఆపై స్లైడర్‌ను డ్రాగ్ చేయవచ్చు.