మీ Mac కోసం రెండవ డిస్‌ప్లేగా మీ iPadను ఉపయోగించడం
మీరు Sidecar ఫీచర్‌తో మీ iPadను రెండవ డిస్‌ప్లేగా ఉపయోగించడం ద్వారా మీ Mac వర్క్‌స్పేస్‌ను విస్తరించవచ్చు. విస్తరించిన వర్క్‌స్పేస్ మీకు వేర్వేరు స్క్రీన్‌లలో వేర్వేరు యాప్‌లను ఉపయోగించడానికి లేదా రెండు స్క్రీన్‌లలో ఒకే యాప్‌ను ఉపయోగించడానికి అనుమతిస్తుంది, కానీ దీనిలోని విభిన్న అంశాలను కంట్రోల్ చేస్తుంది. ఉదాహరణకు, మీరు రెండు స్క్రీన్‌లలో ఒకే యాప్‌ను ఉపయోగించినప్పుడు, అలాగే మీరు iPadలో Apple Pencil, యాప్ టూల్స్, ప్యాలెట్‌లను ఉపయోగించేటప్పుడు, మీ ఆర్ట్‌వర్క్‌ను Macలో చూడవచ్చు.
మీరు మీ Mac, iPadతో Sidecarను ఉపయోగించవచ్చు.

మీరు ప్రారంభించే ముందు
వీటిని నిర్ధారించుకోండి:
రెండు డివైజ్‌లలోనూ Wi-Fi, Bluetooth®, అలాగే Handoff ఆన్ చేయబడ్డాయి.
మీరు రెండు డివైజ్‌లలోనూ ఒకే Apple ఖాతాకు సైన్ ఇన్ చేసారు.
రెండు డివైజ్‌లు Sidecar కోసం కనీస సిస్టమ్ అవసరాలుకు అనుగుణంగా ఉండాలి.
మీరు VPNను ఉపయోగిస్తున్నట్లయితే, దీని కాన్ఫిగరేషన్ స్థానిక నెట్‌వర్క్‌ను నిరోధించదని నిర్ధారించుకోండి, ఎందుకంటే అది కొన్ని కంటిన్యూయిటీ ఫీచర్‌లకు అంతరాయం కలిగించవచ్చు.
Sidecar సెటప్ చేయడం
మీ Macలో, Apple మెన్యూ
> సిస్టమ్ సెట్టింగ్స్ ఎంచుకోండి, ఆపై సైడ్‌బార్‌లో డిస్ప్లేలుపై క్లిక్ చేయండి. (మీరు కిందికి స్క్రోల్ చేయాల్సి ఉంటుంది.)
నోట్: మీ Macలో macOS 12.5 లేదా మునుపటి వెర్షన్ ఉంటే, Apple మెన్యూ
> సిస్టమ్ ప్రాధాన్యతలు ఎంచుకోండి, ఆపై 'డిస్‌ప్లేలు'ను క్లిక్ చేయండి.మీరు మీ Mac ఇంకా iPadను USB కేబల్‌ను ఉపయోగించి కూడా కనెక్ట్ చేయవచ్చు. మీరు మీ iPadతో వచ్చిన USB కేబల్‌ను లేదా మీ Mac, iPad పోర్ట్‌లకు సరిపోయే వేరే కేబల్‌ను ఉపయోగించవచ్చు.
కుడివైపున
క్లిక్ చేసి, ఆపై మీ iPadను ఎంచుకోండి.
Sidecar ఎంపికలను మార్చడానికి (ఉదాహరణకు, మీ Mac డిస్‌ప్లేను విస్తరించడానికి లేదా మిర్రర్ చేయడానికి), డిస్‌ప్లేలలో మీ iPadను ఎంచుకొని, ఆపై అందుబాటులో ఉన్న ఎంపికల నుండి ఎంచుకోండి.
మీరు మీ Mac, iPad డిస్‌ప్లేల అమరికను అడ్జస్ట్ కూడా చేయవచ్చు. ‘అమర్చండి’ క్లిక్ చేసి, ఆపై మీ డిస్‌ప్లేలను కొత్త స్థానానికి డ్రాగ్ చేయండి.
చిట్కా: మీరు SideCarను సెటప్ చేయడానికి కంట్రోల్ సెంటర్‌ను కూడా ఉపయోగించవచ్చు. మెన్యూ బార్‌లో స్క్రీన్ మిర్రరింగ్‌ను క్లిక్ చేసి, స్క్రీన్ మిర్రరింగ్ క్లిక్ చేయండి, ఆపై మీ iPadను ఎంచుకోండి. మీరు ఇక్కడ కొన్ని డిస్‌ప్లే సెట్టింగ్‌లను అడ్జస్ట్ చేయవచ్చు లేదా మరిన్ని ఎంపికల కోసం డిస్‌ప్లే సెట్టింగ్‌లను క్లిక్ చేయవచ్చు.
మీ Mac లేదా iPadతో Sidecarను ఉపయోగించడం
దిగువ పేర్కొన్న వాటిలో ఏదైనా చేయండి:
Mac, iPad మధ్య విండోలను తరలించడానికి: మరో డివైజ్‌లో పాయింటర్ కనిపించే వరకు విండోను స్క్రీన్ అంచు వరకు డ్రాగ్ చేయండి. లేదా యాప్‌ను ఉపయోగిస్తున్నప్పుడు, విండో > “దీనికి తరలించండి” ఎంచుకోండి.
iPadలో సైడ్‌బార్‌ను ఉపయోగించడానికి: మీ వేలితో లేదా Apple Pencilతో, మెన్యూ బార్‌ను చూపించడానికి లేదా దాచడానికి సైడ్‌బార్‌లోని ఐకాన్‌లను ట్యాప్ చేయండి,
చూపండి లేదా Dock
ను దాచండి లేదా ఆన్‌స్క్రీన్ కీబోర్డ్
చూపండి. లేదా కీబోర్డ్ షార్ట్‌కట్‌లను ఉపయోగించడానికి, కంట్రోల్
వంటి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మాడిఫైయర్ కీలను ట్యాప్ చేయండి.
iPadలో Touch Barను ఉపయోగించడానికి: మీ వేలితో లేదా Apple Pencilతో, Touch Barలో ఏదైనా బటన్‌ను ట్యాప్ చేయండి. యాప్ లేదా టాస్క్ ఆధారంగా అందుబాటులో ఉన్న బటన్‌లు మారుతూ ఉంటాయి.
iPadలో Apple Pencilను ఉపయోగించడానికి: మీ Apple Pencilతో మెన్యూ కమాండ్‌లు, చెక్‌బాక్స్‌లు లేదా ఫైల్స్ వంటి ఐటెమ్‌లను ఎంచుకోవడానికి ట్యాప్ చేయండి. మీ Apple Pencil దీనికి మద్దతు ఇచ్చినట్లయితే (అలాగే మీరు ‘డిస్‌ప్లేలు’ సెట్టింగ్‌లలో ఎంపికను ఎంచుకున్నట్లయితే), మీరు కొన్ని యాప్‌లలో డ్రాయింగ్ టూల్స్ మార్చడానికి, మీ Apple Pencil దిగువ విభాగాన్ని డబల్ ట్యాప్ చేయవచ్చు. మీ iPadతో Apple Pencilను పెయిర్ చేయడం అనే Apple మద్దతు ఆర్టికల్‌ను చూడండి.
iPadలో జెశ్చర్‌లను ఉపయోగించడానికి: ట్యాప్ చేయడం, స్వైప్ చేయడం, స్క్రోల్ చేయడం, జూమ్ చేయడం వంటి ప్రాథమిక జెశ్చర్‌లను, అలాగే టెక్స్ట్ నమోదు చేయడం, ఎడిట్ చేయడం వంటి జెశ్చర్‌లను ఉపయోగించండి. iPadతో ఇంటరాక్ట్ చేయడానికి ప్రాథమిక జెశ్చర్‌లను నేర్చుకోవడంచూడండి.
iPadలో Mac డెస్క్‌టాప్, అలాగే iPad హోమ్ స్క్రీన్ మధ్య మారడానికి: హోమ్ స్క్రీన్‌ను చూపించడానికి, మీ iPad దిగువ అంచు నుండి ఎగువకు స్వైప్ చేయండి. Mac డెస్క్‌టాప్‌కు తిరిగి వెళ్లడానికి, ఎగువకు స్వైప్ చేసి, ఆపై
ట్యాప్ చేయండి.
Sidecar ఆఫ్ చేయడం
మీరు మీ Mac కోసం మీ iPadను రెండవ డిస్‌ప్లేగా ఉపయోగించడం ఆపడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, దిగువ వాటిలో ఏదైనా చేయడానికి:
Macలో: మెన్యూ బార్‌లో
క్లిక్ చేసి, స్క్రీన్ మిర్రరింగ్‌ను క్లిక్ చేసి, ఆపై “దీనికి మిర్రర్ చేయండి లేదా పొడిగించండి”కి దిగువ ఉన్న జాబితా నుండి మీ iPad ఎంపికను తీసివేయండి.
iPadలో: సైడ్‌బార్‌కు దిగువన
ట్యాప్ చేయండి.
Sidecar పనిచేయకపోతే
మీరు రెండు డివైజ్‌లలోనూ ఒకే Apple ఖాతాతో సైన్ ఇన్ చేసినట్లు నిర్ధారించుకోండి.
రెండు డివైజ్‌లలో Wi-Fi, Bluetooth, అలాగే Handoff ఆన్‌లో ఉన్నట్లు, అలాగే ఒకే Wi-Fi నెట్‌వర్క్‌లు ఉన్నట్లు నిర్ధారించుకోండి.
మరిన్ని ట్రబల్‌షూటింగ్ చిట్కాల కోసం, Macకి iPadను రెండవ డిస్‌ప్లేగా ఉపయోగించడం అనే ఆర్టికల్‌లో Sidecar సిస్టమ్ అవసరాలను చూడండి.