Apple Creator Studio గురించి

Apple Creator Studioకు ఎలా సబ్‌స్క్రైబ్ అవ్వాలో, అందులో ఏ యాప్‌లు ఉంటాయో, సిస్టమ్ అవసరాలు, ఇంకా మరిన్ని విషయాల గురించి తెలుసుకోండి.

Apple Creator Studio అనేది Apple కంపెనీ రూపొందించిన క్రియేటివిటీ, ప్రొడక్టివిటీ యాప్‌ల కలెక్షన్. ఇందులో Final Cut Pro, Logic Pro, Pixelmator Pro, Motion, Compressor, MainStage వంటివి ఉంటాయి. సబ్‌స్క్రిప్షన్ ద్వారా Pages, Numbers, Keynote, Freeform యాప్‌లలోని ప్రీమియం కంటెంట్‌కు యాక్సెస్ కూడా దక్కుతుంది.*

Apple Creator Studio ఫీచర్‌ల ఓవర్‌వ్యూను పొందండి

Apple Creator Studioను డౌన్‌లోడ్ చేయండి

ఇందులో ఇవి ఉంటాయి:

  • Mac 12.0 కోసం Final Cut Pro

  • iPad 3.0 కోసం Final Cut Pro

  • Mac 12.0 కోసం Logic Pro

  • iPad 3.0 కోసం Logic Pro

  • Mac 4.0 కోసం Pixelmator Pro

  • iPad 4.0 కోసం Pixelmator Pro

  • Motion 6.0 (Mac)

  • Compressor 5.0 (Mac)

  • MainStage 4.0 (Mac)

  • Pages 15.1 (Mac, iPad, iPhone)

  • Numbers 15.1 (Mac, iPad, iPhone)

  • Keynote 15.1 (Mac, iPad, iPhone)

Apple Creator Studioకు సబ్‌స్క్రైబ్ చేసుకోండి

మీరు మొదటిసారిగా Apple Creator Studio యాప్‌ను తెరిచినప్పుడు, మీరు ఒక నెల ఉచిత ట్రయల్ కోసం సైన్ అప్ చేసి, నెలవారీ లేదా వార్షిక సబ్‌స్క్రిప్షన్‌ను ఎంచుకోవచ్చు.

  1. Apple Creator Studio యాప్‌లలో ఒక దాన్ని తెరిచి, కొనసాగించండి అనే ఆప్షన్‌ను క్లిక్ లేదా ట్యాప్ చేయండి, ఆపై స్క్రీన్‌పై సూచనలు ఏవైనా ఉంటే, వాటిని ఫాలో అవ్వండి. Pages, Numbers, లేదా Keynote విషయంలో, మీరు ప్రీమియం కంటెంట్ లేదా ఫీచర్‌లను ఉపయోగించేటప్పుడు యాప్‌లోనే సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు.

  2. ‘ఉచిత ట్రయల్‌ను అంగీకరించండి’ అనే ఆప్షన్‌ను (లేదా అందుబాటులో ఏ ఆప్షన్ ఉంటే ఆ ఆప్షన్‌ను) క్లిక్ లేదా ట్యాప్ చేయండి, ఆ తర్వాత స్క్రీన్‌పై కనిపించే సూచనలను ఫాలో అయి, మీ Apple ఖాతా ద్వారా సబ్‌స్క్రైబ్ చేసుకోండి.

  3. ప్రారంభించడానికి, Apple Creator Studio యాప్‌లో కొత్త ప్రాజెక్ట్ లేదా డాక్యుమెంట్‌ను క్రియేట్ చేయండి లేదా ఇప్పటికే ఉన్న ప్రాజెక్ట్ లేదా డాక్యుమెంట్‌ను తెరవండి.

మీరు Final Cut Pro iPad లేదా iPadకు సంబంధించిన Logic Proకు ఇప్పటికే సబ్‌స్క్రైబ్ చేసుకున్నట్లయితే, మరొక Apple Creator Studio యాప్‌ను డౌన్‌లోడ్ చేసి తెరవండి, తర్వాత యాప్‌ నుండే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.

యాప్‌లను విడివిడిగా కొనుగోలు చేయండి

Final Cut Pro, Motion, Compressor, Logic Pro, MainStage, మరియు Pixelmator Pro — వీటన్నింటినీ App Storeకు వెళ్లి, Mac కోసం ఒకేసారి కొనుగోలు చేసి కూడా పొందవచ్చు. మీరు ఇంతకు ముందు ఈ యాప్‌లలో ఒక దాన్ని కొనుగోలు చేసి ఉంటే, అదే సమయంలో మీకు Apple Creator Studio సబ్‌స్క్రిప్షన్ కూడా ఉన్నట్లయితే, మీరు ఆ యాప్‌ల యొక్క రెండు వెర్షన్‌లలో దేనినైనా ఉపయోగించవచ్చు. ఈ యాప్‌లకు సంబంధించిన రెండు వెర్షన్‌లనూ మీరు మీ Macలో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఏ వెర్షన్‌ దేనిదో సులభంగా గుర్తించడానికి, Apple Creator Studioలోని యాప్‌లకు ప్రత్యేకమైన చిహ్నాలు ఉంటాయి.

Apple Creator Studioను మీ ఫ్యామిలీతో షేర్ చేయండి

మీరు ఫ్యామిలీ షేరింగ్‌లో ఎన్‌రోల్ అయినప్పుడు, మీతో పాటు గరిష్ఠంగా మీ ఫ్యామిలీలోని మరో ఐదుగురు మెంబర్లు Apple Creator Studio సబ్‌స్క్రిప్షన్‌కి యాక్సెస్‌ను షేర్ చేసుకోవచ్చు. Apple Creator Studio నెలవారీ లేదా వార్షిక సబ్‌స్క్రిప్షన్‌ను షేర్ చేయడానికి, ఆ సబ్‌స్క్రిప్షన్, ఫ్యామిలీ షేరింగ్ > సబ్‌స్క్రిప్షన్ షేరింగ్ కింద కనిపిస్తోందని, అంతేకాకుండా అది యాక్టివ్‌గా ఉందని నిర్ధారించుకోండి.

మీరు ఒకసారి కొనుగోలు చేసి పొందిన యాప్‌ను కూడా షేర్ చేసుకోవచ్చు.

మీ ఫ్యామిలీతో యాప్‌లను, కొనుగోళ్లను షేర్ చేసుకోవడం గురించి మరింత తెలుసుకోండి

ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు, అధ్యాపకుల సబ్‌స్క్రిప్షన్‌లకు ఫ్యామిలీ షేరింగ్ అందుబాటులో ఉండదు.

Apple Creator Studio సిస్టమ్ అవసరాలు

పూర్తి Apple Creator Studio ఫంక్షనాలిటీ macOS 26, iPadOS 26, iOS 26లలో అందుబాటులో ఉంటుంది. Apple Creator Studio App Storeలో అందుబాటులో ఉంది, దానికి Apple ఖాతా అవసరం అవుతుంది. ఫీచర్‌లు మారుతూ ఉండవచ్చు, కొన్నింటికి ఇంటర్నెట్ యాక్సెస్ అవసరం కావచ్చు. అదనపు ఫీజులు, నియమాలు వర్తించవచ్చు.

ప్రతి Apple Creator Studio యాప్‌కు ఉండాల్సిన కనీస సిస్టమ్ అవసరాలను ఈ కింద అందించాము:

  • Pixelmator Proకు మినహా, Mac యాప్‌లన్నింటికీ macOS 15.6 లేదా ఆ తర్వాత రిలీజ్ అయిన ఏదైనా వెర్షన్ కావాలి, అయితే Pixelmator Proకు మాత్రం macOS 26 లేదా ఆ తర్వాత రిలీజ్ అయిన ఏదైనా వెర్షన్ కావాలి.

  • Final Cut Pro:

    • Macలో Final Cut Proను ఉపయోగించేందుకు macOS 15.6 లేదా ఆ తర్వాత రిలీజ్ అయిన ఏదైనా వెర్షన్ కావాలి.

    • Final Cut Pro కోసం iPadకు iPadOS 18.6 లేదా ఆ తర్వాత రిలీజ్ అయిన ఏదైనా వెర్షన్ కావాలి. అలాగే, Apple M1 లేదా ఆ తర్వాత రిలీజ్ అయిన ఏదైనా చిప్ ఉన్న iPad, iPad Pro, లేదా iPad Air, లేదా iPad (A16), లేదా iPad mini (A17 Pro) కావాలి.

  • Logic Pro:

    • Macలో Logic Proను ఉపయోగించాలంటే, macOS 15.6 లేదా ఆ తర్వాత రిలీజ్ అయిన ఏదైనా వెర్షన్ కావాలి, అలాగే Apple silicon చిప్ ఉన్న Mac కావాలి.

    • iPadలో Logic Proను ఉపయోగించాలంటే, iPadOS 26 లేదా ఆ తర్వాత రిలీజ్ అయిన ఏదైనా వెర్షన్ కావాలి, అంతేకాకుండా Apple A12 లేదా, ఆ తర్వాత రిలీజ్ అయిన Bionic చిప్ ఉన్న iPad కావాలి. కొన్ని ఫీచర్‌లకు Apple A17 Pro లేదా ఆ తర్వాత రిలీజ్ అయిన చిప్ కావాలి.

  • Pixelmator Pro:

    • Macలో Pixelmator Proను ఉపయోగించాలంటే, macOS 26 లేదా ఆ తర్వాత రిలీజ్ అయిన ఏదైనా వెర్షన్ కావాలి.

    • Pixelmator Pro కోసం iPadకు iPadOS 26 లేదా ఆ తర్వాత రిలీజ్ అయిన ఏదైనా వెర్షన్ కావాలి. అలాగే, Apple M1 లేదా ఆ తర్వాత రిలీజ్ అయిన ఏదైనా చిప్ ఉన్న iPad, iPad Pro, లేదా iPad Air, లేదా iPad (A16), లేదా iPad mini (A17 Pro) కావాలి.

  • Pages, Numbers, Keynote:

    • Macలో Pages, Numbers, Keynoteను ఉపయోగించాలంటే, macOS 15.6 లేదా ఆ తర్వాత రిలీజ్ అయిన ఏదైనా వెర్షన్ కావాలి.

    • iPad, iPhone, Apple Vision Proలలో Pages, Numbers, Keynoteలను ఉపయోగించాలంటే iPadOS 18 లేదా అంతకంటే తాజా వెర్షన్, iOS 18 లేదా అంతకంటే తాజా వెర్షన్, visionOS 2 లేదా అంతకంటే తాజా వెర్షన్ కావాలి.

    • కొన్ని ప్రీమియం ఫీచర్‌లను ఉపయోగించాలంటే macOS 26, iPadOS 26, iOS 26 లేదా visionOS 26 లేదా అంతకంటే తాజా వెర్షన్ కావాలి.

  • Motionకు macOS 15.6 లేదా ఆ తర్వాత రిలీజ్ అయిన ఏదైనా వెర్షన్ కావాలి.

  • Compressorకు macOS 15.6 లేదా ఆ తర్వాత రిలీజ్ అయిన ఏదైనా వెర్షన్ కావాలి. కొన్ని ఫీచర్‌లకు Apple silicon ఉన్న Mac అవసరం అవుతుంది.

  • MainStageకు macOS 15.6 లేదా ఆ తర్వాత రిలీజ్ అయిన ఏదైనా వెర్షన్ కావాలి, అంతేకాకుండా Apple silicon ఉన్న Mac అవసరం అవుతుంది.

మరింత తెలుసుకోండి

Apple Creator Studio గురించి మరింత తెలుసుకోండి

* Freeformలోని ప్రీమియం కంటెంట్, ఫీచర్‌లు ఈ సంవత్సరం చివర్లో Apple Creator Studio సబ్‌స్క్రిప్షన్‌లో భాగంగా లభించే అవకాశముంది.

ప్రచురించబడిన తేదీ: