మీరు మీ Apple ఖాతా పాస్‌వర్డ్‌ని రీసెట్ చేయలేనప్పుడు ఖాతా రికవరీని ఎలా ఉపయోగించాలి

మీరు రెండు-కారకాల ప్రామాణీకరణను ఉపయోగించి సైన్ ఇన్ చేయలేకపోతే లేదా మీ పాస్‌వర్డ్‌ను రీసెట్ చేయలేకపోతే, ఖాతా రికవరీ వెయిటింగ్ పీరియడ్ తర్వాత మీరు యాక్సెస్‌ను తిరిగి పొందవచ్చు.

ఖాతా రికవరీ అంటే ఏమిటి?

ఖాతా రికవరీ ప్రాసెస్ సహాయంతో మీరు మీ పాస్‌వర్డ్‌ను రీసెట్ చేసుకోవచ్చు, ఇంకా మీ ఖాతాకు తిరిగి యాక్సెస్‌ను పొందవచ్చు. మీకు మీ Apple ఖాతా పాస్‌వర్డ్ గుర్తులేకపోతే, ఖాతా రికవరీ ప్రాసెస్‌ను ప్రారంభించడానికి ముందు మిగతా అన్ని పద్ధతులను ట్రై చేశారని నిర్ధారించుకోండి – ఉదాహరణకు, మీ పాస్‌వర్డ్‌ను మార్చడానికి ఇప్పటికే సైన్ ఇన్ చేసిన వేరే పరికరాన్ని ఉపయోగించడం.

భద్రతా కారణాల దృష్ట్యా, మీరు ఖాతా రికవరీ ప్రాసెస్‌ను ప్రారంభించిన తర్వాత మీ ఖాతాను మళ్లీ ఉపయోగించడానికి చాలా రోజులు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టవచ్చు. Apple సపోర్ట్‌ను సంప్రదించడం వల్ల ఈ సమయం తగ్గదు. ఈ ఆలస్యం వల్ల మీకు ఇబ్బంది కలగవచ్చు, కానీ మీ ఖాతాను, ఇంకా సమాచారాన్ని Apple సురక్షితంగా ఉంచడానికి ఇది అవసరం.

ఖాతా రికవరీని ప్రారంభించడానికి ముందు

ఖాతా రికవరీని ప్రారంభించడానికి ముందు మీ ఖాతాను యాక్సెస్ చేయడానికి గల ఇతర పద్ధతులను ట్రై చేయండి.

ఖాతా రీసెట్‌ను ప్రారంభించండి

మీరు యాక్సెస్ చేయడానికి గల మిగతా అన్ని మార్గాలను ట్రై చేసి ఉంటే, ఖాతా రికవరీ ప్రాసెస్‌ను ప్రారంభించండి.

మీ Apple పరికరంలో

ఖాతా రీసెట్‌ను ప్రారంభించడానికి వేగవంతమైన మరియు సులభమైన మార్గం మీ పరికరంలో ఉంది. మీరు ఖాతా రికవరీని ప్రారంభించిన తర్వాత, మీ ఇతర Apple పరికరాలను ఉపయోగించవద్దు ఎందుకంటే అవి రికవరీ ప్రాసెస్‌కు అంతరాయం కలిగించవచ్చు లేదా ఆలస్యం చేయవచ్చు.

  1. iPhone లేదా iPadలోని సెట్టింగ్‌లలో, లేదా Macలోని సిస్టమ్ సెట్టింగ్‌లలో, మీ పరికరంలో సైన్ ఇన్ చేయడానికి ట్రై చేయండి.

  2. మీకు మీ పాస్‌వర్డ్ తెలియకపోతే, ఖాతా రికవరీని ప్రారంభించడానికి మీకొక ఆప్షన్ కనిపిస్తుంది.

  3. ఖాతా రికవరీ పూర్తయ్యే వరకు మీ Apple ఖాతాతో ప్రస్తుతం సైన్ ఇన్ అయిన అన్ని ఇతర పరికరాలను ఆఫ్ చేయండి. మీరు రిక్వెస్ట్ చేస్తున్న సమయంలో మీ Apple ఖాతా ఉపయోగంలో ఉంటే, మీ ఖాతా రికవరీ ఆటోమేటిక్‌గా రద్దు చేయబడుతుంది.

    • మీరు సెట్టింగ్‌లు, సిస్టమ్ సెట్టింగ్‌లు లేదా Apple సపోర్ట్ యాప్‌లో మీ ఖాతా పునరుద్ధరణను ప్రారంభించినట్లయితే, మీరు ఖాతా పునరుద్ధరణ వ్యవధిలో నిర్దిష్ట పరికరాన్ని ఉపయోగించడం కొనసాగించవచ్చు.

వెబ్‌లో

ఖాతా రికవరీని వెబ్‌లో కూడా ప్రారంభించవచ్చు. మీరు ఖాతా రికవరీని ప్రారంభించిన తర్వాత మీ Apple పరికరాలను ఉపయోగించవద్దు.

  1. మీ పరికరంలోని బ్రౌజర్‌ను ఉపయోగించి iforgot.apple.com లింక్‌కు వెళ్ళండి.

  2. 'పాస్‌వర్డ్‌ను రీసెట్ చేయండి' పై క్లిక్ చేసి, ఆపై ఖాతా రికవరీని ప్రారంభించడానికి స్క్రీన్‌పై కనిపించే దశలను ఫాలో అవ్వండి.

  3. మీ Apple ఖాతాతో ప్రస్తుతం లాగిన్ అయి ఉన్న అన్ని పరికరాలను ఖాతా రికవరీ పూర్తయ్యే వరకు ఆఫ్ చేసి ఉంచండి. వీలైతే, వెబ్‌లో ఖాతా రికవరీని ప్రారంభించడానికి మీరు ఉపయోగించిన పరికరాన్ని కూడా ఆఫ్ చేయండి. మీరు అభ్యర్థన చేస్తున్న సమయంలో మీ Apple ఖాతా ఉపయోగంలో ఉంటే, మీ ఖాతా పునరుద్ధరణ ఆటోమేటిక్‌గా రద్దు చేయబడుతుంది.

మీరు ఖాతా పునరుద్ధరణను ప్రారంభించిన తర్వాత

ఈమెయిల్ మీకు అందుతుందిఈమెయిల్ మీకు అందుతుంది1

మీరు మీ పాస్‌వర్డ్‌ను రీసెట్ చేయడానికి చాలా రోజులు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టవచ్చు. Apple సపోర్ట్‌ను సంప్రదించడం వల్ల ఈ సమయం తగ్గదు.

1 మీకు ఫోన్ నంబర్ ఆధారిత Apple ఖాతా ఉండి, అది ఈమెయిల్‌తో అనుబంధించబడకపోతే, ఆ మెసేజ్ మీకు iMessageగా Messages యాప్‌లో వస్తుంది.

వెయిటింగ్ పీరియడ్ ముగిసినప్పుడు

  • మీ ఖాతాకు యాక్సెస్‌ను తిరిగి పొందేందుకు అవసరమైన సూచనలతో, Apple మీకు టెక్స్ట్ మెసేజ్ పంపుతుంది లేదా ఆటోమేటెడ్ ఫోన్ కాల్ చేస్తుంది.

  • ఒరిజినల్ ఈమెయిల్‌లో పేర్కొన్న వ్యవధి ముగిసిన తర్వాత కూడా మీకు టెక్స్ట్ మెసేజ్ లేదా కాల్ అందకపోతే, మీరు నేరుగా iforgot.apple.com లింక్‌కు వెళ్లవచ్చు. మీ Apple ఖాతాకు యాక్సెస్‌ను తిరిగి పొందడానికి సూచనలను అనుసరించండి.

వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించవచ్చా?

వీలు కాదు. Apple సపోర్ట్‌ను సంప్రదించడం వల్ల ఈ సమయం తగ్గదు.

మీ ఖాతా రికవరీ రిక్వెస్ట్ ఎప్పుడు పూర్తవుతుందో చెక్ చేయండి

మీరు యాక్సెస్‌ను తిరిగి పొందగలిగే తేదీ, సమయం ఉన్న ఈమెయిల్‌ను చెక్ చేయండి. ఈ ఇమెయిల్ 72 గంటల్లోపు వస్తుంది.

మీ ఖాతా రికవరీ ప్రాసెస్ పూర్తి కావడానికి ఇంకా ఎంత సమయం పడుతుందో, లేదా ప్రాసెస్‌కు సంబంధించిన మరింత సమాచారం ఎప్పటికల్లా అందుబాటులో ఉంటుందో కూడా మీరు చెక్ చేయవచ్చు. iforgot.apple.com లింక్‌కు వెళ్లండి, ఆపై రిక్వెస్ట్‌ను ప్రారంభించడానికి మీరు ఉపయోగించిన అదే Apple ఖాతా ఈమెయిల్ అడ్రస్ లేదా ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేయండి.

మీరు ఖాతా రికవరీని రద్దు చేయాలనుకుంటే

  • మీరు మీ సమాచారాన్ని గుర్తుంచుకుని విజయవంతంగా సైన్ ఇన్ చేయగలిగితే, మీ వేచి ఉండే సమయం స్వయంచాలకంగా రద్దు అవుతుంది మరియు మీరు వెంటనే మీ Apple ఖాతాను ఉపయోగించవచ్చు.

  • మీరు చేయని రికవరీ రిక్వెస్ట్‌ను రద్దు చేయడానికి, మీ నిర్ధారణ ఈమెయిల్‌లోని సూచనలను ఫాలో అవ్వండి.

ప్రచురించబడిన తేదీ: