మీ Apple ఖాతాకి చెల్లింపు పద్ధతిని జోడించండి
App Store, iCloud+, Apple Music మొదలైన వాటి కోసం మీరు మరియు మీ కుటుంబసభ్యులు ఉపయోగించే చెల్లింపు పద్ధతిని జోడించండి. మీరు చెల్లింపు పద్ధతిని జోడించలేకుంటే, ఏమి చేయాలో తెలుసుకోండి.
చెల్లింపు పద్ధతిని జోడించండి
చెల్లింపు పద్ధతిని జోడించండిమీ డివైజ్‌లో చెల్లింపు పద్ధతిని జోడించండి
మీరు మీ Apple ఖాతాకి చెల్లింపు పద్ధతిని జోడించడానికి మీ డివైజ్‌ను ఉపయోగించవచ్చు.
మీ iPhoneలో చెల్లింపు పద్ధతిని జోడించండి
సెట్టింగ్స్ యాప్‌ను తెరవండి.
మీ పేరును నొక్కండి.
చెల్లింపు, షిప్పింగ్ నొక్కండి. మీ Apple ఖాతాకి సైన్ ఇన్ చేయమని మిమ్మల్ని కోరవచ్చు.
చెల్లింపు పద్ధతిని జోడించు ఎంపికను నొక్కండి.
చెల్లింపు పద్ధతి వివరాలను నమోదు చేసి, పూర్తయింది ఎంపికను నొక్కండి.
మీ iPhoneలో చెల్లింపు పద్ధతుల క్రమాన్ని మార్చండి
చెల్లింపు, షిప్పింగ్ స్క్రీన్‌లో, సవరించు ఎంపికను నొక్కండి.
మీ చెల్లింపు పద్ధతుల జాబితాలో పైకి లేదా క్రిందకి లాగడానికి చెల్లింపు పద్ధతిని తాకి, పట్టుకోండి. మీ చెల్లింపు పద్ధతులు కనిపించే క్రమాన్ని అనుసరించి Apple ఛార్జీ విధించడానికి ప్రయత్నిస్తుంది.
పూర్తయింది నొక్కండి.
ఫైల్‌లో మీకు ఇది వరకే చెల్లింపు పద్ధతి ఉన్నట్లయితే,మీ చెల్లింపు పద్ధతిని మార్చడం లేదా అప్‌డేట్ చేయడం ఎలాగో తెలుసుకోండి.
మీ iPadలో చెల్లింపు పద్ధతిని జోడించండి
సెట్టింగ్స్ యాప్‌ను తెరవండి.
మీ పేరును నొక్కండి.
చెల్లింపు, షిప్పింగ్ నొక్కండి. మీ Apple ఖాతాకి సైన్ ఇన్ చేయమని మిమ్మల్ని కోరవచ్చు.
చెల్లింపు పద్ధతిని జోడించు ఎంపికను నొక్కండి.
చెల్లింపు పద్ధతి వివరాలను నమోదు చేసి, పూర్తయింది ఎంపికను నొక్కండి.
మీ iPadలో చెల్లింపు పద్ధతుల క్రమాన్ని మార్చండి
చెల్లింపు, షిప్పింగ్ స్క్రీన్‌లో, సవరించు ఎంపికను నొక్కండి.
మీ చెల్లింపు పద్ధతుల జాబితాలో పైకి లేదా క్రిందకి లాగడానికి చెల్లింపు పద్ధతిని తాకి, పట్టుకోండి. మీ చెల్లింపు పద్ధతులు కనిపించే క్రమాన్ని అనుసరించి Apple ఛార్జీ విధించడానికి ప్రయత్నిస్తుంది.
పూర్తయింది నొక్కండి.
ఫైల్‌లో మీకు ఇది వరకే చెల్లింపు పద్ధతి ఉన్నట్లయితే,మీ చెల్లింపు పద్ధతిని మార్చడం లేదా అప్‌డేట్ చేయడం ఎలాగో తెలుసుకోండి.
మీ Apple Vision Proలో చెల్లింపు పద్ధతిని జోడించండి
సెట్టింగ్స్ యాప్‌ను తెరవండి.
మీ పేరును నొక్కండి.
చెల్లింపు, షిప్పింగ్ నొక్కండి. మీ Apple ఖాతాకి సైన్ ఇన్ చేయమని మిమ్మల్ని కోరవచ్చు.
చెల్లింపు పద్ధతిని జోడించు ఎంపికను నొక్కండి.
చెల్లింపు పద్ధతి వివరాలను నమోదు చేసి, పూర్తయింది ఎంపికను నొక్కండి.
మీ Apple Vision Proలో చెల్లింపు పద్ధతుల క్రమాన్ని మార్చండి
చెల్లింపు, షిప్పింగ్ స్క్రీన్‌లో, సవరించు ఎంపికను నొక్కండి.
మీ చెల్లింపు పద్ధతుల జాబితాలో పైకి లేదా క్రిందకి లాగడానికి చెల్లింపు పద్ధతిని తాకి, పట్టుకోండి. మీ చెల్లింపు పద్ధతులు కనిపించే క్రమాన్ని అనుసరించి Apple ఛార్జీ విధించడానికి ప్రయత్నిస్తుంది.
పూర్తయింది నొక్కండి.
ఫైల్‌లో మీకు ఇది వరకే చెల్లింపు పద్ధతి ఉన్నట్లయితే,మీ చెల్లింపు పద్ధతిని మార్చడం లేదా అప్‌డేట్ చేయడం ఎలాగో తెలుసుకోండి.
మీ Macలో చెల్లింపు పద్ధతిని జోడించండి
App Storeను తెరవండి.
మీ పేరుని క్లిక్ చేయండి. మీ పేరు కనిపించకుంటే, సైన్ ఇన్ బటన్‌ను క్లిక్ చేసి, మీ Apple ఖాతాకి సైన్ ఇన్ చేసి, ఆపై మీ పేరును క్లిక్ చేయండి.
ఖాతా సెట్టింగ్స్‌ను క్లిక్ చేయండి. మీ Apple ఖాతాకి సైన్ ఇన్ చేయమని మిమ్మల్ని కోరవచ్చు.
చెల్లింపు సమాచారం పక్కన, చెల్లింపులను నిర్వహించు ఎంపికను క్లిక్ చేయండి.
చెల్లింపును జోడించు క్లిక్ చేయండి.
చెల్లింపు పద్ధతి వివరాలను నమోదు చేసి, పూర్తయింది క్లిక్ చేయండి.
మీ Macలో చెల్లింపు పద్ధతుల క్రమాన్ని మార్చండి
చెల్లింపు సమాచారం స్క్రీన్‌లో, మీ చెల్లింపు పద్ధతుల జాబితాలో పైకి లేదా క్రిందకి తరలించడానికి ప్రతి చెల్లింపు పద్ధతి పక్కనే ఉన్న బాణాలను ఉపయోగించండి. మీ చెల్లింపు పద్ధతులు కనిపించే క్రమాన్ని అనుసరించి Apple ఛార్జీ విధించడానికి ప్రయత్నిస్తుంది.
ఫైల్‌లో మీకు ఇది వరకే చెల్లింపు పద్ధతి ఉన్నట్లయితే,మీ చెల్లింపు పద్ధతిని మార్చడం లేదా అప్‌డేట్ చేయడం ఎలాగో తెలుసుకోండి.
మీ విండోస్ PCలో చెల్లింపు పద్ధతిని జోడించండి
మీ విండోస్ PCలో, Apple Music యాప్ లేదా Apple TV యాప్‌ను తెరవండి.
సైడ్‌బార్ దిగువన ఉన్న మీ పేరును క్లిక్ చేసి, నా ఖాతాను చూడండి ఎంపికను క్లిక్ చేయండి. మీరు ముందుగా మీ Apple ఖాతాకి సైన్ ఇన్ చేయవలసి ఉంటుంది.
చెల్లింపు సమాచారం పక్కన, చెల్లింపులను నిర్వహించు ఎంపికను క్లిక్ చేయండి.
చెల్లింపును జోడించు ఎంపికను క్లిక్ చేయండి.
చెల్లింపు పద్ధతి వివరాలను నమోదు చేసి, ఆపై పూర్తయింది ఎంపికను క్లిక్ చేయండి.
మీ విండోస్ PCపై చెల్లింపు పద్ధతుల క్రమాన్ని మార్చండి
చెల్లింపు సమాచారం స్క్రీన్‌లో, మీ చెల్లింపు పద్ధతుల జాబితాలో పైకి లేదా క్రిందకి తరలించడానికి ప్రతి చెల్లింపు పద్ధతి పక్కనే ఉన్న బాణాలను ఉపయోగించండి. మీ చెల్లింపు పద్ధతులు కనిపించే క్రమాన్ని అనుసరించి Apple ఛార్జీ విధించడానికి ప్రయత్నిస్తుంది.
ఫైల్‌లో మీకు ఇది వరకే చెల్లింపు పద్ధతి ఉన్నట్లయితే,మీ చెల్లింపు పద్ధతిని మార్చడం లేదా అప్‌డేట్ చేయడం ఎలాగో తెలుసుకోండి.
చెల్లింపు పద్ధతిని ఆన్‌లైన్‌లో జోడించండి
మీరు account.apple.comకిసైన్ ఇన్ చేసిన తర్వాత కూడా చెల్లింపు పద్ధతిని జోడించవచ్చు.
కొన్ని దేశాలు మరియు ప్రాంతాల్లో, మీరు account.apple.comలో చెల్లింపు సమాచారాన్ని ఆన్‌లైన్‌లో ఎడిట్ చేసినప్పుడు, అదనపు చెల్లింపు పద్ధతులు మీ ఖాతా నుండి ఆటోమేటిక్‌గా తీసివేయబడతాయి.
మీరు చెల్లింపు పద్ధతిని జోడించలేకుంటే,
మీరు మీ దేశం లేదా ప్రాంతంలోఏ చెల్లింపు పద్ధతిని మీ Apple ఖాతాతో ఉపయోగించవచ్చో తనిఖీ చేయండి.
మీరు ఆమోదం పొందిన చెల్లింపు పద్ధతిని ఉపయోగిస్తున్నప్పటికీ, మీ Apple ఖాతా వేరే దేశం లేదా ప్రాంతానికి సెట్ చేయబడి ఉన్నట్లయితే, మీ దేశం లేదా ప్రాంతాన్ని మార్చండి.
జోడించు బటన్ బూడిద రంగులో ఉంటే, మీరు కుటుంబ షేరింగ్ సమూహంలో ఉండవచ్చు మరియు మీరు కొనుగోలు భాగస్వామ్యాన్ని ఉపయోగించుకోవచ్చు. కేవలం ఫ్యామిలీ ఆర్గనైజర్ మాత్రమే ఫైల్‌లో చెల్లింపు పద్ధతిని కలిగి ఉన్నారు. మీరు మీ స్వంత చెల్లింపు పద్ధతులను ఉపయోగించాలనుకుంటే, కొనుగోలు షేరింగ్‌ను ఆపివేయాలి, ఆపై మీ స్వంత చెల్లింపు పద్ధతిని జోడించాలి.
మీ పేరు, బిల్లింగ్ చిరునామా మరియు ఇతర సమాచారం అచ్చుతప్పులు లేకుండా ఉన్నాయో లేదో మరియు మీ ఆర్థిక సంస్థ వద్ద ఉన్న ఫైల్‌లో ఉన్న దానితో సరిపోలుతున్నాయో లేదో ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయండి.
కొన్ని చెల్లింపు పద్ధతులను ఆర్థిక సంస్థ యాప్, వచన సందేశం లేదా ఇతర మార్గాల ద్వారా మీరు ధృవీకరించవలసి ఉంటుంది. మీకు ధృవీకరించడం సాధ్యం కాకుంటే, సహాయం కోసం మీ ఆర్థిక సంస్థను సంప్రదించండి.