'మునుపటి కొనుగోలు విషయంలో బిల్లింగ్ సమస్య' లేదా 'వెరిఫికేషన్ అవసరం' అని మెసేజ్ అందుకుంటే
ఈ మెసేజ్‌లు కనిపిస్తే, మీ దగ్గర పేమెంట్ చేయని బ్యాలెన్స్ ఉందని అర్థం. మీ పేమెంట్ పద్ధతిని మార్చండి లేదా గిఫ్ట్ కార్డ్‌ను రిడీమ్ చేసుకోండి, ఇంకా పేమెంట్ చేయని ఆర్డర్‌లు ఏవైనా ఉంటే, వాటి కోసం పేమెంట్ చేయడానికి బ్యాలెన్స్‌ను ఉపయోగించండి.
మీ దగ్గర పేమెంట్ చేయని బ్యాలెన్స్ ఉంటే
'మునుపటి కొనుగోలు విషయంలో బిల్లింగ్ సమస్య' లేదా 'వెరిఫికేషన్ అవసరం' అనే మెసేజ్ మీకు కనిపిస్తే, మీ దగ్గర పేమెంట్ చేయని బ్యాలెన్స్ ఉందని అర్థం, ఎందుకంటే మునపటి కొనుగోలు కోసం మీరు వాడిన పేమెంట్ పద్దతి ద్వారా Apple ఛార్జ్ చేయలేకపోయింది. మీ బ్యాలెన్స్ పేమెంట్ అయ్యే వరకు, మీరు వీటిని చేయలేకపోవచ్చు:
కొత్త కొనుగోళ్లు చేయడం
ఉచిత యాప్‌లను డౌన్‌లోడ్ చేయడం
సబ్‌స్క్రిప్షన్‌లను ఉపయోగించడం
బాకీ ఉన్న బ్యాలెన్స్ పేమెంట్ పూర్తయ్యాక, మీరు కొత్త కొనుగోళ్లు చేయవచ్చు లేదా మళ్ళీ సబ్‌స్క్రిప్షన్‌లను ఉపయోగించవచ్చు.
పేమెంట్ చేయని బ్యాలెన్స్‌ను ఎలా పే చేయాలి
కొత్త, చెల్లుబాటు అయ్యే పేమెంట్ పద్ధతిని ఉపయోగించి లేదా Apple గిఫ్ట్ కార్డ్ లేదా App Store & iTunes గిఫ్ట్ కార్డ్‌ను కొనుగోలు చేసి, రిడీమ్ చేయడం ద్వారా పేమెంట్ చేయని బ్యాలెన్స్‌ను మీరు పే చేయవచ్చు.
మీ పేమెంట్ పద్ధతిని మార్చండి
పాత పేమెంట్ పద్ధతిని తీసివేయండి.
పేమెంట్, కొత్త పేమెంట్ పద్ధతి ద్వారా ఆటోమేటిక్‌గా ఛార్జ్ చేయబడుతుంది.
Apple గిఫ్ట్ కార్డ్ లేదా App Store & iTunes గిఫ్ట్ కార్డ్‌ను ఉపయోగించండి
Apple గిఫ్ట్ కార్డ్ లేదా App Store & iTunes గిఫ్ట్ కార్డ్ కొనండి.*
మీ Apple ఖాతాకు నిధులను జోడించడానికి గిఫ్ట్ కార్డ్‌ను రిడీమ్ చేయండి.
మీ iPhone లేదా iPadలో, సెట్టింగ్‌ల యాప్‌ను తెరిచి, మీ పేరుపై ట్యాప్ చేయండి.
మీడియా & కొనుగోళ్లు ఆప్షన్‌పై ట్యాప్ చేసి, ఆపై ఖాతాను చూడండి ఆప్షన్‌పై ట్యాప్ చేయండి.
కొనుగోలు హిస్టరీ ఆప్షన్‌పై ట్యాప్ చేయండి.
"మీరు బాకీ ఉన్న మొత్తం" అని ఎరుపు రంగు టెక్స్ట్‌తో కనిపించే ఆర్డర్‌పై ట్యాప్ చేయండి.
Apple ఖాతా క్రెడిట్ సహాయంతో పేమెంట్ చేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
మీరు పేమెంట్ చేయని ఆర్డర్‌కు పేమెంట్ చేశాక, మిగిలిన మీ Apple ఖాతా బ్యాలెన్స్‌తో కొనుగోళ్లు చేయవచ్చు.
* గిఫ్ట్ కార్డ్‌లు అన్ని దేశాలు లేదా ప్రాంతాలలో అందుబాటులో లేవు.
మీరు ఫ్యామిలీ షేరింగ్‌ను ఉపయోగిస్తుంటే
మీరు ఫ్యామిలీ షేరింగ్‌ను ఉపయోగిస్తుంటే, ఇంకా కొనుగోలు షేరింగ్ ఆన్‌లో ఉంటే, ఫ్యామిలీ ఆర్గనైజర్ సెట్ చేసిన పేమెంట్ పద్ధతి ద్వారానే ఫ్యామిలీ మెంబర్‌లందరూ చేసిన కొనుగోళ్లకు ఛార్జ్ విధించబడుతుంది.
మీరు ఫ్యామిలీ ఆర్గనైజర్ అయితే
మీరు లేదా మీ ఫ్యామిలీ మెంబర్ కొనుగోళ్లు చేయలేకపోతే, మీ పేమెంట్ పద్ధతిని మార్చండి.
మీరు ఫ్యామిలీ ఆర్గనైజర్ కాకపోతే
మీరు కొనుగోళ్లు చేయలేకపోతే:
ఫ్యామిలీ ఆర్గనైజర్‌ను వారి పేమెంట్ పద్ధతిని మార్చమని అడగండి.
లేదా, గిఫ్ట్ కార్డ్‌ను రిడీమ్ చేసుకోండి, ఆపై పేమెంట్ చేయని మీ ఆర్డర్ కోసం పేమెంట్ చేయండి.
మీకు ఇంకా సహాయం అవసరమైతే
మీరు ఇంకా పేమెంట్ చేయని బ్యాలెన్స్‌కు సంబంధించి సమస్యను పరిష్కరించలేకపోతే, Apple సపోర్ట్‌ను సంప్రదించండి.