మీ iPhone లేదా iPadలో Wi-Fiకి కనెక్ట్ చేయండి
మీ పరికరాన్ని పబ్లిక్, సురక్షిత, ఇంకా గతంలో ఉపయోగించిన నెట్‌వర్క్‌లతో సహా అందుబాటులో ఉన్న Wi-Fi నెట్‌వర్క్‌లకు కనెక్ట్ చేయండి.
Wi-Fi నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయండి
మీ హోమ్ స్క్రీన్ నుండి, సెట్టింగ్‌లు > Wi-Fi ఆప్షన్‌లకు వెళ్లండి.
Wi-Fiని ఆన్ చేయడానికి ట్యాప్ చేయండి. మీ పరికరం అందుబాటులో ఉన్న Wi-Fi నెట్‌వర్క్‌ల కోసం ఆటోమేటిక్‌గా సెర్చ్ చేస్తుంది.
మీరు చేరాలనుకుంటున్న Wi-Fi నెట్‌వర్క్ పేరుపై ట్యాప్ చేయండి. ముందుగా నెట్‌వర్క్ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయమని మిమ్మల్ని అడగవచ్చు, లేదా నియమాలు, షరతులను అంగీకరించమని కోరవచ్చు. మీకు Wi-Fi నెట్‌వర్క్ పాస్‌వర్డ్ తెలియకపోతే, మీ నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్‌ను సంప్రదించండి.
నెట్‌వర్క్ పేరుకు పక్కన కోసం, అలానే స్క్రీన్ పై భాగంలో మూలన కోసం చూడండి. ఆ రెండు చిహ్నాలు మీకు కనిపిస్తున్నాయంటే మీరు విజయవంతంగా కనెక్ట్ చేశారని అర్థం.

మరింత సహాయాన్ని పొందండి
ప్రచురించబడిన తేదీ: