మీ iPhone లేదా iPadలో ఈమెయిల్ ఖాతాను జోడించండి
మీ iOS డివైజ్‌లోని Mail యాప్‌లో — ఆటోమేటిక్‌గా లేదా మాన్యువల్‌గా ఈమెయిల్ ఖాతాను సెటప్ చేయండి.
మీరు సాధారణంగా ఎక్కువ వాడుకలో ఉండే ఈమెయిల్ ప్రొవైడర్‌ను వాడుతుంటే, దాన్ని ఆటోమేటిక్‌గా సెటప్ చేయండి
మీరు iCloud, Google, Microsoft Exchange లేదా Yahoo వంటి ఈమెయిల్ ప్రొవైడర్‌ను ఉపయోగిస్తుంటే, Mail మీ ఈమెయిల్ అడ్రస్, పాస్‌వర్డ్‌తో మీ ఈమెయిల్ ఖాతాను ఆటోమేటిక్‌గా సెటప్ చేయగలదు. అదెలాగో ఇక్కడ ఉంది:
సెట్టింగ్‌లు > యాప్‌లు > Mailకు వెళ్లి, ఆపై Mail ఖాతాలను ట్యాప్ చేయండి.
ఖాతాను జోడించండి ఆప్షన్‌పై ట్యాప్ చేసి, ఆపై మీ ఈమెయిల్ అడ్రస్‌ను ఎంటర్ చేయండి. అవసరమైతే లిస్ట్ నుండి మీ ఈమెయిల్ ప్రొవైడర్‌ను ఎంచుకోండి.
ప్రాంప్ట్‌లను ఫాలో అవ్వండి, ఆపై మీ ఈమెయిల్ అడ్రస్‌ను, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయండి.
మీకు తర్వాత అనే ఆప్షన్ కనిపిస్తే, తర్వాత ఆప్షన్‌పై ట్యాప్ చేయండి, ఆపై Mail మీ ఖాతాను వెరిఫై చేసే వరకు వేచి ఉండండి.
మీకు సేవ్ చేయండి అనే ఆప్షన్ కనిపిస్తే, సేవ్ చేయండి ఆప్షన్‌పై ట్యాప్ చేయండి.
ఈమెయిల్ ప్రొవైడర్ లిస్ట్ నుండి మీ ఈమెయిల్ ఖాతాకు మ్యాచ్ అయ్యే దాన్ని ఎంచుకోండి
సాధారణంగా తక్కువగా ఉపయోగించే ఈమెయిల్ ప్రొవైడర్‌ల కోసం సెటప్ చేయడం
మీరు మీ ఈమెయిల్ ఖాతాను మాన్యువల్‌గా సెటప్ చేయాల్సి వస్తే, మీ ఖాతాకు సంబంధించిన ఈమెయిల్ సెట్టింగ్‌లు మీకు తెలుసని నిర్ధారించుకోండి. మీకు అవి తెలియకపోతే, మీరు వాటి కోసం వెతకవచ్చు లేదా మీ ఈమెయిల్ ప్రొవైడర్‌ను సంప్రదించవచ్చు. ఆపై, ఈ దశలను ఫాలో అవ్వండి:
సెట్టింగ్‌లు > యాప్‌లు > Mailకు వెళ్లి, ఆపై Mail ఖాతాలను ట్యాప్ చేయండి.
ఖాతాను జోడించండి ఆప్షన్‌పై ట్యాప్ చేయండి.
మీ ఈమెయిల్ అడ్రస్‌ను ఎంటర్ చేసి, ఆపై తర్వాత ఆప్షన్‌పై ట్యాప్ చేయండి.
మరొక ఖాతాను జోడించండి ఆప్షన్‌పై ట్యాప్ చేసి, ఆపై Mail ఖాతాపై ట్యాప్ చేయండి.
మీ పేరు, ఈమెయిల్ అడ్రస్, పాస్‌వర్డ్, ఇంకా మీ ఖాతా వివరణను ఎంటర్ చేయండి.
తర్వాత ఆప్షన్‌పై ట్యాప్ చేయండి. Mail, ఈమెయిల్ సెట్టింగ్‌లను కనుగొని, మీ ఖాతా సెటప్‌ను పూర్తి చేయడానికి ట్రై చేస్తుంది. Mail మీ ఈమెయిల్ సెట్టింగ్‌లను కనుగొంటే, మీ ఖాతా సెటప్‌ను పూర్తి చేయడానికి పూర్తయింది ఆప్షన్‌పై ట్యాప్ చేయండి.
Mail మీ ఖాతా సెట్టింగ్‌లను ఆటోమేటిక్‌గా కనుగొనలేకపోతే
Mail, మీ ఈమెయిల్ సెట్టింగ్‌లను కనుగొనలేకపోతే, మీరు వాటిని మాన్యువల్‌గా ఎంటర్ చేయాలి. తర్వాత ఆప్షన్‌పై ట్యాప్ చేసి, ఆపై ఈ దశలను ఫాలో అవ్వండి:
మీ కొత్త ఖాతా కోసం IMAP లేదా POPను ఎంచుకోండి. ఏది ఎంచుకోవాలో మీకు ఖచ్చితంగా తెలియకపోతే, మీ ఈమెయిల్ ప్రొవైడర్‌ను సంప్రదించండి.
ఇన్‌కమింగ్ Mail సర్వర్, అవుట్‌గోయింగ్ Mail సర్వర్‌కు సంబంధించిన సమాచారాన్ని ఎంటర్ చేయండి. ఆపై, తర్వాత ఆప్షన్‌పై ట్యాప్ చేయండి. మీ దగ్గర ఈ సమాచారం లేకపోతే, మీ ఈమెయిల్ ప్రొవైడర్‌ను సంప్రదించండి.
మీ ఈమెయిల్ సెట్టింగ్‌లు సరిగ్గా ఉంటే, పూర్తి చేయడానికి సేవ్ చేయండి ఆప్షన్‌పై ట్యాప్ చేయండి. ఈమెయిల్ సెట్టింగ్‌లు తప్పుగా ఉంటే, వాటిని ఎడిట్ చేయమని మిమ్మల్ని కోరడం జరుగుతుంది.
మీరు ఇప్పటికీ మీ ఈమెయిల్ ఖాతాను సెటప్ చేయలేకపోతే లేదా మీ ఈమెయిల్ సెట్టింగ్‌లను సేవ్ చేయలేకపోతే, మీ ఈమెయిల్ ప్రొవైడర్‌ను సంప్రదించండి.