iPhone బ్యాటరీ, పనితీరు

iPhone పనితీరుకు, మీ బ్యాటరీ హెల్త్‌కు మధ్య ఉన్న కనెక్షన్‌ను అర్థం చేసుకోండి.

మీ iPhoneను సులభంగా, అందరికీ ఉపయోగించడానికి వీలుగా డిజైన్ చేశారు. ఇదంతా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీలు, ఇంకా ఉన్నత స్థాయి ఇంజినీరింగ్ కలయిక వల్లే సాధ్యమైంది. టెక్నాలజీ రంగంలో ఒక ముఖ్యమైన విభాగం బ్యాటరీ, ఇంకా దాని పనితీరు. బ్యాటరీలు కాంప్లెక్స్ టెక్నాలజీతో పని చేస్తాయి, అనేక అంశాలు బ్యాటరీ పనితీరును, ఇంకా దానిపై ఆధారపడే iPhone పనితీరును ప్రభావితం చేస్తాయి. రీఛార్జ్ చేయగల బ్యాటరీలన్నీ కన్స్యూమబుల్స్, వీటికి పరిమిత జీవితకాలం ఉంటుంది—కొంతకాలానికి వాటి కెపాసిటీ, ఇంకా పనితీరు తగ్గుముఖం పడతాయి, కాబట్టి వాటిని రీప్లేస్ చేసుకోవాలి. iPhone బ్యాటరీల గురించి, ఇంకా బ్యాటరీ ఏజ్ iPhone పనితీరును ఎలా ప్రభావితం చేస్తుంది అనే దాని గురించి మరింత తెలుసుకోండి.

లిథియం-అయాన్ బ్యాటరీల గురించి

iPhone బ్యాటరీలలో లిథియం-అయాన్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. పాత తరాల బ్యాటరీ టెక్నాలజీతో పోలిస్తే, లిథియం-అయాన్ బ్యాటరీలు వేగంగా ఛార్జ్ అవుతాయి, ఎక్కువ కాలం పని చేస్తాయి, ఇంకా ఎక్కువ పవర్ డెన్సిటీని కలిగి ఉంటాయి, కాబట్టి తేలికైన ప్యాకేజీతో ఎక్కువ బ్యాటరీ లైఫ్‌ను ఇస్తాయి. రీఛార్జ్ చేయగల లిథియం-అయాన్ టెక్నాలజీ ప్రస్తుతం మీ డివైజ్‌కు అత్యుత్తమ టెక్నాలజీని అందిస్తుంది. లిథియం-అయాన్ బ్యాటరీల గురించి మరింత తెలుసుకోండి.

బ్యాటరీ పనితీరును ఎలా పెంచుకోవాలి

ఒక డివైజ్‌ను రీఛార్జ్ చేయడానికి ముందు అది రన్ అయిన సమయాన్ని “బ్యాటరీ లైఫ్” అంటారు. ఒక బ్యాటరీని రీప్లేస్ చేయడానికి ముందు అది ఎంత సమయం పాటు పని చేసిందో దాన్ని “బ్యాటరీ జీవితకాలం” అంటారు. మీరు మీ డివైజ్‌ను ఉపయోగించే విధానం బ్యాటరీ లైఫ్, జీవితకాలంపై ప్రభావం చూపుతుంది, మీ డివైజ్‌ను మీరు ఎలా వాడినా, బ్యాటరీ హెల్త్‌కు హెల్ప్ అయ్యే టిప్స్ ఎప్పటికీ అందుబాటులో ఉంటాయి. బ్యాటరీ జీవితకాలం దాని “కెమికల్ ఏజ్”పై ఆధారపడి ఉంటుంది, అంతేకానీ దాన్ని ఎన్నాళ్ళు వాడాం అనేది దానితో సంబంధం లేదు. ఇది చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది, ఉదాహరణకు, ఎన్ని సార్లు ఛార్జ్ చేశాం, దాన్ని ఎలా కేర్ తీసుకున్నాం వంటివి.

బ్యాటరీ పనితీరును ఎలా పెంచాలో, ఇంకా బ్యాటరీ జీవితకాలాన్ని ఎలా పొడిగించాలో తెలుసుకోండి. ఉదాహరణకు:

  • మీ iPhoneను మీరు ఎక్కువకాలం వాడకపోతే, దాన్ని సగమే ఛార్జ్ చేయండి.

  • ఎక్కువ వేడిగా ఉండే ప్రదేశాల్లో, ఇంకా నేరుగా ఎండ తగిలే చోట ఎక్కువ సమయం పాటు మీ iPhoneను ఛార్జ్ చేయడం కానీ వదిలేయడం కానీ చేయకండి.

బ్యాటరీల కెమికల్ ఏజ్ పెరుగుతున్నప్పుడు

రీఛార్జ్ చేయదగిన బ్యాటరీలన్నీ కన్‌స్యూమబుల్స్‌ కంపోనెంట్స్, కెమికల్ ఏజ్ పెరిగే కొద్దీ, వాటి పనితీరు తగ్గిపోతుంది.

లిథియం-అయాన్ బ్యాటరీల కెమికల్ ఏజ్ పెరిగే కొద్దీ, వాటి స్టోరేజ్ కెపాసిటీ తగ్గిపోతుంది, దాని వల్ల డివైజ్‌ను తక్కువ టైంలోనే మళ్లీ ఛార్జ్ చేయాల్సి వస్తుంది. దీనిని బ్యాటరీ గరిష్ఠ కెపాసిటీగా పేర్కొనవచ్చు—కొత్తగా ఉన్నప్పుడు ఎంత కెపాసిటీ ఉండేదో, ఇప్పుడెంత ఉందో ఇది చూపిస్తుంది. అదనంగా, గరిష్ఠ తక్షణ పనితీరును, లేదా "పీక్ పవర్"ను అందించగల బ్యాటరీ సామర్థ్యం కూడా తగ్గవచ్చు. ఫోన్ సరిగ్గా పని చేయాలంటే, ఎలక్ట్రానిక్స్‌కు బ్యాటరీ నుంచి వెంటనే పవర్ రావాలి. బ్యాటరీ తక్షణ పవర్‌ను అందించే సామర్థ్యాన్ని ప్రభావితం చేసే అంశాల్లో ఒకటి దాని ఇంపీడెన్స్. ఇంపీడెన్స్ ఎక్కువగా ఉన్న బ్యాటరీ, అవసరమైనప్పుడు సిస్టమ్‌కు సరిపడా పవర్‌ను అందించలేకపోవచ్చు. బ్యాటరీ కెమికల్ ఏజ్ పెరిగినప్పుడు, దాని ఇంపీడెన్స్ కూడా పెరుగుతుంది. బ్యాటరీలో ఛార్జ్ తక్కువగా ఉన్నప్పుడు లేదా అది చల్లటి వాతావరణంలో ఉన్నప్పుడు, దాని ఇంపీడెన్స్ తాత్కాలికంగా పెరుగుతుంది. కెమికల్ ఏజ్ ఎక్కువగా ఉన్నప్పుడు, ఇంపీడెన్స్ పెరుగుదల ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. ఇవి పరిశ్రమలోని అన్ని లిథియం-అయాన్ బ్యాటరీలకు సాధారణంగా ఉండే బ్యాటరీ కెమిస్ట్రీ లక్షణాలు.

ఎక్కువ ఇంపీడెన్స్ ఉన్న బ్యాటరీ నుంచి డివైజ్ పవర్ తీసుకున్నప్పుడు, బ్యాటరీ వోల్టేజ్ మరింతగా పడిపోతుంది. ఎలక్ట్రానిక్ భాగాలు సరిగ్గా పని చేయడానికి వాటికి కనీస వోల్టేజ్ అవసరం పడుతుంది. ఇందులో డివైజ్ ఇంటర్నల్ స్టోరేజ్, పవర్ సర్క్యూట్స్, అలాగే బ్యాటరీ కూడా వస్తాయి. పవర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఈ పవర్‌ను సరఫరా చేయడానికి బ్యాటరీ సామర్థ్యాన్ని నిర్ణయిస్తుంది, ఇంకా కార్యకలాపాలను మెయిన్‌టెయిన్ చేయడానికి లోడ్‌లను మేనేజ్ చేస్తుంది. పవర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ యొక్క పూర్తి సామర్థ్యాలతో ఆపరేషన్‌లకు ఇకపై మద్దతు లభించనప్పుడు, ఈ ఎలక్ట్రానిక్ భాగాలను సంరక్షించడానికి సిస్టమ్ షట్‌డౌన్‌ను నిర్వహిస్తుంది. డివైజ్ దృష్టికోణంలో ఈ షట్‌డౌన్ ఉద్దేశపూర్వకంగానే జరిగినప్పటికీ, యూజర్‌కు ఇది అనూహ్యంగా అనిపించవచ్చు.

ఊహించని షట్‌డౌన్‌లు అవ్వకుండా ఆపడం

మీ బ్యాటరీలో ఛార్జ్ తక్కువగా ఉన్నప్పుడు, కెమికల్ ఏజ్ ఎక్కువగా ఉన్నప్పుడు, లేదా చల్లటి వాతావరణంలో ఉన్నప్పుడు మీరు ఊహించని షట్‌డౌన్‌లను ఎదుర్కొనే అవకాశం ఉంది. తీవ్రమైన సందర్భాల్లో, షట్‌డౌన్‌లు తరచుగా సంభవించవచ్చు, దీని వలన డివైజ్ నమ్మదగనిదిగా లేదా ఉపయోగించలేనిదిగా అవుతుంది. iPhone 6, iPhone 6 Plus, iPhone 6s, iPhone 6s Plus, iPhone SE (1వ జనరేషన్), iPhone 7, ఇంకా iPhone 7 Plusలలో, పవర్ వినియోగం అధికంగా ఉన్నప్పుడు iOS, పనితీరును ఆటోమేటిక్‌గా మేనేజ్ చేస్తుంది, దీని వలన డివైజ్ ఊహించని విధంగా షట్‌డౌన్ అవ్వకుండా ఉంటుంది, అప్పుడు మీరు మీ iPhone‌ను నిరంతరాయంగా ఉపయోగించవచ్చు. ఈ పనితీరు మేనేజ్‌మెంట్ ఫీచర్ ప్రత్యేకంగా iPhone‌కే ఉంది, మిగతా Apple ప్రొడక్ట్స్‌కు ఇది వర్తించదు. iOS 12.1 నుండి, iPhone 8, iPhone 8 Plus, ఇంకా iPhone Xలలో ఈ ఫీచర్ ఉంటుంది; iOS 13.1 నుండి iPhone XS, iPhone XS Max, ఇంకా iPhone XRలలో కూడా ఈ ఫీచర్ లభిస్తుంది. iPhone 11, ఇంకా ఆ తర్వాత వచ్చిన డివైజ్‌లలో పనితీరు మేనేజ్‌మెంట్ గురించి తెలుసుకోండి.

iPhone పనితీరు మేనేజ్‌మెంట్ అనేది డివైజ్ ఉష్ణోగ్రత, బ్యాటరీలో ఉన్న ఛార్జ్ స్థాయి, ఇంకా బ్యాటరీ ఇంపీడెన్స్ అంశాలను పరిశీలించడం ద్వారా పని చేస్తుంది. ఈ వేరియబుల్స్ కారణంగా ఊహించని షట్‌డౌన్‌లు జరిగే అవకాశం ఉన్నప్పుడు మాత్రమే, iOS డైనమిక్‌గా CPU, GPU వంటి కొన్ని సిస్టమ్ భాగాల గరిష్ట పనితీరును మేనేజ్ చేస్తుంది. దీని ఫలితంగా, డివైజ్‌లోని పనులు ఈజీగా ఆటోమేటిక్‌గా బ్యాలెన్స్ అవుతాయి. ఒక్కసారిగా పనితీరులో పెద్ద స్పైక్స్ రాకుండా, సిస్టమ్ టాస్క్‌లు స్మూత్‌గా, సమంగా డిస్ట్రిబ్యూట్ అవుతాయి. కొన్ని సందర్భాల్లో, మీరు డివైజ్ పనితీరులో ఎటువంటి తేడాలను గమనించకపోవచ్చు. మీ డివైజ్‌లో పనితీరు మేనేజ్‌మెంట్ ఎంతవరకు అవసరమో దాని ఆధారంగా, మీరు గమనించే మార్పు స్థాయి ఉంటుంది.

మరింత తీవ్రమైన పనితీరు మేనేజ్‌మెంట్ అవసరమయ్యే సందర్భాల్లో, మీరు ఇలాంటి ప్రభావాలను గమనించవచ్చు:

  • యాప్‌ లాంచ్ అవ్వడానికి ఎక్కువ సమయం పట్టడం

  • స్క్రోల్ చేస్తున్నప్పుడు ఫ్రేమ్ రేట్లు తగ్గడం

  • బ్యాక్‌లైట్ డిమ్మింగ్ (దీనిని కంట్రోల్ సెంటర్‌లో ఓవర్‌రైడ్ చేయవచ్చు)

  • స్పీకర్ వాల్యూమ్ సుమారు –3dB వరకు తగ్గడం

  • కొన్ని యాప్‌లలో క్రమంగా ఫ్రేమ్-రేట్ తగ్గింపులు

  • అత్యంత తీవ్రమైన సందర్భాల్లో, కెమెరా UIలో కనిపించే విధంగా కెమెరా ఫ్లాష్ డిజేబుల్ అవ్వడం

  • బ్యాక్‌గ్రౌండ్‌లో రిఫ్రెష్ అయ్యే యాప్‌లు, లాంచ్ చేసినప్పుడు మళ్లీ పూర్తిగా రీలోడ్ కావాల్సి రావడం

ఈ పనితీరు మేనేజ్‌మెంట్ ఫీచర్ వల్ల అనేక కీలక అంశాలు ప్రభావితం కావు. వీటిలో కొన్ని:

  • సెల్యులార్ కాల్ క్వాలిటీ, నెట్‌వర్కింగ్ త్రూపుట్ పనితీరు

  • క్యాప్చర్ చేసిన ఫోటో, వీడియో క్వాలిటీ

  • GPS పనితీరు

  • లొకేషన్ ఖచ్చితత్వం

  • గైరోస్కోప్, యాక్సిలెరోమీటర్, బారోమీటర్ వంటి సెన్సార్లు

  • Apple Pay

బ్యాటరీ ఛార్జ్ తక్కువగా ఉన్నప్పుడు లేదా చల్లటి వాతావరణంలో ఉన్నప్పుడు, పనితీరు మేనేజ్‌మెంట్‌లో జరిగే మార్పులు తాత్కాలికమైనవే. డివైజ్ బ్యాటరీ కెమికల్ ఏజ్ ఎక్కువ ఉంటే, పనితీరు మేనేజ్‌మెంట్‌లో జరిగే మార్పులు తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అన్ని రీఛార్జ్ బ్యాటరీలు కన్స్యూమబుల్స్‌నే. వాటికి లిమిటెడ్ లైఫ్ ఉంటుంది, చివరికి వాటినీ రీప్లేస్ చేయాల్సిందే. దీని వల్ల మీరు ప్రభావితమైతే, ఇంకా మీ డివైజ్ పనితీరును మెరుగుపరచుకోవాలనుకుంటే, ఈ విషయంలో మీ డివైజ్ బ్యాటరీని మార్చడం హెల్ప్ అవుతుంది.

iOS 11.3, ఆ తర్వాత వచ్చిన డివైజ్‌లలో

iOS 11.3, ఇంకా ఆ తర్వాత వచ్చిన డివైజ్‌లు పనితీరు మేనేజ్‌మెంట్‌ను మెరుగుపరుస్తాయి, ఇంకా ఊహించని షట్‌డౌన్‌లను నివారించడానికి ఎంతవరకు పనితీరు మేనేజ్‌మెంట్‌ అవసరమో అవి క్రమం తప్పకుండా అంచనా వేస్తాయి. బ్యాటరీ హెల్త్ సిస్టమ్ గమనించిన గరిష్ఠ పవర్ అవసరాలను తీర్చగలిగితే, పనితీరు మేనేజ్‌మెంట్‌ స్థాయి తగ్గించబడుతుంది. ఊహించని షట్‌డౌన్ మళ్లీ సంభవిస్తే, పనితీరు మేనేజ్‌మెంట్‌ స్థాయి పెరుగుతుంది. ఈ అంచనా నిరంతరం జరుగుతూనే ఉంటుంది, అందువల్ల పనితీరు మేనేజ్‌మెంట్‌ మరింత అనుకూలంగా మారుతుంది.

సిస్టమ్ మొత్తం పనితీరును పెంచడానికి, iPhone 8, ఇంకా ఆ తర్వాత వచ్చిన మోడల్స్‌లో అధునాతన హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ డిజైన్ ఉపయోగించారు, ఇవి డివైజ్‌కు ఎంత పవర్ అవసరమో, అలాగే బ్యాటరీ ఎంత పవర్ అందించగలదో మరింత ఖచ్చితంగా అంచనా వేస్తాయి. దీని వలన iOS ఊహించని షట్‌డౌన్ జరిగే అవకాశాన్ని ముందుగానే ఖచ్చితంగా అంచనా వేసి, దాన్ని ఆపగలదు. దీని ఫలితంగా, iPhone 8, ఇంకా ఆ తర్వాత వచ్చిన మోడల్స్‌లో పనితీరు మేనేజ్‌మెంట్‌ ప్రభావాలు అంతగా కనిపించకపోవచ్చు. కాలక్రమేణా, అన్ని iPhone మోడల్స్‌లోని రీఛార్జ్ చేయగల బ్యాటరీల కెపాసిటీ, గరిష్ఠ పనితీరు తగ్గిపోతాయి, చివరికి వాటిని రీప్లేస్ చేయాల్సిన అవసరం వస్తుంది.

బ్యాటరీ స్క్రీన్, బ్యాటరీ శాతం, తక్కువ పవర్ మోడ్, ఇంకా బ్యాటరీ స్థాయి చార్ట్‌ను చూపుతుంది.

బ్యాటరీ హెల్త్

iPhone 6, ఇంకా తర్వాత వచ్చిన మోడల్స్‌లో iOS, బ్యాటరీ హెల్త్ చూపించే కొత్త ఫీచర్లు జోడించింది, అవసరమైతే బ్యాటరీని రీప్లేస్ చేసుకోవాలని కూడా ఇది సూచిస్తుంది. మీరు వీటిని సెట్టింగ్‌లు > బ్యాటరీ > బ్యాటరీ హెల్త్ & ఛార్జింగ్‌లో కనుగొనవచ్చు (iOS 16.0 లేదా అంతకు ముందు వెర్షన్‌లలో, వీటిని సెట్టింగ్‌లు > బ్యాటరీ > బ్యాటరీ హెల్త్‌లో కనుగొనండి).

అదనంగా, ఊహించని షట్‌డౌన్‌లను నిరోధించడానికి గరిష్ఠ పనితీరును డైనమిక్‌గా మేనేజ్ చేసే పనితీరు-మేనేజ్‌మెంట్ ఫీచర్ ఆన్‌లో ఉందో లేదో మీరు చూడవచ్చు, ఇంకా మీరు కావాలంటే దాన్ని ఆఫ్ కూడా చేయవచ్చు. బ్యాటరీ గరిష్ఠ పవర్‌ను తక్షణమే అందించే సామర్థ్యం తగ్గిన డివైజ్‌లో, ఊహించిన షట్‌డౌన్ ఒకసారి జరిగిన తర్వాత మాత్రమే ఈ ఫీచర్ ఎనేబుల్ అవుతుంది. ఈ ఫీచర్ iPhone 6, iPhone 6 Plus, iPhone 6s, iPhone 6s Plus, iPhone SE (1వ జనరేషన్), iPhone 7, ఇంకా iPhone 7 Plusలకు వర్తిస్తుంది. iOS 12.1 నుండి, iPhone 8, iPhone 8 Plus, ఇంకా iPhone Xలలో ఈ ఫీచర్ ఉంటుంది; iOS 13.1 నుండి iPhone XS, iPhone XS Max, ఇంకా iPhone XRలలో కూడా ఈ ఫీచర్ లభిస్తుంది. iPhone 11, ఇంకా ఆ తర్వాత వచ్చిన డివైజ్‌లలో పనితీరు మేనేజ్‌మెంట్ గురించి తెలుసుకోండి. ఈ కొత్త మోడల్స్‌పై పనితీరు మేనేజ్‌మెంట్ ప్రభావాలు వాటి అధునాతన హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ డిజైన్ కారణంగా అంతగా గమనించబడకపోవచ్చు.

iOS 11.2.6 లేదా అంతకంటే పాత వెర్షన్‌ నుంచి అప్‌డేట్ చేసిన డివైజ్‌లలో, పనితీరు మేనేజ్‌మెంట్ మొదట డిజేబుల్ అయి ఉంటుంది; ఆ తర్వాత డివైజ్ ఊహించని విధంగా షట్‌డౌన్ అయితే మాత్రమే ఇది మళ్లీ ఎనేబుల్ అవుతుంది.

బ్యాటరీ, మొత్తం సిస్టమ్ డిజైన్‌ చేసిన విధంగా పని చేయడానికి, అలాగే అంతర్గత భాగాలను రక్షించడానికి, అన్ని iPhone మోడల్స్‌లో ప్రాథమిక పనితీరు మేనేజ్‌మెంట్ ఉంటుంది. ఇందులో వేడిగా లేదా చల్లగా ఉన్న వాతావరణంలో ప్రవర్తన, అలాగే ఇంటర్నల్ వోల్టేజ్ మేనేజ్‌మెంట్ కూడా ఉంటాయి. ఈ రకమైన పనితీరు మేనేజ్‌మెంట్ భద్రత, ఆశించిన పనితీరు కోసం అవసరం, ఇంకా దీన్ని ఆఫ్ చేయడం సాధ్యం కాదు.

గరిష్ఠ కెపాసిటీని హైలైట్ చేస్తూ చూపించే బ్యాటరీ హెల్త్ స్క్రీన్.

మీ బ్యాటరీ గరిష్ఠ కెపాసిటీ

బ్యాటరీ హెల్త్ స్క్రీన్‌లో గరిష్ఠ బ్యాటరీ కెపాసిటీ, గరిష్ఠ పనితీరు సామర్థ్యం గురించిన సమాచారం ఉంటుంది.

గరిష్ట బ్యాటరీ కెపాసిటీ అనేది, కొత్తగా ఉన్నప్పుడు బ్యాటరీ ఎంత కెపాసిటీ కలిగి ఉందో దానితో పోల్చి, ప్రస్తుత కెపాసిటీని చూపిస్తుంది. బ్యాటరీ కెమికల్ ఏజ్ పెరిగేకొద్దీ దాని కెపాసిటీ తగ్గుతుంది, దీని వలన ఛార్జ్‌ల మధ్య వాడుక గంటలు తగ్గిపోవచ్చు. iPhone తయారైన సమయం, మీరు దాన్ని యాక్టివేట్ చేసిన సమయం మధ్య గ్యాప్ ఎక్కువగా ఉంటే, బ్యాటరీ కెపాసిటీ 100 శాతం కంటే కొద్దిగా తక్కువగా చూపించవచ్చు.

iPhone 14, అంతకంటే పాత మోడల్స్‌లోని బ్యాటరీలు నార్మల్ కండిషన్స్‌లో 500 సార్లు ఫుల్ ఛార్జ్ చేసినా, ఒరిజినల్ కెపాసిటీకి 80% వరకు మిగిలేలా డిజైన్ చేశారు.1 iPhone 15 బ్యాటరీలు, నార్మల్ కండిషన్స్‌లో 1000 సార్లు ఫుల్ ఛార్జ్ చేసినా, ఒరిజినల్ కెపాసిటీకి 80% వరకు మిగిలేలా డిజైన్ చేశారు.1 అన్ని మోడల్స్‌లో, బ్యాటరీ ఖచ్చితమైన కెపాసిటీ శాతం అనేది మీరు డివైజ్‌లను ఎలా వాడుతున్నారు, ఎలా ఛార్జ్ చేస్తున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఒక సంవత్సరం వారంటీలో (తుర్కియేలో రెండేళ్ల వారంటీ), డిఫెక్టివ్ బ్యాటరీకి కూడా సర్వీస్ కవరేజ్ ఉంటుంది, ఇది స్థానిక వినియోగదారుల చట్టాల కింద లభించే హక్కులకు అదనంగా ఉంటుంది. వారంటీ ముగిసిపోయినట్లయితే, Apple బ్యాటరీ సర్వీస్‌కు ఛార్జీ విధిస్తుంది. ఛార్జ్ సైకిల్స్ గురించి మరింత తెలుసుకోండి.

మీ బ్యాటరీ హెల్త్ క్షీణిస్తున్న కొద్దీ, గరిష్ఠ పనితీరును అందించే దాని సామర్థ్యం కూడా క్షీణిస్తుంది. బ్యాటరీ హెల్త్ స్క్రీన్‌లో గరిష్ఠ పనితీరు సామర్థ్యం అనే విభాగం ఉంటుంది, ఇందులో ఈ మెసేజ్‌లు కనిపించవచ్చు.

పనితీరు సాధారణంగా ఉంది

బ్యాటరీ స్థితి సాధారణ గరిష్ఠ పనితీరును సపోర్ట్ చేయగలిగితే, పనితీరు మేనేజ్‌మెంట్ ఫీచర్లు వర్తించకపోతే, మీకు ఈ మెసేజ్ కనిపిస్తుంది:

మీ బ్యాటరీ ప్రస్తుతం సాధారణ గరిష్ఠ పనితీరును సపోర్ట్ చేస్తోంది.

గరిష్ఠ కెపాసిటీని హైలైట్ చేస్తూ చూపించే బ్యాటరీ హెల్త్ స్క్రీన్.

పనితీరు మేనేజ్‌మెంట్ వర్తింపజేయబడింది

పనితీరు మేనేజ్‌మెంట్ ఫీచర్లు వర్తింపజేయబడినప్పుడు, మీకు ఈ మెసేజ్ కనిపిస్తుంది:

బ్యాటరీ అవసరమైన గరిష్ఠ పవర్‌ను అందించలేకపోయినందున ఈ iPhone ఊహించని షట్‌డౌన్‌ను ఎదుర్కొంది. ఇది మళ్ళీ జరగకుండా ఆపడానికి పనితీరు మేనేజ్‌మెంట్ వర్తింపజేయబడింది. డిజేబుల్ చేయండి...

మీరు పనితీరు మేనేజ్‌మెంట్‌ను డిజేబుల్ చేస్తే, దాన్ని తిరిగి ఆన్ చేయలేరని గమనించండి. ఊహించని షట్‌డౌన్ సంభవిస్తే అది ఆటోమేటిక్‌గా మళ్లీ ఆన్ అవుతుంది. డిజేబుల్ చేసే ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది.

గరిష్ఠ కెపాసిటీని హైలైట్ చేస్తూ చూపించే బ్యాటరీ హెల్త్ స్క్రీన్.

పనితీరు మేనేజ్‌మెంట్‌ ఆఫ్ చేయబడింది

మీరు వర్తింపజేయబడిన పనితీరు మేనేజ్‌మెంట్‌ ఫీచర్‌ను డిజేబుల్ చేస్తే, మీకు ఈ మెసేజ్ కనిపిస్తుంది:

బ్యాటరీ అవసరమైన గరిష్ఠ పవర్‌ను అందించలేకపోయినందున ఈ iPhone ఊహించని షట్‌డౌన్‌ను ఎదుర్కొంది. మీరు పనితీరు మేనేజ్‌మెంట్ రక్షణలను మాన్యువల్‌గా డిజేబుల్ చేశారు.

డివైజ్ మరోసారి ఊహించని షట్‌డౌన్‌ను ఎదుర్కొంటే, పనితీరు-మేనేజ్‌మెంట్ ఫీచర్లు తిరిగి వర్తింపజేయబడతాయి. డిజేబుల్ చేసే ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది.

గరిష్ఠ కెపాసిటీని హైలైట్ చేస్తూ చూపించే బ్యాటరీ హెల్త్ స్క్రీన్.

బ్యాటరీ హెల్త్ క్షీణించింది

బ్యాటరీ ఆరోగ్యం గణనీయంగా క్షీణించినట్లయితే, మీకు ఈ కింది మెసేజ్ కూడా కనిపిస్తుంది:

మీ బ్యాటరీ హెల్త్ గణనీయంగా క్షీణించింది. Apple అధికారిక సర్వీస్ ప్రొవైడర్ పూర్తి పనితీరు, సామర్థ్యాన్ని పునరుద్ధరించడానికి బ్యాటరీని రీప్లేస్ చేయగలదు. సర్వీస్ ఆప్షన్‌ల గురించి మరింత సమాచారం...

ఈ మెసేజ్ భద్రతా సమస్యను సూచించడం లేదు. మీరు ఇప్పటికీ మీ బ్యాటరీని ఉపయోగించవచ్చు. అయితే, మీరు మరింత గమనించదగిన బ్యాటరీ, పనితీరు సమస్యలను ఎదుర్కోవచ్చు. కొత్త రీప్లేస్‌మెంట్ బ్యాటరీతో మీ అనుభవాన్ని మెరుగుపరచుకోవడానికి, సర్వీస్‌ను పొందండి.

గరిష్ఠ కెపాసిటీని హైలైట్ చేస్తూ చూపించే బ్యాటరీ హెల్త్ స్క్రీన్.

వెరిఫై చేయడం సాధ్యం కాలేదు

మీకు ఈ కింది మెసేజ్ కనిపిస్తే, మీ iPhoneలోని బ్యాటరీని వెరిఫై చేయడం సాధ్యం కాలేదని అర్థం. ఈ మెసేజ్ iPhone XS, iPhone XS Max, iPhone XR, ఇంకా ఆ తర్వాత వచ్చిన మోడల్స్‌లో వర్తిస్తుంది.2

ఈ iPhone‌లో ఒరిజినల్ Apple బ్యాటరీ ఉందో లేదో వెరిఫై చేయలేకపోయింది. ఈ బ్యాటరీకి సంబంధించిన వివరాలు ఖచ్చితంగా ఉండకపోవచ్చు. మరింత తెలుసుకోండి...

ఈ స్క్రీన్‌పై కనిపంచే బ్యాటరీ హెల్త్ సమాచారం ఖచ్చితమైనది కాకపోవచ్చు. మీ బ్యాటరీని చెక్ చేసుకోవడానికి, సర్వీస్‌ను పొందండి.

గరిష్ఠ కెపాసిటీని హైలైట్ చేస్తూ చూపించే బ్యాటరీ హెల్త్ స్క్రీన్.

ఒరిజినల్ iPhone బ్యాటరీల గురించి మరింత తెలుసుకోండి

iPhone 11, iPhone 11 Pro, iPhone 11 Pro Maxలో బ్యాటరీ హెల్త్ రిపోర్టింగ్‌ను కరెక్ట్‌గా చూపించేందుకు రీక్యాలిబ్రేషన్ చేస్తారు

iOS 14.5, ఆ తర్వాత వచ్చిన వెర్షన్లలో, కొంతమంది యూజర్లకు తప్పుగా చూపబడుతున్న బ్యాటరీ హెల్త్ రిపోర్ట్‌ అంచనాలను సరి చేయడానికి అప్‌డేట్‌ను చేర్చడం జరిగింది. iPhone 11, iPhone 11 Pro, ఇంకా iPhone 11 Pro Maxలో, బ్యాటరీ హెల్త్ రిపోర్టింగ్ సిస్టమ్, గరిష్ఠ బ్యాటరీ కెపాసిటీని, గరిష్ఠ పనితీరు సామర్థ్యాన్ని రీక్యాలిబ్రేట్ చేస్తుంది.

iOS 14.5లో బ్యాటరీ హెల్త్ రిపోర్టింగ్‌కు సంబంధించిన రీక్యాలిబ్రేషన్ గురించి మరింత తెలుసుకోండి

బ్యాటరీ సర్వీస్, రీసైక్లింగ్ గురించి తెలుసుకోండి

  1. మీరు iPhone వాడుతున్నప్పుడల్లా, దాని బ్యాటరీ ఛార్జ్ సైకిల్స్ అవుతుంది. మీరు మీ బ్యాటరీ కెపాసిటీలో 100 శాతం మొత్తాన్ని ఉపయోగించినప్పుడు మీరు ఒక ఛార్జ్ సైకిల్‌ను పూర్తి చేస్తారు. పూర్తి ఛార్జ్ సైకిల్‌ను, కాలక్రమేణా బ్యాటరీ కెపాసిటీ తగ్గుతుందని దృష్టిలో పెట్టుకుని, అసలు కెపాసిటీకి 80% నుంచి 100% మధ్య నార్మలైజ్ చేస్తారు.

  2. iPhone X లేదా పాత మోడల్స్‌లో, 'వెరిఫై కాలేదు'కు బదులుగా, మీకు "ముఖ్యమైన బ్యాటరీ మెసేజ్. ఈ iPhone బ్యాటరీ హెల్త్‌ను చెక్ చేయలేకపోయింది" అనే మెసేజ్ కనిపించవచ్చు.

ప్రచురించబడిన తేదీ: